టెలికాం పరికరాల తయారీ సంస్థ హెచ్‌ఎఫ్‌సీఎల్ (HFCL) షేర్లు స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తున్నాయి. అక్టోబర్ 1 ట్రేడింగ్ సెషన్‌లో ఈ షేరు 5 శాతం లాభపడి రూ.237.95 వద్ద ముగిసింది. దీంతో గడిచిన మూడే మూడు ట్రేడింగ్ సెషన్లలో ఈ స్టాక్ 15 శాతానికి పైగా రాబడిని అందించింది. గడిచిన వారం రోజుల్లో 13 శాతం, మూడు నెలల్లో 12 శాతం చొప్పున పెరిగిన ఈ షేరు.. ఆరు నెలల కాలంలో ఏకంగా 227 శాతం ఎగబాకి మల్టీబ్యాగర్‌గా నిలిచింది. ఏడాది కాల పరిమితిలో ఇన్వెస్టర్లకు 223 శాతానికి పైగా లాభాలను అందించడం విశేషం.

కాగా, 2026 ఆగస్టులో ఈ షేరు రూ.257 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని తాకగా, 2026 జనవరిలో రూ.59.83 వద్ద 52 వారాల కనిష్ట స్థాయి నమోదు చేసింది.
సాంకేతిక సూచీలు ఏం చెప్తున్నాయి?
"ఎగువ స్థాయిలో హెచ్‌ఎఫ్‌సీఎల్ షేరు ఊపు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ర్యాలీ తర్వాత షేరు కొంతకాలం స్థిరీకరణ (Consolidation) లేదా లాభాల స్వీకరణ దశలోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత ధర వద్ద కొత్తగా భారీగా కొనుగోలు చేయడం కంటే, ఉన్న ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడం శ్రేయస్కరం" అని ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సీనియర్ మేనేజర్ జిగర్ ఎస్ పటేల్ సూచించారు. ఈ షేరుకు రూ.220 వద్ద తక్షణ మద్దతు (Support) ఉందన్న ఆయన, ఎగువన రూ.260 స్థాయి ప్రధాన నిరోధంగా (Resistance) పనిచేస్తుందని తెలిపారు. రూ.260 స్థాయిని దాటితేనే మళ్లీ బలమైన బుల్లిష్ ట్రెండ్ ప్రారంభమవుతుందని అంచనా వేశారు.
మరోవైపు షేర్ మార్కెట్ విశ్లేషకులు మయాంక్ జైన్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "రూ.50 నుంచి రూ.100 శ్రేణిలోనే సుదీర్ఘకాలం ట్రేడ్ అయిన హెచ్‌ఎఫ్‌సీఎల్ షేరు 2026 ప్రారంభంలో బలమైన బ్రేక్‌అవుట్ సాధించింది. స్వల్ప, మధ్యమ, దీర్ఘకాలిక మూవింగ్ యావరేజ్‌ల (50 EMA రూ.218.25, 100 EMA రూ.197.52, 200 EMA రూ.163.09) కంటే పైన ట్రేడ్ అవుతూ బుల్లిష్ ట్రెండ్‌ను స్పష్టం చేస్తోంది" అని మయాంక్ జైన్ వివరించారు. రూ.256.70 వద్ద గరిష్టాన్ని తాకిన తర్వాత వచ్చిన సవరణలో కొనుగోలుదారులు మళ్లీ ఆసక్తి చూపారని, ఈ షేరుకు రూ.218 నుంచి రూ.197.50 శ్రేణి కీలక మద్దతుగా నిలుస్తుందని ఆయన చెప్పారు.
రూ.0.20 డివిడెండ్‌కు ఏజీఎం ఆమోదం
కంపెనీ ఇటీవల ముగిసిన 39వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) అనేక కీలక నిర్ణయాలకు వాటాదారులు ఆమోదం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతి షేరుకు రూ.0.20 (20 శాతం) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించిన ఎక్స్-డివిడెండ్, రికార్డు తేదీగా 2026 సెప్టెంబర్ 22ను నిర్ణయించారు. అనంతరం సెప్టెంబర్ 29న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఏజీఎంలో ఈ డివిడెండ్ ప్రతిపాదనను వాటాదారులు ఖరారు చేశారు. దీంతోపాటు డైరెక్టర్ అరవింద్ ఖరాబందా పునర్నియామకానికి, సబ్సిడీ సంస్థలైన హెచ్‌టీఎల్ లిమిటెడ్, హెచ్‌ఎఫ్‌సీఎల్ ఇన్కార్పొరేషన్లతో సంబంధిత లావాదేవీలకు ఆమోదం లభించింది.
ఆకట్టుకునే ఆర్థిక ఫలితాలు.. రూ.21,206 కోట్ల ఆర్డర్ బుక్
{{/usCountry}}కంపెనీ ఇటీవల ముగిసిన 39వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) అనేక కీలక నిర్ణయాలకు వాటాదారులు ఆమోదం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతి షేరుకు రూ.0.20 (20 శాతం) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించిన ఎక్స్-డివిడెండ్, రికార్డు తేదీగా 2026 సెప్టెంబర్ 22ను నిర్ణయించారు. అనంతరం సెప్టెంబర్ 29న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఏజీఎంలో ఈ డివిడెండ్ ప్రతిపాదనను వాటాదారులు ఖరారు చేశారు. దీంతోపాటు డైరెక్టర్ అరవింద్ ఖరాబందా పునర్నియామకానికి, సబ్సిడీ సంస్థలైన హెచ్‌టీఎల్ లిమిటెడ్, హెచ్‌ఎఫ్‌సీఎల్ ఇన్కార్పొరేషన్లతో సంబంధిత లావాదేవీలకు ఆమోదం లభించింది.
ఆకట్టుకునే ఆర్థిక ఫలితాలు.. రూ.21,206 కోట్ల ఆర్డర్ బుక్
{{/usCountry}}కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం హెచ్‌ఎఫ్‌సీఎల్ వ్యాపార పనితీరు విశేషంగా మెరుగుపడింది. కంపెనీ ఆర్డర్ బుక్ ఏటా 113 శాతం పెరుగుదలతో రూ.21,206 కోట్లకు చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 22 శాతం పెరిగి రూ.4,949 కోట్లకు చేరుకుంది. అలాగే ఎబిటా (EBITDA) 63 శాతానికి పైగా పెరిగి రూ.827 కోట్లుగా నమోదైంది. కంపెనీ నికర లాభం (PAT) ఏకంగా 90 శాతానికి పైగా ఎగబాకి రూ.329 కోట్లను దాటగా, ఇపిఎస్ (EPS) 73 శాతం పెరిగి రూ.2.13కి చేరింది.