...
...
Next Story

Nokia 2360 flip : ఎమర్జెన్సీ SOS బటన్, ఫ్యామిలీ అసిస్ట్‌తో నోకియా ఫ్లిప్​ ఫోన్ లాంచ్

నోకియా బ్రాండ్ ఫోన్లను విక్రయించే హెచ్‌ఎండీ సంస్థ 'నోకియా 2360 ఫ్లిప్' పేరిట సరికొత్త క్లామ్‌షెల్ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. వృద్ధులు, పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎమర్జెన్సీ SOS బటన్, ఫ్యామిలీ అసిస్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్ వివరాలు ఇవే..

Published on: Oct 31, 2026, 09:11:18 IST
Advertisement

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం హద్దులు దాటుతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా నోటిఫికేషన్లు, అనవసరమైన యాప్‌ల గోల నుంచి దూరంగా ఉంటూ, కేవలం కాలింగ్, మెసేజింగ్ మాత్రమే కోరుకునే వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా మన ఇళ్లలోని పెద్దవారు (వృద్ధులు) సులభంగా యాక్సెస్ చేసేందుకు, పాఠశాలలకు వెళ్లే పిల్లలు డిజిటల్ స్క్రీన్లకు అలవాటుపడకుండా ఉండేందుకు ఫీచర్ ఫోన్లను కొనుగోలు చేయడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఈ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రముఖ నోకియా బ్రాండ్ హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ హెచ్‌ఎండీ సరికొత్త ‘నోకియా 2360 ఫ్లిప్’ ఫీచర్ ఫోన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.

నోకియా కొత్త ఫ్లిప్​ ఫోన్..
నోకియా కొత్త ఫ్లిప్​ ఫోన్..

కెమెరా పిక్సెళ్లు, ప్రాసెసింగ్ స్పీడ్‌తో పోటీపడే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లకు భిన్నంగా, అత్యవసర సమాచార మార్పిడి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ డివైజ్‌ను డిజైన్ చేశారు.

నోకియా 2360 ఫ్లిప్- మడతబెట్టే క్లామ్‌షెల్ డిజైన్, కీప్యాడ్ సౌకర్యం..

నోకియా 2360 ఫ్లిప్ ఫోన్ మడతబెట్టే రూపంలో లభిస్తుంది. వాడనప్పుడు ఫోన్‌ను మడతబెట్టడం వల్ల లోపలి స్క్రీన్‌కు పూర్తి రక్షణ దక్కుతుంది. టచ్‌స్క్రీన్ ఉపయోగించడం ఇబ్బందిగా భావించే వయసు మళ్లిన వారికి అనువుగా ఇందులో పెద్దగా ఉండే ఫిజికల్ కీప్యాడ్ ఇచ్చారు.

నోకియా 2360 ఫ్లిప్- 'ఫ్యామిలీ అసిస్ట్', ఎమర్జెన్సీ ఎస్​ఓఎస్ బటన్..

నోకియా 2360 ఫ్లిప్ ప్రత్యేకత.. ఇందులో అందించిన భద్రతా ఫీచర్లు:

ఫ్యామిలీ అసిస్ట్ : ఈ ఫీచర్ ద్వారా కుటుంబ సభ్యులు తమ సొంత ఫోన్ల నుంచే ఈ నోకియా 2360 ఫ్లిప్ ఫోన్‌ను రిమోట్‌గా నియంత్రించవచ్చు. వృద్ధులకు ఫోన్ వాడటం రాకపోయినా, వారి ఫోన్‌లో కాంటాక్ట్‌లు యాడ్ చేయడం, రింగ్‌టోన్ వాల్యూమ్ పెంచడం, మందులు వేసుకునే సమయానికి డైలీ రిమైండర్లు సెట్ చేయడం వంటి పనులను కుటుంబ సభ్యులు దూరంగా ఉండే చేయవచ్చు.

అయితే, ఈ ఎస్​ఓఎస్ సౌకర్యం నెట్‌వర్క్ సిగ్నల్​పై ఆధారపడి పనిచేస్తుందని కంపెనీ గుర్తుచేసింది.

నోకియా 2360 ఫ్లిప్- ప్రధాన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

నోకియా 2360 ఫ్లిప్ రెండు స్క్రీన్‌లతో వస్తోంది. ఫోన్ తెరవకుండానే టైమ్, నోటిఫికేషన్లు చూసుకోవడానికి బయట చిన్న స్క్రీన్ ఉంది:

డిస్‌ప్లే: 2.8-అంగుళాల అంతర్గత డిస్‌ప్లే, 1.77-అంగుళాల ఎక్స్​టీరియర్ డిస్‌ప్లే.

బ్యాటరీ: 1,450ఎంఏహెచ్ సామర్థ్యం గల రిమూవబుల్ (తీసి మళ్లీ వేయగల) బ్యాటరీ.

కెమెరా: బేసిక్ QVGA వెనుక కెమెరా.

స్టోరేజ్: 4ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్.

నెట్‌వర్క్: 2జీ సెల్యులార్ నెట్‌వర్క్ సపోర్ట్.

ఆడియోస ఎఫ్‌ఎం: లౌడ్‌స్పీకర్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఎఫ్‌ఎమ్ రేడియో సపోర్ట్.

రంగులు: బర్గండి రెడ్, చార్‌కోల్, టీల్ రంగుల్లో అందుబాటులోకి రానుంది.

నోకియా 2360 ఫ్లిప్ ధర, లభ్యత వివరాలు..

హెచ్‌ఎండీ సంస్థ ఈ నోకియా 2360 ఫ్లిప్ ఫోన్ అధికారిక ధరను, భారత మార్కెట్లో ఎప్పటి నుంచి విక్రయానికి వస్తుందనే విషయాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం 4జీ ఫీచర్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ 2జీ క్లామ్‌షెల్ ఫోన్‌ను ఏ ధరకు అందుబాటులోకి తెస్తారో వేచి చూడాల్సి ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks