ఈవీ సేల్స్‌లో హ్యుందాయ్, కియాని వెనక్కి నెట్టిన విన్‌ఫాస్ట్.. టాప్-4లో చోటు
భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో వియత్నాం దిగ్గజం విన్‌ఫాస్ట్ అదరగొడుతోంది! 2025 డిసెంబర్ సేల్స్‌లో దిగ్గజ సంస్థలైన హ్యుందాయ్, కియాలను సైతం అధిగమించి టాప్-4లో నిలిచింది.
భారత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ‘విన్‌ఫాస్ట్’ అనూహ్య ఫలితాలను సాధిస్తోంది! 2025 డిసెంబర్ నెలకు సంబంధించి విడుదలైన విక్రయాల గణాంకాల ప్రకారం.. పరిమిత మోడళ్లతోనే బరిలోకి దిగిన వియత్నాంకు చెందిన ఈ సంస్థ, ఇండియాలో హ్యుందాయ్, కియా వంటి దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి నాలుగో అతిపెద్ద ఈవీ బ్రాండ్‌గా అవతరించింది.

ఈవీ మార్కెట్ టాప్-4లో ఎవరున్నారంటే?
వాహన్ పోర్టల్‌లోని తాజా గణాంకాల ప్రకారం.. 6,434 యూనిట్ల విక్రయాలతో (2025 డిసెంబర్) టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్లో రారాజుగా కొనసాగుతోంది. రెండో స్థానంలో 3,555 యూనిట్లతో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా నిలువగా, 3,065 యూనిట్ల అమ్మకాలతో మహీంద్రా ఎలక్ట్రిక్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ఇక అందరినీ ఆశ్చర్యపరుస్తూ 375 యూనిట్లు విక్రయించిన విన్‌ఫాస్ట్ ఆటో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది.
మహీంద్రాకు, విన్‌ఫాస్ట్‌కు మధ్య అమ్మకాల తేడా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ.. దిగ్గజాలైన హ్యుందాయ్ (262 యూనిట్లు), కియా (313 యూనిట్లు) కంటే ఎక్కువ కార్లను విక్రయించడం విన్‌ఫాస్ట్ సాధించిన గొప్ప విజయంగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
హ్యుందాయ్, కియాలను విన్‌ఫాస్ట్ ఎలా దాటేసింది?
ప్రస్తుతం విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో కేవలం రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. వీఎఫ్6 (రూ. 17.29 లక్షలు), వీఎఫ్7 (రూ. 21.89 లక్షలు) ప్రీమియం ధరల్లో ఉన్నప్పటికీ కస్టమర్లను ఆకట్టుకున్నాయి.
విన్ఫాస్ట్కి కలిసొచ్చే విషయం దేశంలో స్థానిక తయారీ కేంద్రం ఉండటం. ఇది డెలివరీలను పెంచడంతో పాటు సేల్స్‌కు ఊతం ఇస్తోంది. అంతేకాదు స్థానిక తయారీ కేంద్రం ఉండటం వల్ల ఈవీల ధరలను పోటీగా నిర్ణయించే అవకాశం కూడా విన్ఫాస్ట్కి లభించింది.
ఆధునిక ఫీచర్స్, లాంగ్ రేంజ్ వంటివి కూడా విన్‌ఫాస్ట్ కార్ల విక్రయాల జోరుకు ఒక కారణం.
మరోవైపు హ్యుందాయ్ క్రెటా ఈవీ (రూ. 18.02 లక్షలు), కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ (రూ. 17.99 లక్షలు) కూడా ఇదే ధరల శ్రేణిలో ఉన్నా, విన్‌ఫాస్ట్ వైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక లగ్జరీ విభాగంలో బీఎండబ్ల్యూ 343 యూనిట్లు, మెర్సిడెస్ బెంజ్ 237 యూనిట్లు, టెస్లా ఇండియా కేవలం 68 యూనిట్లు మాత్రమే డిసెంబర్ నెలలో విక్రయించాయి.
మార్కెట్లోకి కొత్తగా వచ్చినప్పటికీ, విన్‌ఫాస్ట్ పాత ప్లేయర్లను గట్టిగానే సవాల్ చేస్తోంది.
విదేశీ సంస్థలైన టెస్లా, విన్ఫాస్ట్లు ఇంచుమించు ఒకే సమయంలో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాయి. కానీ టెస్లా కన్నా విన్ఫాస్ట్కి భారతీయుల నుంచి క్రేజీ డిమాండ్ లభిస్తోంది.
టాటా, ఎంజీ, మహీంద్రాల ఆధిపత్యం ఎందుకు?
తక్కువ ధరలో ఎక్కువ ఆప్షన్లు ఉండటమే టాటా మోటార్స్ అగ్రస్థానానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
"పంచ్ ఈవీ (రూ. 9.99 లక్షలు), నెక్సాన్ ఈవీ (రూ. 12.49 లక్షలు) వంటి మోడళ్లు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చేరువయ్యాయి," అని వారు పేర్కొన్నారు.
ఎంజీ మోటార్స్ కూడా కామెట్ ఈవీ (రూ. 7.49 లక్షలు), విండ్సర్ ఈవీ (రూ. 13.99 లక్షలు) వంటి పోటీ ధరలతో రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మహీంద్రా విషయానికి వస్తే, ఆ సంస్థ ఎంట్రీ లెవల్ ఈవీ 'ఎక్స్‌యూవీ 400' ధర రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభం కావడం వల్ల అది మిడ్-రేంజ్ కస్టమర్లకే పరిమితమైంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


