భారతదేశాన్ని విడిచి వెళ్లాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర నోటీసుపై ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బొంబాయి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) విధించిన గడువు ముగియడానికి ఒక్క రోజు ముందు న్యాయస్థానం ఈ విచారణను నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. అప్పటివరకు ఇమ్రాన్ ఖాన్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని, ఇచ్చిన నోటీసును తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు స్పష్టమైన హామీ ఇచ్చింది.
హైకోర్టులో ఏం జరిగింది?

ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేత్నాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరవుతారని కోర్టుకు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ తరఫు సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ ధోండ్ వాదనలు వినిపిస్తూ, అక్టోబర్ 28నే తమ క్లయింట్ దేశం విడిచి వెళ్లాల్సి ఉన్నందున ఈ విషయంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. అదనపు సోలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) స్పందిస్తూ.. "తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు ఉండవని మౌఖికంగా హామీ ఇస్తున్నాం" అని తెలిపారు. దీంతో వివాదాస్పద నోటీసును తాత్కాలికంగా నిలిపివేస్తూ, విచారణను నవంబర్ 2కి వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.
వివాదానికి అసలు కారణమేంటి?
అమెరికా పౌరసత్వంతో పాటు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్ కలిగి ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను అక్టోబర్ 10న ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) వివాదంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జరిగిన నిరసన ప్రదర్శన వద్ద ఆయన ఉన్నారు. ఆ సమయంలో ఆయనతో పాటు భాగస్వామి లేఖా వాషింగ్టన్, సోదరి జైన్ మేరీ ఖాన్‌లను కూడా పోలీసులు విచారించారు.
అనంతరం ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025లోని సెక్షన్లు 7(2)(సి), 29 కింద అక్టోబర్ 14న ఎఫ్ఆర్ఆర్ఓ 'లీవ్ ఇండియా నోటీస్' (ఎల్‌ఐఎన్) జారీ చేస్తూ, అక్టోబర్ 28 నాటికి దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.
పిటిషన్‌లో ఇమ్రాన్ ఖాన్ వాదనలు
{{/usCountry}}అనంతరం ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025లోని సెక్షన్లు 7(2)(సి), 29 కింద అక్టోబర్ 14న ఎఫ్ఆర్ఆర్ఓ 'లీవ్ ఇండియా నోటీస్' (ఎల్‌ఐఎన్) జారీ చేస్తూ, అక్టోబర్ 28 నాటికి దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.
పిటిషన్‌లో ఇమ్రాన్ ఖాన్ వాదనలు
{{/usCountry}}ఎఫ్ఆర్ఆర్ఓ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు జుల్ఫికర్ మెమన్, పర్వేజ్ మెమన్, కునాల్ వజానీలు బొంబాయి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసు చట్టవిరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ద్వారా లభించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని పేర్కొన్నారు. ఎలాంటి విచారణ జరపకుండా, షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ వినకుండా ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపారు.
రెండేళ్ల వయసు నుంచే భారత్‌లో నివాసం
తాను ఆ నిరసనలో ప్రత్యక్షంగా పాల్గొనలేదని, అక్కడికి వెళ్లేసరికి ధర్నా ఏదీ జరగడంలేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. రెండేళ్ల వయసు నుంచే తాను భారతదేశంలో నివసిస్తున్నానని, తన కుటుంబం, వివాహం, విద్య, సినీ జీవితం అంతా ఇక్కడే సాగాయని పిటిషన్‌లో వివరించారు. తనపై ఎలాంటి నేర చరిత్ర లేదని, రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదు ఆధారంగానే అధికారులు ముందస్తు ఆలోచన లేకుండా ఈ చర్యలకు దిగారని ఆరోపించారు. ఈ నోటీసును పూర్తిగా రద్దు చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.