Heat wave alert : ప్చ్.. నెల చివరి వరకు నో రిలీఫ్! ఈ ప్రాంతాలకు ఐఎండీ హీట్‌వేవ్ అలర్ట్..
Andhra Pradesh heatwave : దేశంలో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీచేసింది. నెల చివరి వరకు ఇదే పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. ప్రాంతాల వారీగా రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు ఇచ్చింది.
భారతదేశంలో ఒకవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా దూసుకొస్తుండగా, మరోవైపు దేశంలోని మెజారిటీ రాష్ట్రాలను తీవ్ర వడగాల్పులు వణికిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎండలకు అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ చేదు వార్త ఇచ్చింది. మే నెలాఖరు వరకు మధ్య, వాయువ్య, తూర్పు భారతదేశంలో భానుడి ప్రతాపం ఇలాగే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ 'రెడ్', 'ఆరెంజ్' అలర్ట్‌లను జారీ చేసింది.

అయితే, ఊరట కలిగించే విషయంగా మే 26 నాడే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ఎండ తీవ్రత.. ఎక్కడెక్కడ ఏ అలర్ట్?
వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎం. మహాపాత్ర తెలిపిన వివరాల ప్రకారం.. వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావం కేవలం హిమాలయాల పైభాగాలకే పరిమితం కావడంతో మైదాన ప్రాంతాల్లో వేడి గాలులు, ధూళి తుపానులు కొనసాగుతాయి.
రెడ్ అలర్ట్ : ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వాటి పరిసర ప్రాంతాలకు తదుపరి రెండు రోజుల పాటు 'రెడ్ అలర్ట్' జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో అన్ని వయసుల వారికి వడదెబ్బ తగిలే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.
ఆరెంజ్ అలర్ట్ : వాయువ్య, మధ్య భారత దేశంలోని పెద్ద ప్రాంతాలకు రాబోయే ఐదు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఎండలో ఎక్కువసేపు ఉండేవారు, శారీరక శ్రమ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
రాష్ట్రాల వారీగా అంచనా (మే 29 వరకు): పంజాబ్, హరియానా, దిల్లీ, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, విదర్భలలో తీవ్ర వడగాల్పులు వీస్తాయి. తెలంగాణలో మే 26 వరకు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా లోపలి ప్రాంతాల్లో మే 27 వరకు వడగాల్పుల ప్రభావం ఉంటుంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో మే 24న ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది.
ఎల్ నినో భయం: జూన్, జులై, ఆగస్టు కాలంలో 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడటానికి 90% కంటే ఎక్కువ అవకాశం ఉందని యూఎస్ ఏజెన్సీ ఎన్ఓఏఏ అంచనా వేసింది. భారతదేశంలో ఎల్ నినో వస్తే వేసవి తీవ్రత పెరగడమే కాకుండా, రుతుపవనాలు బలహీనపడే ప్రమాదం ఉంది.
ప్రజలకు ఆరోగ్య సూచనలు..
చిన్న పిల్లలు, వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఎండ తగలకుండా జాగ్రత్తపడాలని ఐఎండీ సూచించింది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా నిరంతరం ద్రవపదార్థాలు తీసుకోవాలని హెచ్చరించింది.
కేరళకు ముందే రానున్న రుతుపవనాలు..
ఎండలు మండిపోతున్న వేళ రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక విషయం వెల్లడింంచింది. సాధారణంగా జూన్ 1న భారత గడ్డను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు.. ఈసారి ఐదు రోజుల ముందే, అంటే మే 26 నాడే కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది (దీనికి ±4 రోజుల మోడల్ ఎర్రర్ ఉంటుంది) అని వివరించింది.
ప్రస్తుతం రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రం, కామోరిన్ ప్రాంతం, అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని మెజారిటీ ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే 3-4 రోజుల్లో ఇవి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీని ప్రభావంతో కేరళ, లక్ష్వద్వీప్, తమిళనాడు, ఈశాన్య భారత రాష్ట్రాలలో రాబోయే 4-5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


