...
...
Next Story

గుజరాత్​ ఆసుపత్రిలో మహిళల చెకప్..​ పోర్న్​ సైట్​లో వీడియోలు! ఆ సింపుల్​ పాస్​వర్డ్​ వల్లే..

గుజరాత్​లోని ఓ ఆసుపత్రిలో చెకప్​ చేయించుకుంటున్న మహిళల వీడియోలు పోర్న్​ సైట్​లో దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై జరిగిన దర్యాప్తులో షాకింగ్​ విషయాలు వెలువడ్డాయి. సింపుల్​ పాస్​వర్డ్​ పెట్టడం వల్లే సీసీటీవీ ఫుటేజ్​ లీక్​ అయ్యిందని తెలుస్తోంది.

Published on: Nov 5, 2025, 08:15:05 IST
Advertisement

గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో ఒక ఆసుపత్రిలో మహిళలకు వైద్య పరీక్షలు జరుగుతున్న సీసీటీవీ ఫుటేజ్.. పోర్న్ సైట్‌లలో ప్రత్యక్షం కావడంపై జరిగిన దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఒకే విధమైన, సింపుల్​ పాస్‌వర్డ్ ఉపయోగించడం వల్లే ఈ భద్రతా లోపం జరిగిందని దర్యాప్తులో తేలింది!

సింపుల్​ పాస్​వర్డ్​ వల్లే లీక్​ అయిన దృశ్యాలు! (Pexels)
సింపుల్​ పాస్​వర్డ్​ వల్లే లీక్​ అయిన దృశ్యాలు! (Pexels)

ఈ నేరానికి పాల్పడిన హ్యాకర్లు, రాజ్‌కోట్‌లోని ఆ ప్రసూతి ఆసుపత్రి సీసీటీవీ వ్యవస్థను సింపుల్​గా హ్యాక్ చేశారు. అక్కడి నుంచి దొంగిలించిన ఫుటేజ్‌ను పోర్న్ సైట్‌లలో అప్‌లోడ్ చేయడమే కాకుండా, వాటిని టెలిగ్రామ్​లో రూ. 700 నుంచి రూ. 4,000 ధరలకు అమ్మకానికి పెట్టారు.

అంతేకాదు.. ఈ హ్యాకర్ల ముఠా తొమ్మిది నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా కనీసం 50,000 వీడియో క్లిప్‌లను దొంగిలించింది.

విచారణాధికారులు గుర్తించిన వివరాల ప్రకారం.. పూణె, ముంబై, నాసిక్, సూరత్, అహ్మదాబాద్, దిల్లీ సహా దేశవ్యాప్తంగా ఆసుపత్రులు, పాఠశాలలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర ప్రదేశాలకు చెందిన సుమారు 80 సీసీటీవీ డాష్‌బోర్డ్‌లు హ్యాక్​కి గురయ్యాయి!

ఆసుపత్రి ఫుటేజ్ ఎలా లీక్ అయ్యింది?

ఫిబ్రవరిలో ఈ వ్యవహారం కలకలం సృష్టించినప్పడు, సీసీటీవీ ఫుటేజ్ ఎలా లీక్ అయ్యిందో ఆసుపత్రి అధికారులు గుర్తించలేకపోయారు.

"మా సీసీటీవీ సర్వర్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లు అనిపిస్తుంది. అయితే, ఇది ఎందుకు, ఎలా జరిగిందో మాకు తెలియదు. ఈ విషయాన్ని మేము పోలీసులకు తెలియజేస్తాం," అని డాక్టర్ అమిత్ అక్బరీ గతంలో మీడియాకు చెప్పారు.

కాగా ఈ విషయంపై జరిపిన దర్యాప్తులో షాకింగ్ నిజం బయటపడింది. హ్యాకింగ్‌కు గురైన అనేక సీసీటీవీ వ్యవస్థలలో సాధారణంగా వాడే 'admin123' అనే బలహీనమైన, సింపుల్​ పాస్‌వర్డ్‌ను ఉపయోగించినట్లు తేలింది.

"వారు ఉపయోగించిన ప్రధాన పద్ధతి ‘బ్రూట్ ఫోర్స్ అటాక్’. ఈ పద్ధతిలో హ్యాకర్లు ఒక ప్రోగ్రామ్ లేదా బాట్‌ను ఉపయోగించి, లాక్ కోసం సాధ్యమయ్యే అన్ని అక్షరాల, సంఖ్యల కలయికలను ప్రయత్నిస్తారు," అని అహ్మదాబాద్ సైబర్‌క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు తెలిపారు.

సైబర్ నేరాలలో పెరుగుదల..

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్​సీఆర్​బీ) తాజా నివేదికలోని డేటా ప్రకారం.. సైబర్ నేరాలు 31 శాతం పెరిగాయి. 2022లో 65,983 కేసులు నమోదు కాగా, 2023లో ఏకంగా 86,420 కేసులు నమోదయ్యాయి.

గుజరాత్‌లోనూ సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి! 2022లో 1,417 కేసులు నమోదైతే, 2023లో ఇది 40.79 శాతం పెరిగి 1,995 కేసులకు చేరింది.

మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగించి సుమారు రూ. 200 కోట్లను దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ నేరగాళ్లకు మళ్లించిన కేసులో ఆరుగురు వ్యక్తులను గుజరాత్ పోలీసుల సీఐడీ-క్రైమ్ ఇటీవలే అరెస్టు చేసింది.

మ్యూల్ అకౌంట్ అంటే.. నేరగాళ్లు చట్టవిరుద్ధంగా సంపాదించిన డబ్బును అందుకోవడానికి, బదిలీ చేయడానికి లేదా లాండరింగ్ చేయడానికి ఉపయోగించే బ్యాంక్ ఖాతా. ఇది ఖాతాదారుడికి తెలిసినా, తెలియకపోయినా జరిగే అవకాశం ఉంటుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe