ఇండియాలో తన మార్కెట్ షేరును పెంచుకునేందుకు హ్యుందాయ్ మోటార్స్ రెడీ అవుతోంది! రాబోయే కొన్ని నెలల్లో ఇండియా కోసం క్రేజీ ప్లాన్స్ వేసింది. ఇందులో భాగంగా 2027 తొలినాళ్లల్లో జరగనున్న భారత్ మొబిలిటీ షోలో పలు కీలక మోడల్స్‌ని ఆవిష్కరించనుంది.
భారత్ మొబిలిటీ షోలో రెండు కీలక ఎస్‌యూవీలు!

2027 ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు దిల్లీలో జరిగే భారత్ మొబిలిటీ షో (ఆటో ఎక్స్‌పో)లో హ్యుందాయ్ రాబోయే మోడళ్లలో ఐయోనిక్ పీ సబ్-4 మీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, కొత్త తరం హ్యుందాయ్ క్రెటాను సంస్థ ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ రెండు ఎస్‌యూవీల ప్రధాన విశేషాలు ఆసక్తి రేపుతున్నాయి.
హ్యుందాయ్‌కు చెందిన ఈ-జీఎంపీ (కే) ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఐయోనిక్ పి, 2026 జనవరి 16న భారత్‌లో తొలిసారిగా తెరపైకి రానుంది. ఈ సబ్‌కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని స్టాండర్డ్ రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో అందిస్తారు. అయితే బ్యాటరీ ప్యాక్ సామర్థ్యాలు, డ్రైవింగ్ రేంజ్, ఛార్జింగ్ ఆప్షన్లను ఇంకా వెల్లడించలేదు. పోలిక కోసం చూస్తే, ఇదే ఈ-జీఎంపీ (కే) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడిన హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ ప్రపంచవ్యాప్తంగా 42kWh, 49kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తోంది. చిన్న బ్యాటరీతో 300 కి.మీ, పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో 355 కి.మీ డబ్ల్యూఎల్‌టీపీ రేంజ్ ఇస్తుందని చెబుతున్నారు.
ఐయోనిక్ పీ ఇంటీరియర్, అధునాతన ఫీచర్లు..
హ్యుందాయ్ ఐయోనిక్ పీ లోపలి భాగం అనేక ఆధునిక కనెక్టెడ్, సౌకర్యవంతమైన ఫీచర్లతో నిండి ఉంటుందని భావిస్తున్నారు. పెద్ద టచ్‌స్క్రీన్, సన్నని డ్రైవర్ డిస్‌ప్లేతో కూడిన కొత్త ప్లియోస్ కనెక్ట్ ఇంటర్‌ఫేస్‌ను భారత్‌లో పొందిన తొలి హ్యుందాయ్ కారుగా ఇది నిలుస్తుంది. ఇందులో లెవల్-2 అడాస్ భద్రతా వ్యవస్థ కూడా ఉండే అవకాశం ఉంది.
కొత్త తరం హ్యుందాయ్ క్రెటా.. స్ట్రాంగ్ హైబ్రిడ్ ప్రత్యేకత!
మూడో తరం హ్యుందాయ్ క్రెటాలో డిజైన్, ఫీచర్ల పరంగా సమగ్ర మార్పులతో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వస్తోంది. అధికారిక పవర్‌ట్రెయిన్ వివరాలను ఇంకా ప్రకటించనప్పటికీ, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆధారిత ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌ను ఇందులో అందిస్తారని సమాచారం. ప్రస్తుత మోడల్లో ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లను కూడా కొనసాగిస్తారు.
{{/usCountry}}మూడో తరం హ్యుందాయ్ క్రెటాలో డిజైన్, ఫీచర్ల పరంగా సమగ్ర మార్పులతో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వస్తోంది. అధికారిక పవర్‌ట్రెయిన్ వివరాలను ఇంకా ప్రకటించనప్పటికీ, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆధారిత ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌ను ఇందులో అందిస్తారని సమాచారం. ప్రస్తుత మోడల్లో ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లను కూడా కొనసాగిస్తారు.
{{/usCountry}}కొలతల పరంగా చూస్తే, 2027 హ్యుందాయ్ క్రెటా ప్రస్తుత మోడల్ కంటే పొడవుగా, వెడల్పుగా, ఎత్తుగా ఉంటుంది. వీల్‌బేస్ కూడా పెరుగుతుండటంతో లోపలి క్యాబిన్‌లో మరింత స్థలం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఫీచర్ల విషయంలో ప్లియోస్ కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, గ్లియో ఏఐ అసిస్ట్, ఓటీఏ అప్‌డేట్‌లు, మోర్స్-కోడ్ హెచ్ లోగోతో కొత్త స్టీరింగ్ వీల్, కొత్త అప్‌హోలిస్ట్రీ, ట్రిమ్‌లను క్రెటాలో చేరుస్తారని భావిస్తున్నారు.
మరోవైపు భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ రాబోయే ఆరేళ్లకు 15.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. పరిశోధన, అభివృద్ధి, స్థానిక విడిభాగాల సరఫరా వ్యవస్థ బలోపేతం, తయారీ సామర్థ్య విస్తరణ, వివిధ వ్యాపార విభాగాల్లో పట్టు పెంచుకోవడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 26 కొత్త మోడళ్లను విడుదల చేయాలని ఈ దక్షిణ కొరియా దిగ్గజం ప్రణాళిక రచించింది. వీటిలో 20 ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) వాహనాలు, 6 ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి.
ABOUT THE AUTHOR
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.