Hyundai Venue : అదరగొట్టిన హ్యుందాయ్​ వెన్యూ- క్రాష్​ టెస్ట్​లో 5 స్టార్​ రేటింగ్..!

భారతీయ రోడ్లపై అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-4 మీటర్ ఎస్‌యూవీ 'హ్యుందాయ్ వెన్యూ' భద్రతలో తన సత్తా చాటింది. భారత్ ఎన్​సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ కారు అడల్ట్, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగాల్లో అత్యుత్తమ 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Mar 31, 2026, 06:00:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత వాహనదారులకు గుడ్​ న్యూస్​ ఇచ్చింది హ్యుందాయ్​ మోటార్స్​ సంస్థ. గతేడాది మార్కెట్​లోకి విడుదలైన '2025 హ్యుందాయ్ వెన్యూ', తాజాగా భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (బీఎన్​సీఏపీ) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. పెద్దల రక్షణ, పిల్లల రక్షణ అనే రెండు విభాగాల్లోనూ ఈ ఎస్​యూవీకి ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ రేటింగ్ లభించింది.

2025 హ్యుందాయ్​ వెన్యూపై బిగ్​ అప్డేట్​..
2025 హ్యుందాయ్​ వెన్యూపై బిగ్​ అప్డేట్​..

ప్రధానంగా డీజిల్ వేరియంట్లయిన హెచ్​ఎక్స్​2, హెచ్​ఎక్స్​10 మోడళ్లను పరీక్షించగా ఈ ఫలితాలు వచ్చాయి. అయితే, వెన్యూ లైనప్‌లోని మిగిలిన వేరియంట్లకు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

హ్యుందాయ్​ వెన్యూ సేఫ్టీ టెస్ట్​- పెద్దల రక్షణలో అదరహో!

అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ ఎస్​యూవీ మొత్తం 32 పాయింట్లకు గాను 31.15 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించింది.

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్: ఇందులో 16 పాయింట్లకు గాను 15.15 పాయింట్లు వచ్చాయి.

సైడ్ ఇంపాక్ట్ టెస్ట్: పక్క నుంచి జరిగే ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే ఈ టెస్టులో 16కి 16 పాయింట్లు సాధించి 'పర్ఫెక్ట్' అనిపించుకుంది.

సైడ్ పోల్ ఇంపాక్ట్: ఈ పరీక్షలో కూడా వెన్యూ ప్రదర్శన ఆకట్టుకుంది.

హ్యుందాయ్​ వెన్యూ సేఫ్టీ టెస్ట్​- పిల్లల భద్రతలోనూ భేష్!

చిన్నారుల భద్రత విషయంలోనూ హ్యుందాయ్ రాజీ పడలేదు. ఈ విభాగంలో 49 పాయింట్లకు గాను 44.46 పాయింట్లు వచ్చాయి.

డైనమిక్ స్కోరులో 24కి 23.46 పాయింట్లు సాధించింది.

చైల్డ్ రిస్ట్రైంట్ సిస్టమ్ (సీఆర్​ఎస్​) ఇన్‌స్టాలేషన్‌లో 12కి 12 పాయింట్లు సాధించి పూర్తి స్థాయి భద్రతను ధృవీకరించింది.

Summer car care guide : వేసవిలో మీ కారు భద్రంగా ఉండాలా? ఈ సమ్మర్ సేఫ్టీ చెక్స్ తప్పనిసరి..

హ్యుందాయ్​ వెన్యూ సేఫ్టీ టెస్ట్​- భద్రతా ఫీచర్లు ఇవే..

హ్యుందాయ్ వెన్యూలో ప్రయాణికుల రక్షణ కోసం అత్యాధునిక ఫీచర్లను అందించారు.

స్టాండర్డ్ ఫీచర్లు: 6 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్​తో కూడిన ఈబీడీ, ఈఎస్​సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్).

టెక్నాలజీ: టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్​), స్పీడ్ అలర్ట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ మౌంట్స్.

అడ్వాన్స్‌డ్ ఫీచర్లు: 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, 16 రకాల ఫీచర్లు కలిగిన లెవల్-2 అడాస్​ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటివి ఈ 2025 హ్యుందాయ్​ వెన్యూ ఎస్​యూవీలో ఉన్నాయి.

మొత్తానికి స్టైల్, ఫీచర్లతోనే కాకుండా, ఇప్పుడు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో వెన్యూ తన విభాగంలో బలమైన పోటీదారుగా నిలిచింది.

హైబ్రిడ్​ కార్లపై హ్యుందాయ్​ కన్ను!

మరో వార్తలో.. హ్యుందాయ్ మోటార్ ఇండియా తన పోర్ట్​ఫోలియోని భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రణాళికలో 'హైబ్రిడ్ ఎస్‌యూవీలు' కీలక పాత్ర పోషించనున్నాయి. రాబోయే కొన్నేళ్లలో కంపెనీ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలతో కూడిన బహుళ కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహనాలతో (ఈవీ) పాటు హ్యుందాయ్ ఇప్పుడు మూడు కొత్త ఎస్‌యూవీలతో భారతదేశంలో హైబ్రిడ్ విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. వీటిలో నెక్ట్స్​-జనరేషన్ హ్యుందాయ్ క్రెటా, ఒక కొత్త 7-సీటర్ ఎస్‌యూవీ, ప్రీమియం హ్యుందాయ్ పాలిసేడ్ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. భారత్ ఎన్​సీఏపీ టెస్టులో వెన్యూ సాధించిన స్కోరు ఎంత?

హ్యుందాయ్ వెన్యూ అడల్ట్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్ రెండింటిలోనూ 5-స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ సేఫ్టీలో 32 పాయింట్లకు గాను 31.15 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు గాను 44.46 పాయింట్లు సాధించి తన విభాగంలో అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది.

2. వెన్యూలో స్టాండర్డ్ (బేస్ వేరియంట్ నుంచి) లభించే భద్రతా ఫీచర్లు ఏమిటి?

హ్యుందాయ్ వెన్యూలో భద్రతకు పెద్దపీట వేస్తూ 6 ఎయిర్‌బ్యాగ్‌లను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. వీటితో పాటు ఏబీఎస్​ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్​సీ), వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి కీలక ఫీచర్లు బేస్ మోడల్ నుంచే అందుబాటులో ఉన్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More