...
...
Next Story

Cyclone Montha : తుపాను ఎఫెక్ట్​- ఒడిశాలో భారీ వర్షాలు..

మోంథా' తుపాన్ ముంచుకొస్తోంది! అక్టోబర్ 28న కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయ్యింది. ఫలితంగా ఒడిశాలో విపత్తు నిర్వహణ బృందాలు హై అలర్ట్‌లో ఉన్నాయి.

Published on: Oct 26, 2025, 08:14:33 IST
Advertisement

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'మోంథా' తుపాన్ ముప్పు నేపథ్యంలో ఒడిశాలోని విపత్తు నిర్వహణ బృందాలు హై అలర్ట్‌ను ప్రకటించాయి. ఈ తుపాన్ తీరం దాటడానికి ముందే, అక్టోబర్ 27 నుంచి ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

తుపాను ప్రభావంతో వర్షాలు.. (AFP File )
తుపాను ప్రభావంతో వర్షాలు.. (AFP File )

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం.. అక్టోబర్ 26 నాటికి బంగాళాఖాతంలో ఈ తీవ్ర వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉంది. అనంతరం ఇది అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి వేళలో ఆంధ్రప్రదేశ్ తీరంలో మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో భారీ వర్షాల హెచ్చరిక..

తుపాన్ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 27 నుంచి 28 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా యానాంతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వాతావరణశాఖ అంచనా ప్రకారం.. అక్టోబర్ 26 తేదీకి మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు యెల్లో అలర్ట్​ జారీ చేశారు.

ఆంధ్రలో వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

అలాగే ఒడిశాలోని పలు జిల్లాల్లో అక్టోబర్ 28, 29 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇందులో గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలతో సహా అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో గంటకు 60 నుంచి 70 కిమీ వేగంతో గాలులు వీస్తాయి, కొన్ని చోట్ల గంటకు 80 కిమీ వరకు కూడా పెరగవచ్చు.

ఐఎండీ సమాచారం ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత ఆరు గంటల్లో కొద్దిగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలింది. అక్టోబర్ 25 రాత్రి 11:30 గంటల సమయానికి, ఇది చెన్నైకి ఆగ్నేయంగా 850 కిమీ దూరంలో, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 890 కిమీ దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 890 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఒడిశాలో తుపాన్ హెచ్చరికల దృష్ట్యా, అగ్నిమాపక శాఖ పూర్తి అప్రమత్తంగా ఉంది. అగ్నిమాపక అధికారి ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ, తమ శాఖ తుపాన్ కోసం ఎస్‌ఆర్‌సీ పడవలు, డ్రాఫ్ట్ బృందాలతో సిద్ధంగా ఉందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను కూడా సిద్ధం చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో ప్రసవించబోయే గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks