ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ విపణిలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ప్రతిభ ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించాడు ఐఐటీ హైదరాబాద్ (IIT-H) విద్యార్థి ఎడ్వర్డ్ నేథన్ వర్గీస్. 2008లో ఈ విద్యాసంస్థ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఇదే అత్యధిక ప్యాకేజీ కావడం విశేషం. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ 'ఆప్టివర్' (Optiver) ఈ భారీ ఆఫర్‌ను ఎడ్వర్డ్‌కు అందించింది.
తొలి ఇంటర్వ్యూలోనే రూ. 2.5 కోట్ల ఆఫర్

కేవలం 21 ఏళ్ల వయసున్న ఎడ్వర్డ్ నేథన్ వర్గీస్ ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చివరి ఏడాది చదువుతున్నారు. గత వేసవిలో ఆప్టివర్ సంస్థలో రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసిన ఎడ్వర్డ్, తన ప్రతిభతో సంస్థను ఆకట్టుకుని 'ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్' (PPO) సాధించారు.
ఈ విజయం గురించి ఎడ్వర్డ్ మాట్లాడుతూ.. "నా జీవితంలో ఇది మరచిపోలేని క్షణం. నేను ఇంటర్వ్యూ ఇచ్చిన మొదటి కంపెనీ, చివరి కంపెనీ ఇదే. నాకు ఆఫర్ వస్తుందని మెంటార్ చెప్పగానే నా ఆనందానికి అవధులు లేవు. మా నాన్నమ్మ, తల్లిదండ్రులు కూడా చాలా గర్వపడుతున్నారు" అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పంచుకున్నారు.
హైదరాబాద్ అబ్బాయి.. బెంగళూరు చదువు
ఎడ్వర్డ్ హైదరాబాద్‌లో పుట్టి పెరిగినప్పటికీ, 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బెంగళూరులో చదువుకున్నారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ ఇంజనీర్లే కావడం ఆయనకు అదనపు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. "మొదటి ఏడాది నుంచే నేను కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్‌లో చురుగ్గా ఉన్నాను. దేశంలోని టాప్ 100 ప్రోగ్రామర్లలో ఒకరిగా ఉండటం, ఐఐటీ హైదరాబాద్‌లోని ఫ్లెక్సిబుల్ కరిక్యులం నాకు ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి బాగా ఉపయోగపడ్డాయి" అని ఆయన వివరించారు.
ప్లేస్‌మెంట్లలో పెరిగిన 'వేగం'
2025 ప్లేస్‌మెంట్ సీజన్ ఐఐటీ హైదరాబాద్‌కు అద్భుతంగా సాగుతోంది. గత ఏడాది సగటు ప్యాకేజీ ₹20.8 లక్షలు ఉండగా, ఈ ఏడాది అది ఏకంగా 75 శాతం పెరిగి ₹36.2 లక్షలకు చేరుకోవడం గమనార్హం.
- ఈ ఏడాది మొదటి దశలోనే 24 అంతర్జాతీయ ఆఫర్లు వచ్చాయి.
- ఎడ్వర్డ్‌తో పాటు మరో విద్యార్థి ₹1.1 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకున్నారు.
- అండర్ గ్రాడ్యుయేట్లలో ఇప్పటివరకు 62 శాతం మందికి ఉద్యోగ ఆఫర్లు లభించాయి.
కేవలం ప్యాకేజీల కోసమే కాదు..
{{/usCountry}}2025 ప్లేస్‌మెంట్ సీజన్ ఐఐటీ హైదరాబాద్‌కు అద్భుతంగా సాగుతోంది. గత ఏడాది సగటు ప్యాకేజీ ₹20.8 లక్షలు ఉండగా, ఈ ఏడాది అది ఏకంగా 75 శాతం పెరిగి ₹36.2 లక్షలకు చేరుకోవడం గమనార్హం.
- ఈ ఏడాది మొదటి దశలోనే 24 అంతర్జాతీయ ఆఫర్లు వచ్చాయి.
- ఎడ్వర్డ్‌తో పాటు మరో విద్యార్థి ₹1.1 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకున్నారు.
- అండర్ గ్రాడ్యుయేట్లలో ఇప్పటివరకు 62 శాతం మందికి ఉద్యోగ ఆఫర్లు లభించాయి.
కేవలం ప్యాకేజీల కోసమే కాదు..
{{/usCountry}}ఐఐటీ హైదరాబాద్ కెరీర్ సర్వీసెస్ ఆఫీస్ ఫ్యాకల్టీ ఇంచార్జ్ మయూర్ వైద్య మాట్లాడుతూ.. తమ లక్ష్యం కేవలం భారీ ప్యాకేజీలే కాదని, ఉద్యోగం కావాలనుకునే ప్రతి విద్యార్థికి మంచి ఆఫర్ అందేలా చూడటమేనని పేర్కొన్నారు. కోర్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రభుత్వ రంగ సంస్థలకు (PSUs), కోర్ కంపెనీలకు ప్లేస్‌మెంట్లలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు.
వచ్చే జూలై నెలలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నెదర్లాండ్స్‌లో ఎడ్వర్డ్ తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. 2017లో నమోదైన ₹1 కోటి ప్యాకేజీ రికార్డును ఎడ్వర్డ్ ఇప్పుడు తిరగరాశారు.