గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన కొత్త మోడల్ 'బేయాన్' (Bayon) ఎస్‌యూవీ డిజైన్ స్కెచ్‌లను ఆవిష్కరించింది. కొన్ని రోజుల క్రితమే ఈ మోడల్ పేరును ఖరారు చేసిన కంపెనీ, తాజాగా దీని బాహ్య రూపకల్పన (ఎక్స్‌టీరియర్), ఇంటీరియర్ స్కెచ్‌లను విడుదల చేసింది.
'ఆర్ట్ ఆఫ్ స్టీల్' ఫిలాసఫీతో లగ్జరీ లుక్

హ్యుందాయ్ తన కొత్త ‘ఆర్ట్ ఆఫ్ స్టీల్’ డిజైన్ శైలి ఆధారంగా బేయాన్‌ను తీర్చిదిద్దింది. పటిష్టమైన నిర్మాణం, పదునైన బాడీ లైన్లు, ఆకర్షణీయమైన నిష్పత్తులతో ఈ కారును డిజైన్ చేశారు. ముందు భాగంలో ప్రత్యేకమైన 'హెచ్-ఎడ్జ్' (H-Edge) లైటింగ్ సిగ్నేచర్, సెక్సీగా ఉండే బోనెట్, విస్తృతమైన వీల్ ఆర్చ్‌లతో ఇది పక్కా ఎస్‌యూవీ లుక్‌ను సొంతం చేసుకుంది. నగరాల్లో జీవించే నేటితరం వినియోగదారుల లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా దీనిని రూపుదిద్దినట్లు కంపెనీ తెలిపింది.
డిజైన్ హెడ్ స్పందన
"భారత మార్కెట్‌లోకి బేయాన్‌ను ప్రవేశపెడుతున్న తరుణంలో, మొదటి చూపులోనే బలమైన ముద్ర వేయాలని భావించాం. ఆధునిక నగర జీవనశైలికి సరిపోయేలా ఇంటెలిజెంట్ టెక్నాలజీ, ఆలోచనాత్మక డిజైన్‌తో కూడిన 'ఇంటెలిజెంట్ యుటిలిటీ వెహికల్'ను రూపొందించడమే మా లక్ష్యం. రగ్గడ్ ఎక్స్‌టీరియర్‌కు అనుగుణంగా హైటెక్ ఇంటీరియర్‌ను ఇక్కడ జత చేశాం. శిల్పంలాంటి బోనెట్, విశాలమైన ఫెండర్లు, ప్రత్యేకమైన హెచ్-ఎడ్జ్ లైటింగ్ దీనికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి" అని హ్యుందాయ్ మోటార్ కంపెనీ డిజైన్ సెంటర్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సైమన్ లోస్‌బై పేర్కొన్నారు.
కనెక్టివిటీకి ప్రాధాన్యం ఇచ్చే ఇంటీరియర్
ఇంటీరియర్ విషయానికి వస్తే, క్యాబిన్ డిజైన్ అత్యాధునిక సాంకేతికతకు, సులభతరమైన కనెక్టివిటీకి ప్రాధాన్యమిచ్చేలా ఉంది. అధునాతన టెక్నాలజీ, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కలగలిపి ప్రీమియం అనుభూతిని ఇచ్చేలా లోపలి విభాగాన్ని డిజైన్ చేశారు. అయితే, క్యాబిన్ పరిమాణం, ఇతర స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలను కంపెనీ ఇంకా గోప్యంగానే ఉంచింది.
ధర, స్పెసిఫికేషన్లు త్వరలోనే..
బేయాన్ ఎస్‌యూవీ ఇంజిన్ సామర్థ్యం, మైలేజ్ వివరాలు, ధర, లాంచ్ తేదీని హ్యుందాయ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాబోయే రోజుల్లో గ్లోబల్ వర్షన్‌తో పాటు భారత వెర్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను విడతల వారీగా వెల్లడించనున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.
{{/usCountry}}బేయాన్ ఎస్‌యూవీ ఇంజిన్ సామర్థ్యం, మైలేజ్ వివరాలు, ధర, లాంచ్ తేదీని హ్యుందాయ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాబోయే రోజుల్లో గ్లోబల్ వర్షన్‌తో పాటు భారత వెర్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను విడతల వారీగా వెల్లడించనున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.
{{/usCountry}}