పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో సరికొత్త ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. సబ్‌కాంప్యాక్ట్ ఎస్‌యూవీ 'వెన్యూ', పాపులర్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ 'క్రెటా' మధ్య ఖాళీని పూరించేందుకు ‘బేయాన్’ పేరుతో ఒక కొత్త క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీని తీసుకొస్తోంది. వచ్చే నెలలో అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ కారు కోసం హ్యుందాయ్ ఇప్పుడు ప్రీ- బుకింగ్స్‌ని ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు హ్యుందాయ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్, క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ క్రమంలో హ్యుందాయ్ తీసుకొస్తున్న బేయాన్, మార్కెట్లో మారుతీ సుజుకీ బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్‌ఓ వంటి వాహనాలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆటో రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ- స్పోర్టీ లుక్, ఆకట్టుకునే డిజైన్..
బేయాన్ ఎస్‌యూవీ సాధారణ బాక్సీ టైప్ డిజైన్ కాకుండా స్పోర్టీ క్రాస్‌ఓవర్ లుక్‌తో వస్తోంది. వాహనం ముందు భాగంలో హెచ్-షేప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు పైభాగంలో, ప్రధాన హెడ్‌లాంప్‌లు బంపర్‌కు కాస్త కిందగా అమర్చిన స్ల్పిట్-హెడ్‌లాంప్ సెటప్‌ను ఇచ్చారు. దృఢమైన స్కిడ్ ప్లేట్‌తో ఫ్రంట్ లుక్ రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తుంది.
పక్కవైపు నుంచి చూస్తే, సీ-పిల్లర్ వద్ద ప్రత్యేకమైన కర్వ్స్, రూఫ్ రైల్స్, ఆకర్షణీయమైన వీల్ ఆర్చ్‌లు, పల్-టైప్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో ముందు లైట్లను ప్రతిబింబించేలా సన్నని ఎల్‌ఈడీ లైట్ స్ట్రిప్‌ను అమర్చారు. ఈ కారు మొత్తం పొడవు సుమారు 4,200 ఎంఎం వరకు ఉంటుంది.
హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ- అధునాతన ఇంటీరియర్, ప్రీమియం ఫీచర్లు!
ఎస్‌యూవీ క్యాబిన్ విషయానికి వస్తే, హ్యుందాయ్ గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన నాలుగో తరం ఐ20 డిజైన్ ఛాయలు ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. డ్యాష్‌బోర్డ్‌పై డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేలు కలిసి ఉండే ట్విన్-స్క్రీన్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
{{/usCountry}}ఎస్‌యూవీ క్యాబిన్ విషయానికి వస్తే, హ్యుందాయ్ గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన నాలుగో తరం ఐ20 డిజైన్ ఛాయలు ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. డ్యాష్‌బోర్డ్‌పై డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేలు కలిసి ఉండే ట్విన్-స్క్రీన్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
{{/usCountry}}ఎస్‌యూవీ ఏసీ కంట్రోల్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కన్సోల్, నిలువుగా ఉండే ఎయిర్ వెంట్స్, స్టీరింగ్ వీల్‌పై ప్రత్యేక ఫోర్-డాట్ మోటిఫ్ వంటివి ప్రయాణికులకు ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో ఈ కారును తీర్చిదిద్దారు.
హ్యుందాయ్ బేయాన్- శక్తివంతమైన ఇంజిన్..
హ్యుందాయ్ బేయాన్ 1.5-లీటర్, 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. దీనిని క్రెటాలో ఉపయోగించే ఇంజిన్ ప్రాతిపదికగానే రూపొందించారు. మ్యాన్యువల్, ఆటోమేటిక్ (సీవీటీ) గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో లభిస్తాయి.
ఇంధన పొదుపు కోరుకునేవారి కోసం కంపెనీ ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ మోడల్‌ను కూడా అందించనుంది. బూట్ స్పేస్ (డిక్కీ స్థలం) తగ్గకుండా కారు అండర్‌బాడీ (కింది భాగం) లో సీఎన్‌జీ ట్యాంక్‌ను అమర్చడం దీని ప్రధాన ప్రత్యేకత.
ఈ హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీకి సంబంధించిన లాంచ్ డేట్, ధర, ఇతర ఫీచర్ల వివరాలపై సంస్థ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.