మ్యూచువల్ ఫండ్స్ KYC స్టేటస్ ఎలా చెక్ చేయాలి? ఎలా అప్‌డేట్ చేయాలి?
ఇన్వెస్టర్స్‌కి అలర్ట్! మ్యూచువల్ ఫండ్స్ KYC స్టేటస్ ఎలా చెక్ చేయాలి? ఎలా అప్‌డేట్ చేయాలి? ఇందుకు సంబంధించిన వివరాలను డీటైల్డ్‌గా ఇక్కడ తెలుసుకోండి..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు, మీ కేవైసీ వివరాలు అప్‌డేట్‌గా ఉన్నాయా లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. మీ కేవైసీని అప్‌డేట్ చేయడానికి ముందు, దాని ప్రెజెంట్ స్టేటస్ తెలుసుకోవడం అవసరం.

మీరు మీ పాన్ నంబర్ ఉపయోగించి ఏదైనా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లేదా రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ వెబ్‌సైట్‌లో కేవైసీ స్థితిని తనిఖీ చేయవచ్చు. మీ కేవైసీ స్టేటస్ ‘వాలిడేటెడ్’, ‘రిజిస్టర్డ్’, ‘ఆన్ హోల్డ్’, లేదా ‘రిజెక్టెడ్’ అని ఉంటుంది.
కేవైసీ స్టేటస్: ఇలా తనిఖీ చేయండి
మీరు పెట్టుబడి పెట్టిన ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీ లేదా ఆర్టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
కేవైసీ స్టేటస్ లింక్ కోసం వెతకండి. అక్కడ మీ 10-అంకెల పాన్ నంబర్‌ను నమోదు చేయండి.
క్యాప్చాపై క్లిక్ చేయండి.
మీ కేవైసీ స్థితి వాలిడేటెడ్ / రిజిస్టర్డ్/ ఆన్హోల్డ్) /రిజెక్టెడ్ అని కనిపిస్తుంది.
కేవైసీ స్టేటస్ రకాలు: ఏమి చేయాలి?
I. కేవైసీ వాలిడేటెడ్
ఒకసారి మీ కేవైసీ వాలిడేట్ అయితే, మీరు ఎటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు! మీరు ఎప్పుడైనా, ఏ మ్యూచువల్ ఫండ్‌లోనైనా లావాదేవీలు చేయవచ్చు.
II. కేవైసీ రిజిస్టర్డ్
మీరు ఇప్పటికే ఉన్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా లావాదేవీలను కొనసాగించవచ్చు.
అయితే మీరు ఇప్పటికే పెట్టుబడి లేని కొత్త మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, మళ్లీ కేవైసీ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత, మీరు పాన్, ఆధార్‌ను (ఎక్స్ఎంఎల్, డిజి-లాకర్ లేదా ఎం-ఆధార్ నుంచి) ఉపయోగించి కేవైసీ అప్‌డేట్ / కేవైసీ మార్పు ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా మీ కేవైసీ స్టేటస్ ‘కేవైసీ వాలిడేటెడ్’గా మార్చుకోవచ్చు.
III. కేవైసీ ఆన్హోల్డ్/ రిజెక్టెడ్
మ్యూచువల్ ఫండ్/ఆర్టీఏ వెబ్‌సైట్‌లో కేవైసీ స్టేటస్ ఇలా ఉండటానికి గల కారణాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామా వెరిఫై అవ్వకపోవడం, పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయకపోవడం, లేదా కేవైసీ పత్రాలలో లోపం ఉండవచ్చు.
అందువల్ల, మీరు చేయాల్సిందల్లా ఆ మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సూచనలను అనుసరించడమే. మీ స్టేటస్ 'రిజిస్టర్డ్/వాలిడేటెడ్' గా మారిన తర్వాత, మీరు లావాదేవీలు చేయడం ప్రారంభించవచ్చు.
కేవైసీ మార్పులు, అదనపు సమాచారం..
మీరు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు. అక్కడ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, కొటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్, మిరాయ్ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ సహా 43 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల ఈకేవైసీ మాడిఫికేషన్ పేజీకి సంబంధించిన లింక్ లభిస్తుంది.
కేవైసీలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే, అవసరమైన మార్పుల కోసం మీరు ఇక్కడ యాంఫీ లింక్‌ను తనిఖీ చేయవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


