భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్లోకి ప్రముఖ జపాన్ వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఎట్టకేలకు అడుగుపెడుతోంది! భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

అన్ని అనుకున్నట్లు జరిగితే, వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో ఈ పవర్‌ఫుల్ ఈవీ ఎస్‌యూవీ భారత రోడ్లపైకి రానుంది. హోండా సంస్థ ఇటీవల ప్రదర్శించిన 'హోండా 0 ఆల్ఫా' కాన్సెప్ట్ ఆధారంగా ఈ కారు రెడీ అవుతోంది.
హోండా చేపడుతున్న గ్లోబల్ ప్రొడక్షన్ ప్రాజెక్టుల్లో భారత విభాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.
రూ. 1,200 కోట్ల భారీ పెట్టుబడి – గ్లోబల్ ఎగుమతి హబ్‌గా భారత్!
ఈ మేక్ ఇన్ ఇండియా ఈవీ ప్రాజెక్ట్ కోసం హోండా దాదాపు రూ. 1,200 కోట్ల భారీ పెట్టుబడిని కేటాయించింది. కేవలం భారత మార్కెట్లోనే కాకుండా, ఇక్కడి తయారీ ప్లాంట్ నుంచే జపాన్‌తో సహా పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఈ కార్లను ఎగుమతి చేయాలని హోండా వ్యూహాలు రచిస్తోంది. దీనివల్ల ఇది సాధారణ ఇండియన్ మోడల్‌గా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది.
ఆకట్టుకునే డిజైన్.. విశాలమైన క్యాబిన్!
ఇప్పటికే భారతీయ రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటున్న ప్రోటోటైప్ వాహనాల ఆధారంగా చూస్తే, ప్రొడక్షన్ మోడల్ కూడా దాదాపు కాన్సెప్ట్ డిజైన్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఎత్తైన నిటారైన బాడీ, పెద్ద గ్లాస్ ఏరియా, ఫ్లాట్ వెనుక భాగంతో ఈ ఎస్‌యూవీ వస్తోంది.
ఇతర పోటీ సంస్థలు కూపే తరహా స్టైలింగ్‌పై దృష్టి పెడుతుంటే, హోండా మాత్రం నిత్య జీవితంలో కుటుంబ అవసరాలకు సరిపడేలా, ఎక్కువ స్పేస్, ప్రాక్టికాలిటీకే ప్రాధాన్యత ఇస్తోంది.
బ్యాటరీ సామర్థ్యం, మైలేజ్ అంచనాలు..
{{/usCountry}}ఇతర పోటీ సంస్థలు కూపే తరహా స్టైలింగ్‌పై దృష్టి పెడుతుంటే, హోండా మాత్రం నిత్య జీవితంలో కుటుంబ అవసరాలకు సరిపడేలా, ఎక్కువ స్పేస్, ప్రాక్టికాలిటీకే ప్రాధాన్యత ఇస్తోంది.
బ్యాటరీ సామర్థ్యం, మైలేజ్ అంచనాలు..
{{/usCountry}}హోండా ఇంకా ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ లేదా మోటార్ సాంకేతిక వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. టాప్ వేరియంట్లలో పెద్ద బ్యాటరీని అమర్చవచ్చు. సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 450 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల నగర ప్రయాణాలకే కాకుండా సుదీర్ఘ హైవే ప్రయాణాలకు కూడా ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. మనదేశపు కఠినమైన రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఈ కారును విస్తృతంగా పరీక్షస్తోంది.
ప్రత్యర్థులతో గట్టి పోటీ..
హోండా సరికొత్త ఈవీ రాకతో మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ మరింత వేడెక్కనుంది. ఇది మార్కెట్లోకి వచ్చాక హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మారుతీ సుజుకీ ఈ-విటారా, టాటా సియెర్రా ఈవీ, మహీంద్రా బీఈ 6 మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పోటీదారులు ఇప్పటికే మార్కెట్లో స్థిరపడినందున, హోండా సరైన ధర, ఆకట్టుకునే రేంజ్‌తో రావడం చాలా అవసరం.
ఈ నూతన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హోండా నుంచి రాబోతున్న మోస్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కారు కానుంది. ఇందులో లేటెస్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లను అందించనున్నారు. ఈవీ రేసులోకి ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, 0 ఆల్ఫా ఆధారిత ఈ ఎస్‌యూవీతో కొత్త తరం ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో హోండా సత్తా చాటుతుందో లేదో వేచి చూడాలి!