IDBI Bank Recruitment 2026 : ఐడీబీఐ బ్యాంక్​లో ఉద్యోగాలు- డిగ్రీ ఉంటే చాలు, పూర్తి వివరాలు..

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్) 1100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం) ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 8 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Mar 10, 2026, 10:00:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఐడీబీఐ బ్యాంక్ గొప్ప అవకాశం కల్పిస్తోంది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం) పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవలే సంక్షిప్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఐడీబీఐ బ్యాంకులో రిక్రూట్​మెంట్​- పూర్తి వివరాలు..
ఐడీబీఐ బ్యాంకులో రిక్రూట్​మెంట్​- పూర్తి వివరాలు..

పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐడీబీఐ బ్యాంక్ జేఏఎం రిక్రూట్‌మెంట్ 2026 ముఖ్యాంశాలు:

నియామక సంస్థ: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్)

పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం)

మొత్తం ఖాళీలు: 1100

విద్యార్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ

వయోపరిమితి: 20 నుంచి 25 ఏళ్లు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 8, 2026

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 19, 2026

అధికారిక వెబ్‌సైట్: https://www.idbi.bank.in

ఐడీబీఐ బ్యాంక్​ జేఏఎం రిక్రూట్​మెంట్​ 2026- అర్హత ప్రమాణాలు..

అభ్యర్థులు భారత ప్రభుత్వం, యూజీసీ లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదేని విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్య గమనిక: కేవలం డిప్లొమా కోర్సులు మాత్రమే చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అనర్హులు.

కింది పేర్కొన్న విభాగాల్లో నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్స్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులే:

బీ.ఎస్సీ

అగ్రికల్చర్ / అగ్రికల్చర్ ఇంజనీరింగ్ (బీ.టెక్​ / బీ.ఈ)

హార్టికల్చర్ (ఉద్యానవన శాస్త్రం)

ఫిషరీ సైన్స్ / ఇంజనీరింగ్

యానిమల్ హస్బెండరీ (పశుసంవర్ధక శాఖ)

వెటర్నరీ సైన్స్

ఫారెస్ట్రీ (అటవీ శాస్త్రం)

డెయిరీ సైన్స్ / టెక్నాలజీ

ఫుడ్ సైన్స్ / టెక్నికల్

పిసికల్చర్ (చేపల పెంపకం)

ఆగ్రో ఫారెస్ట్రీ

సెరికల్చర్ (పట్టు పురుగుల పెంపకం)

గరిష్ట వయస్సు: 25 ఏళ్లు

నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

ఐడీబీఐ బ్యాంక్​ జేఏఎం రిక్రూట్​మెంట్​ 2026- ఎంపిక ప్రక్రియ..

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అభ్యర్థులను కింది నాలుగు దశల ద్వారా ఎంపిక చేస్తారు:

ఆన్‌లైన్ పరీక్ష

ధృవీకరణ పత్రాల పరిశీలన

వ్యక్తిగత ఇంటర్వ్యూ

ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్

ప్రతి దశలోనూ అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు.

ఐడీబీఐ బ్యాంక్​ జేఏఎం రిక్రూట్​మెంట్​ 2026- ఫీజు వివరాలు..

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ- రూ. 250

ఇతర అభ్యర్థులకు- రూ. 1050

చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు గడువు ముగియకముందే దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ సూచించింది.

ఐడీబీఐ బ్యాంక్​ జేఏఎం రిక్రూట్​మెంట్​ 2026 నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐడీబీఐ బ్యాంక్​ జేఏఎం రిక్రూట్​మెంట్​ 2026 అధికారిక వెబ్​సైట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More