మధ్యతరగతి వారి కోసం హ్యుందాయ్​ వెన్యూలో కొత్త వేరియంట్​- ధర, ఫీచర్లు ఇలా..

పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ హ్యుందాయ్ వెన్యూలో సరికొత్త 'హెచ్​ఎక్స్​5+' వేరియంట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. మధ్యతరగతి వినియోగదారుల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని, రోజువారీ అవసరాలకు కావాల్సిన ప్రీమియం ఫీచర్లను ఇందులో జోడించారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 2, 2026, 15:05:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ రోడ్లపై తిరుగులేని ఆదరణ పొందుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘హ్యుందాయ్ వెన్యూ’లో కొత్త వేరియంట్​ని కంపెనీ తాజాగా లాంచ్​ చేసింది. దీని పేరు 'హెచ్​ఎక్స్​5+'. ఇదొక మిడ్-లెవల్ వేరియంట్‌. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 9.99 లక్షలుగా నిర్ణయించారు. మరీ ఖరీదైన టాప్ ఎండ్ వేరియంట్లు కొనలేక, బేస్ మోడల్‌లో ఫీచర్లు చాలవనుకునే కస్టమర్ల కోసం హ్యుందాయ్ ఈ ఈ హెచ్​ఎక్స్​5+ వేరియంట్​ని తీసుకుంది.

హ్యుందాయ్​ వెన్యూలో కొత్త వేరియంట్​..
హ్యుందాయ్​ వెన్యూలో కొత్త వేరియంట్​..

హ్యుందాయ్​ వెన్యూ హెచ్​ఎక్స్​5+.. ఫీచర్లు, లుక్ అదిరింది!

కొత్త హెచ్​ఎక్స్​5+ వేరియంట్‌లో మెకానికల్ మార్పులేవీ లేవు. ఇది సుపరిచితమైన 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్‌తో, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

అయితే, ఫీచర్ల విషయంలో మాత్రం హ్యుందాయ్ ఎక్కడా తగ్గలేదు.

బయటి వైపు: రూఫ్ రైల్స్, క్వాడ్ బీమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ దీనికి అగ్రెసివ్​ రూపాన్ని ఇస్తున్నాయి. వర్షాకాలంలో వెనుక వైపు స్పష్టంగా కనిపించేలా రియర్ వైపర్, వాషర్‌ను కూడా ఈ బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలో ఇచ్చారు.

లోపలి వైపు: కారు లోపల వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ సౌకర్యం ఉంది. అంటే వైర్ల గొడవ లేకుండా, ఫోన్ పెడితే చాలు ఛార్జ్ అయిపోతుంది. వెనుక సీట్లో కూర్చునే వారి కోసం విండో సన్‌షేడ్స్ అమర్చారు.

  • మార్కెట్​లోకి కొత్త ఫ్యామిలీ ఎస్​యూవీలు- 2026 కియా సెల్టోస్​, టాటా సియెర్రాలో ఏది బెస్ట్​? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

డ్రైవర్ సౌలభ్యం: డ్రైవింగ్‌కు మరింత కంఫర్ట్​ని ఇచ్చేందుకు స్టోరేజ్‌తో కూడిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ఆటో అప్-డౌన్, సేఫ్టీ ఫంక్షన్‌తో కూడిన పవర్ విండోస్ వంటి ఫీచర్లు ఈ హ్యుందాయ్​ వెన్యూ కొత్త వేరియంట్​లో ఉన్నాయి. ట్రాఫిక్‌లో ఇవి డ్రైవర్‌కు ఎంతో రిలీఫ్‌నిస్తాయి.

హ్యుందాయ్​ వెన్యూ హెచ్ఎ​క్స్​4 వేరియంట్‌లోనూ మార్పులు..

కొత్త వేరియంట్‌ లాంచ్​తో పాటు, వెన్యూలో ఇప్పటికే ఉన్న హెచ్​ఎక్స్​4 ట్రిమ్‌లోనూ హ్యుందాయ్ ఒక చిన్న అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఈ వేరియంట్‌లో కూడా డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్‌ను చేర్చారు. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేసే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

'కస్టమర్ల నుంచి భారీ స్పందన..'

సరికొత్త హ్యుందాయ్ వెన్యూకి మార్కెట్​లో ఇప్పటికే మంచి డిమాండ్ ఉంది. "కొత్త వెన్యూకి కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ 50,000 మార్కును దాటేశాయి," అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా హెచ్​ఎక్స్​5+ వేరియంట్‌ను తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మారుతీ సుజుకీ బ్రెజ్జా, కియా సోనెట్, స్కోడా కైలాక్, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ, టాటా నెక్సాన్ వంటి దిగ్గజాలతో హ్యుందాయ్ వెన్యూ గట్టిగా తలపడుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More