Best mileage bike : ఏకంగా 72 కేఎంపీఎల్ మైలేజ్​తో కొత్తగా హీరో సూపర్ స్ల్పెండర్ బైక్​- ధర కూడా తగ్గింది!​

Hero Super Splendor XTEC 2.0 price : సూపర్ స్ల్పెండర్ ఎక్స్​టెక్​ 2.0 బైక్​ని లాంచ్​ చేసింది హీరో మోటోకార్ప్. పాత మోడల్​తో పోల్చితే కొత్త బైక్ మైలేజ్​ పెరిగింది. ధర తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ బైక్​ పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: May 28, 2026, 10:05:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hero Super Splendor XTEC 2.0 launch : దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హీరో మోటోకార్ప్’.. తన పాపులర్ 125సీసీ కమ్యూటర్ బైక్ శ్రేణిలో సరికొత్త 'హీరో సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ 2.0' మోడల్‌ను భారత మార్కెట్​లోకి అధికారికంగా విడుదల చేసింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈ సరికొత్త బైక్‌లో కంపెనీ లుక్స్ పరంగా కొన్ని మార్పులు చేయడంతో పాటు అదనపు ఫీచర్లను జోడించింది. వీటన్నింటికీ మించి పాత బైక్ కంటే ఇది ఎక్కువ మైలేజ్ ఇవ్వడమే కాకుండా, తక్కువ ధరకు లభిస్తుండటం విశేషం.

హీరో సూపర్ స్ల్పెండర్ ఎక్స్​టెక్​ 2.0 ఇదిగో..
హీరో సూపర్ స్ల్పెండర్ ఎక్స్​టెక్​ 2.0 ఇదిగో..

హీరో సంస్థకు చెందిన గ్లామర్, గ్లామర్ ఎక్స్, ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్‌లను నిర్మించిన అదే 125సీసీ ప్లాట్‌ఫామ్‌పైనే ఈ సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ 2.0 కూడా రూపుదిద్దుకుంది. రోజువారీ ఆఫీస్, వ్యాపార అవసరాల కోసం బైక్ వాడే మిడిల్ క్లాస్ ప్రజలను టార్గెట్ చేస్తూ ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కంపెనీ తెచ్చింది.

ఈ సరికొత్త మైలేజ్ బైక్ పూర్తి వివరాలు, ధర, ఫీచర్లు ఇక్కడ చూద్దాం:

1. పెరిగిన మైలేజ్.. పవర్‌ఫుల్ ఇంజన్..

సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ 2.0 లో కంపెనీ పాత ఇంజన్‌నే కొనసాగించినప్పటికీ, మైలేజ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది.

ఇంజన్ సామర్థ్యం: ఇందులో 124.7సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 10.7 హెచ్​పీ పవర్ (7,500 ఆర్పీఎం వద్ద), 10.6 ఎన్​ఎం టార్క్‌ను (6,000 ఆర్పీఎం వద్ద) ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్ అప్‌గ్రేడ్: పాత సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ లీటరుకు 68 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేయగా.. ఈ సరికొత్త ఎక్స్​టెక్ 2.0 మోడల్ ఏకంగా 72 కేఎంపీఎల్ అద్భుతమైన మైలేజ్ ఇస్తుందని హీరో మోటోకార్ప్ స్పష్టం చేసింది.

ఇందుకోసం కంపెనీకి చెందిన అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, ట్రాఫిక్‌లో పడినప్పుడు ఇంజన్‌ను ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసే i3S (ఐడిల్ స్టాప్-స్టార్ట్) సిస్టమ్ ఎంతగానో దోహదపడతాయి.

2. కొత్తగా 'హాజార్డ్ లైట్స్'.. అదిరిపోయే ఫీచర్లు..

కస్టమర్ల సేఫ్టీ, కంఫర్ట్ కోసం హీరో సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ 2.0 బైక్​లో లేటెస్ట్ ఫీచర్లను జోడించారు:

హాజార్డ్ లైట్స్ : ఈ సిరీస్‌లోనే మొదటిసారిగా అత్యవసర సమయాల్లో లేదా దట్టమైన పొగమంచులో బైక్ నడిపేటప్పుడు నాలుగు ఇండికేటర్లు ఒకేసారి వెలిగే 'హాజార్డ్ లైట్స్' ఫీచర్‌ను ఇందులో చేర్చారు.

కనెక్టివిటీ: ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది ఫోన్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్​ని చూపిస్తుంది.

ప్రయాణంలో మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించారు.

3. లుక్స్, రంగుల వివరాలు..

హీరో సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ 2.0 మోడల్‌కు ప్రీమియం లుక్ ఇచ్చేందుకు కంపెనీ బాడీపై సరికొత్త డ్యూయల్-టోన్ గ్రాఫిక్స్, ఎక్స్‌టెక్ 2.0 బ్యాడింగ్, ట్యాంక్​పై 3డీ లోగోను అమర్చింది. సీటుకు ప్రత్యేకమైన స్టిచ్చింగ్‌తో కూడిన డ్యూయల్-టెక్స్చర్ ఫినిషింగ్ ఇచ్చారు. అలాగే వీల్స్ చుట్టూ రిమ్ టేపులను అంటించారు.

ఈ బైక్ మొత్తం 5 ఆకర్షణీయమైన రంగులలో లభించనుంది. అవి..

గ్లోసీ బ్లాక్

కాండీ బ్లేజింగ్ రెడ్

మ్యాట్ యాక్సిస్ గ్రే

మ్యాట్ నెక్సస్ బ్లూ

మ్యాట్ చెస్ట్‌నట్ బ్రౌన్

హీరో సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ 2.0 ఎక్స్-షోరూమ్ ధర వివరాలు..

హీరో మోటోకార్ప్ ఈ సరికొత్త సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ 2.0 ఎక్స్-షోరూమ్ ధరను రూ. 86,500గా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న పాత ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఎక్స్‌టెక్ మోడల్ ధర రూ. 88,044 గా ఉంది. అంటే పాతదాని కంటే కొత్త అప్‌గ్రేడెడ్ బైక్ ధర దాదాపు రూ. 1,500 వరకు తక్కువగా ఉండటం గమనార్హం!

మంచి మైలేజ్, ఆధునిక ఫీచర్లు, తక్కువ మెయింటెనెన్స్ కోరుకునే ఫ్యామిలీ, యువతకు ఈ సరికొత్త 125 సీసీ బైక్ మార్కెట్లో బెస్ట్ ఆప్షన్ కానుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More