...
...
Next Story

ముందే ఆరోగ్య సమస్యలు ఉంటే.. Health Insurance ఎలా తీసుకోవాలి?

మారుతున్న కాలంలో ఆరోగ్య బీమా ప్రాముఖ్యత పెరిగింది. అయితే ముందే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇన్సూరెన్స్ రాదని భయపడుతుంటారు. పారదర్శకతతో వ్యవహరిస్తూ, సరైన పద్ధతిలో దరఖాస్తు చేస్తే బీమా పొందడం ఎలాగో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Jan 23, 2026, 11:20:15 IST
Advertisement

ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే.. “మాకు ఏదైనా అనారోగ్యం ఉంటే ఇన్సూరెన్స్ వస్తుందా?” దీనికి సమాధానం.. ఖచ్చితంగా వస్తుంది! ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని అర్థం చేసుకుని బీమా సంస్థలు ఇప్పుడు పాలసీలు ఇస్తున్నాయి. వీటినే సాంకేతిక భాషలో ‘ముందే ఉన్న ఆరోగ్య సమస్యలు’ (ప్రీ- ఎగ్జిస్టింగ్​ కండీషన్స్​) అంటారు.

2020లో వచ్చిన మార్పులు..

PREMIUMముందే వ్యాధులున్నా పాలసీ పొందే మార్గాలు ఇవే..
ముందే వ్యాధులున్నా పాలసీ పొందే మార్గాలు ఇవే..

గతంలో 'ప్రీ-ఎగ్జిస్టింగ్ కండిషన్' అనే మాటకు ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన నిర్వచనం ఇచ్చేవి. కానీ 2020లో ఐఆర్‌డీఏఐ దీన్ని క్రమబద్ధీకరించింది. పాలసీ తీసుకునే మూడు ఏళ్ల ముందు వరకు నిర్ధారణ అయిన లేదా చికిత్స పొందిన వ్యాధులను మాత్రమే 'ముందే ఉన్న సమస్యలు'గా పరిగణించాలి. అంతేకానీ, చిన్నప్పటి మెడికల్ రికార్డులు వెతకాల్సిన అవసరం లేదు. అలాగే,

ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే.. “మాకు ఏదైనా అనారోగ్యం ఉంటే ఇన్సూరెన్స్ వస్తుందా?” దీనికి సమాధానం.. ఖచ్చితంగా వస్తుంది! ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని అర్థం చేసుకుని బీమా సంస్థలు ఇప్పుడు పాలసీలు ఇస్తున్నాయి. వీటినే సాంకేతిక భాషలో ‘ముందే ఉన్న ఆరోగ్య సమస్యలు’ (ప్రీ- ఎగ్జిస్టింగ్​ కండీషన్స్​) అంటారు.

2020లో వచ్చిన మార్పులు..

PREMIUMముందే వ్యాధులున్నా పాలసీ పొందే మార్గాలు ఇవే..
ముందే వ్యాధులున్నా పాలసీ పొందే మార్గాలు ఇవే..

గతంలో 'ప్రీ-ఎగ్జిస్టింగ్ కండిషన్' అనే మాటకు ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన నిర్వచనం ఇచ్చేవి. కానీ 2020లో ఐఆర్‌డీఏఐ దీన్ని క్రమబద్ధీకరించింది. పాలసీ తీసుకునే మూడు ఏళ్ల ముందు వరకు నిర్ధారణ అయిన లేదా చికిత్స పొందిన వ్యాధులను మాత్రమే 'ముందే ఉన్న సమస్యలు'గా పరిగణించాలి. అంతేకానీ, చిన్నప్పటి మెడికల్ రికార్డులు వెతకాల్సిన అవసరం లేదు. అలాగే, కేవలం లక్షణాలు ఉంటే సరిపోదు, ఆ వ్యాధి నిర్ధారణ అయ్యి ఉండాలి.

బీపీ, షుగర్ లేదా థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు నిజం చెబితే ఆరోగ్య బీమా రాదని భయపడతారు. కానీ అది తప్పు. నిజాయితీగా వివరాలు వెల్లడిస్తే, కంపెనీలు ఇలా స్పందిస్తాయి:

సాధారణ సమస్యలు: స్వల్ప అనారోగ్యాలు ఉంటే, వాటికి రెండు మూడేళ్ల వెయిటింగ్​ పీరియడ్​ పెట్టి పాలసీ ఇస్తారు.

శస్త్రచికిత్సలు: అపెండిసైట్స్, కిడ్నీ స్టోన్స్ వంటి సర్జరీలు జరిగిన వారికి కూడా సాధారణ ప్లాన్స్ లభిస్తాయి.

తీవ్రమైన జబ్బులు: సమస్య తీవ్రంగా ఉంటే మీ ఆరోగ్య బీమా ప్రీమియం ఒక 10-20 శాతం పెంచవచ్చు లేదా నిర్దిష్ట వ్యాధికి మినహాయింపు ఇచ్చి పాలసీ కేటాయిస్తారు.

అనారోగ్యం ఉన్నవారు పాలసీ ఎలా తీసుకోవాలి?

మీకు ఏదైనా జబ్బు ఉంటే.. హెల్త్​ ఇన్సూరెన్స్​ విషయంలో ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి:

ఎక్కువ ఆప్షన్లు చూడండి: కేవలం ఒక కంపెనీతో ఆగకండి. ప్రైవేట్, ప్రభుత్వ, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలను సంప్రదించండి. ఒక్కో కంపెనీ ఒక్కోలా రిస్క్ అంచనా వేస్తుంది.

మానవ సంబంధాలు ముఖ్యం: కేవలం వెబ్‌సైట్ లేదా యాప్‌పై ఆధారపడకుండా కంపెనీ ప్రతినిధితో మాట్లాడండి. సమస్య తీవ్రతను వివరిస్తే కంపెనీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది.

నిజాయితీగా ఉండండి, కానీ అవసరమైనంతే: అడిగిన ప్రశ్నలకు పారదర్శకంగా సమాధానం చెప్పండి. అనవసరమైన కుటుంబ హిస్టరీ మొత్తం చెప్పి రిస్క్‌లో పడకండి.

మార్పులకు సిద్ధపడండి: ప్రీమియం కొంచెం పెరిగినా, కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నా పాలసీ తీసుకోవడమే ఉత్తమం. అస్సలు ఇన్సూరెన్స్ లేకపోవడం కంటే, నిబంధనలతో కూడిన ఇన్సూరెన్స్ ఉండటం ఎంతో మేలు.

విడివిడిగా పాలసీలు: కుటుంబం మొత్తానికి ఒకే 'ఫ్యామిలీ ఫ్లోటర్' కాకుండా, అనారోగ్యం ఉన్న వ్యక్తికి ప్రత్యేకంగా ఒక 'స్టాండలోన్' ప్లాన్ తీసుకోవడం మంచిది.

ఒకవేళ వ్యక్తిగత పాలసీ రాకపోతే, మీ బ్యాంకులు లేదా మీరు చదివిన యూనివర్సిటీలు అందించే ‘గ్రూప్ ఇన్సూరెన్స్’ ప్రయత్నించండి. వీటిలో మెడికల్ టెస్టులు ఉండవు.

చివరగా, ఒకసారి పాలసీ తీసుకున్న తర్వాత మర్చిపోకుండా సకాలంలో రిన్యూవల్ చేసుకోండి. పాలసీ తీసుకున్న తర్వాత మీ అలవాట్లు మారినా (ఉదాహరణకు అప్పుడప్పుడు మద్యం సేవించడం వంటివి), వాటిని కంపెనీకి చెప్పాల్సిన అవసరం లేదు.

ఆరోగ్యంగా ఉన్నప్పుడే బీమా తీసుకోవడం తెలివైన పని. అనారోగ్య సమస్యలు వచ్చినా భయపడకుండా హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకోవచ్చు.

-కపిల్​ మెహ్తా, సెక్యూర్​నౌ కో-ఫౌండర్​.

All Access.
One Subscription.

Get 360° coverage—from daily headlines
to 100 year archives.

E-Paper
Full
Archives
Full Access to
HT App & Website
Games
 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe