...
...
Next Story

భారీగా తగ్గిన Hyundai i20 బేస్​ వేరియంట్​ ధర! ఇప్పుడు రూ. 5.99 లక్షలకే- ఫీచర్లు మాత్రం సూపర్​..

హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'ఐ20' ధరలను ఇటీవలే సవరించింది. ఎంట్రీ లెవల్ వేరియంట్ ధరను రూ. 5.99 లక్షలకు తగ్గించడంతో పాటు మిడ్-రేంజ్ వేరియంట్లపై కూడా భారీ ప్రైజ్​ కట్​ని ప్రకటించింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 6, 2026, 12:21:03 IST
Advertisement

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్​ఎంఐఎల్​), తన పాపులర్ మోడల్ హ్యుందాయ్ ఐ20 లోని కీలక వేరియంట్లపై ధరల తగ్గింపును ఇటీవలే ప్రకటించింది. తద్వారా ఈ సెగ్మెంట్‌లోని కొనుగోలుదారులకు ఈ కారును మరింత అందుబాటు ధరలోకి తీసుకువచ్చింది. కొత్త ధరల ప్రకారం.. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు రూ. 5.99 లక్షల ప్రారంభ ధరకే లభిస్తుంది. గతంలో దీని ప్రారంభ ధర రూ. 6.86 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండేది.

హ్యుందాయ్​ ఐ20- వేరియంట్ల వారీగా కొత్త ధరలు, ఫీచర్లు..

హ్యుందాయ్​ ఐ20..
హ్యుందాయ్​ ఐ20..

ఈ శ్రేణిలో బేస్ వేరియంట్ అయిన ఐ20 ఎరా ఇప్పుడు రూ. 5,99,000 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉంది. అయితే, బేస్​ వేరియంటే కదా అని తీసిపడేయడానికి లేదు! ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్లు, బాడీ కలర్ ఓఆర్​వీఎంలు, డోర్ హ్యాండిల్స్, టైప్-సీ యూఎస్‌బీ ఛార్జర్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వంటి అవసరమైన అన్ని ఫీచర్లను సంస్థ ఇచ్చింది.

మిడ్-రేంజ్ వేరియంట్ల ధరలను కూడా హ్యుందాయ్ సవరించింది. ఐ20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ ధర గతంలో రూ. 6,86,865 ఉండగా, ఇప్పుడు రూ. 6,73,900 కి తగ్గింది. అలాగే ఐ20 మాగ్నా ధర రూ. 7,12,385 నుంచి రూ. 6,99,900 కి తీసుకొచ్చింది.

పైన పేర్కొన్న అన్నీ ఎక్స్​షోరూం ధరలు అని గుర్తుపెట్టుకోవాలి.

హ్యుందాయ్​ ఐ20 ధరలు..

వేరియంట్​Variantఎక్స్​షోరూం ధర (రూ.)పాత ఎక్స్​షోరూం ధర (రూ.)
Era5,99,000-
Magna Executive6,73,9006,86,865
Magna6,99,9007,12,385

హ్యుందాయ్​ ఐ20- ఫీచర్ల వివరాలు..

సవరించిన ధరలతో పాటు ఈ హ్యుందాయ్​ ఐ20కి అదనంగా రూ. 14,999 చెల్లిస్తే 10.1 ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను (వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో) రియర్ కెమెరాను డీలర్ ద్వారా అమర్చుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. ఈ డిస్‌ప్లే యూనిట్‌పై 3 ఏళ్ల వారంటీ కూడా ఉంటుంది.

ప్రస్తుతం హ్యుందాయ్ ఐ20పై ప్రామాణికంగా 3 ఏళ్లు లేదా 1,00,000 కి.మీ వారంటీ లభిస్తుంది. స్టాక్ ఉన్నంత వరకు వినియోగదారులు రూ. 48,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

హ్యుందాయ్​ ఐ20- ఇంజిన్..

హ్యుందాయ్ ఐ20 హ్యాచ్​బ్యాక్​లో అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు, ఇది 88 బీహెచ్​పీ పవర్‌ను, 114 ఎన్​ఎం పీక్​ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఐవీటీ ఆప్షన్లతో లభిస్తుంది. భారత మార్కెట్​లో ఇది మారుతీ సుజుకీ బాలెనో, టాటా ఆల్ట్రోజ్‌లతో పోటీ పడుతోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks