Royal Enfield Bullet 650 : బైక్ లవర్స్​కి పండగే! మోస్ట్​ పవర్​ఫుల్ ఆర్​ఈ​ 'బుల్లెట్​ 650' వచ్చేస్తోంది..

Royal Enfield Bullet 650 Launch : బైక్​ లవర్స్​కి అలర్ట్​! రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి మోస్ట్​ పవర్​ఫుల్​ బైక్​ లాంచ్​కి రెడీ అవుతోంది. దాని పేరు రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్​ 650. ఈ రెట్రో బైక్​ లాంచ్​ డేట్, ధర సహా ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 26, 2026, 17:02:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ లవర్స్​కి క్రేజీ న్యూస్! భారత ఆటోమొబైల్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన, అతిపెద్ద బుల్లెట్.. మార్కెట్​లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650’ని కంపెనీ ఈ నెల చివరికి లేదా జూన్ మొదటి వారంలో అధికారికంగా భారత్‌లో లాంచ్ చేయబోతోంది. ఈ ఐకానిక్ వింటేజ్ మోడల్‌ను కంపెనీ తన పవర్‌ఫుల్ ట్విన్-సిలిండర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించింది. ఈ సరికొత్త పవర్‌ఫుల్ రెట్రో క్రూయిజర్ బైక్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలన ఇక్కడ చూసేయండి..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్​ 650 ఇదిగో..
రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్​ 650 ఇదిగో..

బుల్లెట్ 650 : లాంచ్ టైమ్‌లైన్ అండ్ ప్రైజ్​ (అంచనా)

1932 నుంచి ఎలాంటి బ్రేక్ లేకుండా నిరంతరాయంగా ప్రొడక్షన్‌లో ఉంటూ.. భారతీయ బైకర్ల గుండెల్లో 'కల్ట్' స్టేటస్ సంపాదించుకున్న ఏకైక మోడల్ 'బుల్లెట్'. ఇప్పటివరకు 350సీసీ సెగ్మెంట్‌లో రారాజుగా వెలిగిన ఈ మోడల్, ఇప్పుడు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తూ 650సీసీ ఎరాలోకి అడుగుపెడుతోంది.

ఈ సరికొత్త రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్ 650 ధరను కంపెనీ ఇటీవలే మార్కెట్​లోకి తెచ్చిన 'క్లాసిక్ 650' శ్రేణికి సమానంగా ఉంచే అవకాశం ఉంది.

క్లాసిక్ 650 బేస్ వేరియంట్ 'హాట్‌రాడ్' ధర రూ. 3.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

దీనిని బట్టి చూస్తే, రాబోయే బుల్లెట్ 650 ఎక్స్-షోరూమ్ ధర కూడా రూ. 3.50 లక్షల నుంచి రూ. 3.65 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ రెట్రో పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత ప్రీమియం బైక్‌గా నిలవనుంది.

చరిత్రలోనే అత్యంత పవర్‌ఫుల్ బుల్లెట్ బైక్!

పెద్ద ఇంజన్‌తో వస్తున్నందున ఈ బైక్ లాంగ్ హైవే రైడింగ్, క్రూయిజింగ్ సామర్థ్యం, టాప్ స్పీడ్ పర్ఫార్మెన్స్ ఊహించని రేంజ్‌లో ఉండబోతోంది.

ఇంజన్: ఇందులో మిగతా 650 సీసీ బైక్‌లలో ఉండే ప్రసిద్ధ 647.95సీసీ పారలల్-ట్విన్ ఇంజన్ అందించారు.

పవర్ అండ్ టార్క్: ఈ మోటార్ గరిష్టంగా 47 బీహెచ్​పీ పవర్ (7,250 ఆర్​పీఎం వద్ద), 52.3 ఎన్​ఎం గరిష్ట టార్క్‌ను (5,650 ఆర్​పీఎం వద్ద) ప్రొడ్యూస్ చేస్తుంది.

గేర్ బాక్స్: ఇది స్మూత్ షిఫ్టింగ్ కోసం 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడింది.

బుల్లెట్​ 650 : ఐకానిక్ 'వింటేజ్' లుక్ అలాగే ఉంది!

మెకానికల్‌గా బైక్ పూర్తిగా కొత్త టెక్నాలజీకి మారినప్పటికీ, బుల్లెట్ ఒరిజినల్ సిగ్నేచర్ స్టైల్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏమాత్రం మార్చలేదు.

సిగ్నేచర్ డిజైన్: బుల్లెట్ మార్క్ స్ట్రెయిట్ సిట్టింగ్ పొజిషన్, వింగ్డ్ బ్యాడ్జ్ ఉన్న టియర్-డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్ అలాగే ఉన్నాయి.

టైగర్-ఐ లాంప్స్: 1950ల నాటి పాత బుల్లెట్ మోడల్స్‌ను గుర్తుచేసేలా హెడ్‌ల్యాంప్ హౌసింగ్‌తో కూడిన వింటేజ్ “టైగర్-ఐ” పైలట్ ల్యాంప్స్ ఇందులోనూ ఇచ్చారు.

హ్యాండ్ మేడ్ డిజైన్: ఆల్-మెటల్ బాడీ నిర్మాణం, ట్యాంక్ పైన చేత్తో గీసిన ఐకానిక్ పిన్‌స్ట్రైప్స్ దీని పాతకాలపు అందాన్ని రెట్టింపు చేస్తాయి.

బుల్లెట్ క650 : సస్పెన్షన్, బాడీ, బ్రేకింగ్ సిస్టమ్..

ఫ్రేమ్ అండ్ సస్పెన్షన్: బైక్‌ను స్టీల్ ట్యూబులర్ స్పైన్ ఫ్రేమ్‌పై నిర్మించారు. ముందు భాగంలో 43ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి.

టైర్లు: రోడ్డుపై గంభీరమైన లుక్ కోసం ముందు 19-ఇంచుల వీల్, వెనుక 18-ఇంచుల వీల్ సెటప్ ఇచ్చారు.

బ్రేకులు: సేఫ్టీ కోసం డ్యూయల్ చానల్ ఏబీఎస్​తో పాటు ముందు 320ఎంఎం డిస్క్, వెనుక 300ఎంఎం డిస్క్ బ్రేక్స్ అందించారు.

బరువు, సీటు: ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్​ 650 బైక్ సీటు ఎత్తు 800 ఎంఎం కాగా, మొత్తం బరువు 243 కిలోలుగా ఉండనుంది. ఇందులో 14.8 లీటర్ల భారీ ఇంధన ట్యాంక్ అందించారు.

బుల్లెట్​ 650 : మోడర్న్ టచ్ అండ్ ఫీచర్లు..

పాతకాలపు లుక్ ఉన్నప్పటికీ.. రోజువారీ రైడింగ్ కంఫర్ట్ కోసం ఇందులో కొన్ని మోడర్న్ ఫీచర్లు జోడించారు:

  • బ్రైట్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్.
  • గేర్ పొజిషన్, ట్రిప్ సమాచారం చూపే సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.
  • ప్రయాణంలో మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్.

రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లో క్లాసిక్ 350 వాడుతూ, మరింత పవర్‌ఫుల్, లగ్జరీ రెట్రో బైక్‌లోకి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి బుల్లెట్ 650 ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More