...
...
Next Story

Honda CB500 : రెట్రో బైక్ లవర్స్​ అలర్ట్! హోండా సీబీ500 లాంచ్- ధర, వేరియంట్లు ఇలా..

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్లోకి సరికొత్త 'సీబీ500' బైక్‌ను ఆవిష్కరించింది. ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వచ్చిన ఈ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ. 2.75 లక్షలు. దీని ఫీచర్లు, డెలివరీ వివరాలు ఇవే!

Published on: Sep 22, 2026, 05:59:33 IST
Advertisement

భారతీయ రెట్రో, టూరింగ్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సరికొత్త హోండా సీబీ500 బైక్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఈ ప్రీమియం మోటార్‌సైకిల్‌ను అధికారికంగా విడుదల చేసింది. రూ. 2.75 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈ బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.

హోండా సీబీ500..
హోండా సీబీ500..

క్యాజువల్ సిటీ రైడింగ్‌తో పాటు లాంగ్ డ్రైవ్‌లు కోరుకునే బైకర్లను ఈ ఆకట్టుకుంటుందని సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ హోండా సీబీ500కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హోండా సీబీ500- మూడు ఆకర్షణీయమైన వేరియంట్లు..

హోండా సీబీ500 మోడల్‌ను మూడు వేరియంట్లలో కంపెనీ తీసుకొచ్చింది. అల్లాయ్ వీల్స్ కోరుకునే వారి నుంచి క్లాసిక్ స్పేక్ వీల్స్ ఇష్టపడే వారి వరకు అందరినీ అలరించేలా వీటిని రూపొందించారు.

సీబీ500 అల్లాయ్ : రూ. 2,75,000

సీబీ500 స్పోక్ : రూ. 2,99,900

సీబీ500 స్పోక్ విత్ స్ట్రైప్స్ : రూ. 3,01,900

ఎంట్రీ లెవెల్ అల్లాయ్ మోడల్ తక్కువ ధరలో లభిస్తుండగా, ఓల్డ్ స్కూల్ రెట్రో ప్రియుల కోసం క్లాసిక్ లుక్ ఇచ్చే స్పోక్ వీల్ వేరియంట్లను సిద్ధం చేశారు.

పవర్‌ఫుల్ 501సీసీ ఇంజిన్ ఆప్షన్..

చాలా కాలం తర్వాత భారత మార్కెట్లోకి పెద్ద కెపాసిటీ కలిగిన ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ బైక్ రావడం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ హోండా సీబీ500 బైక్​లో సరికొత్త 501 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 28.1 హెచ్‌పీ పవర్, 43.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.

రైడింగ్ కంఫర్ట్ కోసం ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు ట్విన్ గ్యాస్-ఛార్జ్​డ్​ షాక్ అబ్సార్బర్లను ఇచ్చారు. భద్రత కోసం రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లతో పాటు ముందు 19-అంగుళాల, వెనుక 17-అంగుళాల వీల్స్ అమర్చారు.

హోండా సీబీ500- అధునాతన టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లు..

క్లాసిక్ లుక్ ఉన్నప్పటికీ, హోండా ఇందులో నేటి కాలానికి తగిన ఆధునిక సాంకేతిక సదుపాయాలను అందించింది.

  • సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్
  • హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ
  • టర్న్-బై-టర్న్ నేవిగేషన్
  • కాల్, ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్‌లు
  • స్లిప్పర్ క్లచ్
  • స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్

ఈ ఫీచర్లు రెట్రో ఫీల్‌ను దెబ్బతీయకుండానే రోజువారీ ప్రయాణాన్ని ఎంతో సులభతరం చేస్తాయి.

హోండా సీబీ500- కలర్ ఆప్షన్లు, డెలివరీల వివరాలు..

ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి విభిన్న రంగుల్లో ఈ బైక్ లభించనుంది.

అల్లాయ్ వేరియంట్: పెర్ల్ డిప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్

స్పోక్ వేరియంట్: రెబెల్ రెడ్ మెటాలిక్ 2, మ్యాట్ స్టీల్ సిల్వర్ మెటాలిక్

స్పోక్ విత్ స్ట్రైప్స్: పర్ల్ ఇగ్నియస్ బ్లాక్

ఈ హోండా సీబీ500 బైక్ బుకింగ్స్‌ను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. డెలివరీలు విడతల వారీగా జరగనున్నాయి. మొదటగా అల్లాయ్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం కానుండగా, ఆ తర్వాత స్పోక్, స్పోక్ విత్ స్ట్రైప్స్ మోడళ్లను కస్టమర్లకు అందజేస్తారు.

మరి మీరు ఈ హోండా సీబీ500 రెట్రో బైక్​ని కొంటున్నారా?

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks