భారత మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా కార్స్ ఇండియా.. తమ పాపులర్ మోడల్ ‘హోండా ఎలివేట్’ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఇటీవలే అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ నయా మోడల్ ప్రారంభ ధరను రూ. 11.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 18.40 లక్షల వరకు ఉంటుంది. ఎక్స్టీరియర్ రీడిజైన్, క్యాబిన్‌లో విలాసవంతమైన హంగులు, అదనపు రక్షణ ఫీచర్లతో వచ్చిన ఈ కారు వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.

ఈ నేపథ్యంలో మీరు ఈ హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌ని కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ ఎస్‌యూవీ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
| హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్- వేరియంట్ల వారీగా ధరలు.. | ||
|---|---|---|
| వేరియంట్ | 1.5ఎల్ పెట్రోల్ ఎంటీ | 1.5ఎల్ పెట్రోల్ సీవీటీ |
| ఎస్వీ | రూ. 11.80 లక్షలు | - |
| వీ | రూ. 12.29 లక్షలు | రూ. 13.79 లక్షలు |
| వీఎక్స్ | రూ. 13.93 లక్షలు | రూ. 15.39 లక్షలు |
| జెడ్ఎక్స్ | రూ. 15.39 లక్షలు | రూ. 16.89 లక్షలు |
| జెడ్ఎక్స్+ | రూ. 16.80 లక్షలు | రూ. 18.30 లక్షలు |
| జెడ్ఎక్స్+ బ్లాక్ | రూ. 16.90 లక్షలు | రూ. 18.40 లక్షలు |
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్- డిజైన్ అప్‌డేట్లు, కొత్త ఫీచర్లు
క్యాబిన్ లోపల, వెలుపల హోండా అనేక కీలక మార్పులు చేసింది. ముందు భాగంలో గ్లోస్-బ్లాక్ డిటైలింగ్‌తో కూడిన సరికొత్త మెష్ గ్రిల్, ట్రై-బార్ ఎల్‌ఈడీ పొజిషన్ లైట్లు ఇచ్చారు. వెనుక వైపు ఫుల్-విడ్త్ కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్ బార్ అమర్చారు. కారులో ఉన్న అత్యుత్తమ 220 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 2,650 ఎంఎం వీల్‌బేస్ ప్రయాణీకులకు విశాలమైన స్థలాన్ని అందిస్తాయి.
క్యాబిన్ సౌకర్యాలలో ముందు, వెనుక సీట్లకు వెంటిలేషన్ సదుపాయం, డ్రైవర్ సీటుకు 8-వే పవర్ అడ్జస్ట్మెంట్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఐవరీ-బ్లాక్ డాష్‌బోర్డ్, 10.25-ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 8-స్పీకర్ల ఆడియో సిస్టమ్‌ను చేర్చారు. ఆటోమేటిక్ వర్షన్లలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్ లభిస్తుంది.
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్, సేఫ్టీ..
{{/usCountry}}క్యాబిన్ సౌకర్యాలలో ముందు, వెనుక సీట్లకు వెంటిలేషన్ సదుపాయం, డ్రైవర్ సీటుకు 8-వే పవర్ అడ్జస్ట్మెంట్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఐవరీ-బ్లాక్ డాష్‌బోర్డ్, 10.25-ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 8-స్పీకర్ల ఆడియో సిస్టమ్‌ను చేర్చారు. ఆటోమేటిక్ వర్షన్లలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్ లభిస్తుంది.
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్, సేఫ్టీ..
{{/usCountry}}మెకానికల్ విభాగంలో ఈ 2026 హోండా ఎలివేట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. విశ్వసనీయమైన 1.5-లీటర్ ఐ-వీటెక్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగిస్తున్నారు. ఇది 121 బీహెచ్‌పీ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారులు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ ప్యాడిల్ షిఫ్టర్లతో కూడిన సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, హోండా సెన్సింగ్ (అడాస్), వీఎస్‌ఏ ప్రామాణికంగా లభిస్తాయి.
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్- బుకింగ్, డెలివరీ ప్రక్రియ..
కొత్త హోండా ఎలివేట్‌ను రూ. 21,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ hondacarindia.com ద్వారా ఆన్‌లైన్‌లో గానీ, లేదా సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా ఆఫ్‌లైన్‌లో గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో నచ్చిన రంగు, ఇంజిన్, వేరియంట్‌ను కాన్ఫిగర్ చేసుకునే సదుపాయం ఉంది.
కంపెనీ ఇప్పటికే కార్ల డెలివరీలను ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. అయితే వినియోగదారులు ఎంచుకున్న వేరియంట్, రంగు, నగరాన్ని బట్టి వెయిటింగ్ పీరియడ్, డెలివరీ తేదీలలో స్వల్ప మార్పులు ఉంటాయని వెల్లడించింది.