ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త రికార్డులకు తెరలేపింది. ప్రతిష్టాత్మక 'గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్' వేదికగా తన సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ‘హ్యుందాయ్ ఐయోనిక్ 3’ని అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేసింది. బ్రిటన్ మార్కెట్లో ఈ ఏడాది చివర్లోనే ఈ ఈవీ రోడ్లపైకి రానుంది.
హ్యుందాయ్ ఐయోనిక్ 3- బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు..

యూరప్ డ్రైవర్ల రోజువారీ అవసరాలను, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ ఈ సరికొత్త ఈవీని డిజైన్ చేసింది. దీని ధర బ్రిటన్ మార్కెట్లో దాదాపు 25,000 యూరోలు (మన భారత కరెన్సీలో సుమారు రూ. 32 లక్షలు) ఉండవచ్చని అంచనా. ప్రీమియం ఈవీ ఫీచర్లను అందుబాటు ధరలోనే అందిస్తుండటంతో, మార్కెట్లోకి రాకముందే ఈ కారుకు రికార్డు స్థాయిలో బుకింగ్స్, కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
గుడ్‌వుడ్ ఫెస్టివల్‌లో ఐయోనిక్ 3 సాధారణ మోడల్‌తో పాటు, స్పోర్టీ లుక్‌తో వచ్చే ‘ఎన్ లైన్ ఎవో’ వేరియంట్‌ను కూడా హ్యుందాయ్ ప్రదర్శించింది. దీనితో పాటు సంస్థకు చెందిన పవర్‌ఫుల్ ఈవీలు ఐయోనిక్ 5 ఎన్, ఐయోనిక్ 6 ఎన్, ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐయోనిక్ 9 కార్లను కూడా ఒకే వేదికపై ప్రదర్శనకు ఉంచడం విశేషం.
హ్యుందాయ్ ఐయోనిక్ 3- డిజైన్, పవర్ స్పెసిఫికేషన్స్..
హ్యుందాయ్ సంస్థ తన సరికొత్త 'ఆర్ట్ ఆఫ్ స్టీల్' డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ కారుకు 'ఏరో హ్యాచ్' సిల్హౌట్ (స్లీక్ బాడీ షేప్) రూపాన్ని ఇచ్చింది.
స్పేస్, కెపాసిటీ: ఈ కారులో ఐదుగురు ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. లాంగ్ జర్నీల కోసం ఏకంగా 441 లీటర్ల భారీ లగేజ్ స్పేస్ (బూట్ స్పేస్)ను అందించారు.
{{/usCountry}}స్పేస్, కెపాసిటీ: ఈ కారులో ఐదుగురు ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. లాంగ్ జర్నీల కోసం ఏకంగా 441 లీటర్ల భారీ లగేజ్ స్పేస్ (బూట్ స్పేస్)ను అందించారు.
{{/usCountry}}బ్యాటరీ, రేంజ్: వినియోగదారుల అవసరాల కోసం రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లను సంస్థ పరిచయం చేస్తోంది. ఇది ఒకే సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 500 కిలోమీటర్ల (డబ్ల్యూఎల్టీపీ ప్రొజెక్టెడ్) మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ఫాస్ట్ ఛార్జింగ్: డీసీ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 29 నిమిషాల్లోనే ఈ కారు బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు.
"బ్రిటన్ మార్కెట్లో ఐయోనిక్ 3 అడుగుపెట్టడానికి గుడ్‌వుడ్ సరైన వేదిక. మధ్యతరగతి కస్టమర్లకు సైతం ఎలక్ట్రిక్ డ్రైవింగ్ అనుభూతిని మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో దీనిని రూపొందించాం. మార్కెట్లోకి రాకముందే వస్తున్న రికార్డు స్థాయి రెస్పాన్స్ చూస్తుంటేనే ఈ కారు క్రేజ్ ఏంటో అర్థమవుతోంది," అని హ్యుందాయ్ యూకే ప్రెసిడెంట్ ఆష్లే ఆండ్రూ ధీమా వ్యక్తం చేశారు.
హ్యుందాయ్ ఐయోనిక్ 3- సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్..
యూరప్ మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఓఎస్ ఆధారంగా పనిచేసే ‘ప్లియోస్ కనెక్ట్’ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తున్న మొట్టమొదటి హ్యుందాయ్ మోడల్ ఇదే కావడం విశేషం. దీనితో పాటు ప్రయాణికుల భద్రత కోసం అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) కలిగిన ‘హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్’ టెక్నాలజీని అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందించారు.
ప్రస్తుతం భారత మార్కెట్లో లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌లో ఉన్న ఐయోనిక్ 5 మోడల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో, గ్లోబల్ మార్కెట్లోకి వస్తున్న ఈ చిన్న ఐయోనిక్ 3 హ్యాచ్‌బ్యాక్ భవిష్యత్తులో భారత మార్కెట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉండటంతో దేశీయ వాహన ప్రియుల్లో సరికొత్త ఆసక్తి నెలకొంది.