ఇదేం బ్యాటింగ్? ఇలా ఆడితే వరల్డ్ కప్ గెలుస్తారా? ఇండియాకు దిమ్మతిరిగే షాక్.. సూపర్ 8 పోరులో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తు
ఇదేం బ్యాటింగ్.. ఇలా ఆడితే కప్ గెలుస్తామా? ఇవీ.. ఆదివారం టీ20 ప్రపంచకప్ లో ఇండియా బ్యాటింగ్ చూసిన తర్వాత ఫ్యాన్స్ లో కలిగిన ఫ్రస్టేషన్ ప్రశ్నలు. అవును.. టీమిండియా బ్యాటింగ్ దారుణంగా సాగింది. దీంతో సూపర్ 8 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో తీవ్ర పరాభవం తప్పలేదు.
వరుస విజయాలతో సూపర్ 8 కు వచ్చిన టీమిండియాకు దిమ్మతిరిగే షాక్. బ్యాటింగ్ లో పోరాటం కరవైన వేళ భారత్ కు టీ20 ప్రపంచకప్ 2026లో ఫస్ట్ ఓటమి తప్పలేదు. సూపర్ 8 పోరులో ఇండియా 76 పరుగుల తేడాతో చిత్తయింది. ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. యాన్సెన్ 4 వికెట్లతో భారత్ ను దెబ్బకొట్టాడు.
ఈ సారి ఇషాన్
ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోరే చేసింది. కానీ బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇండియా చెలరేగుతుందని అంతా అనుకున్నారు. అయితే టీమ్ బొక్క బోర్లా పడింది. గత మూడు మ్యాచ్ ల్లో అభిషేక్ డకౌట్ అయితే, ఈ సారి మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ సున్నాకే వెనుదిరిగాడు.
టపటపా
ఇషాన్ ఫస్ట్ ఓవర్లోనే పెవిలియన్ చేరిపోయాడు. ఆ వెంటనే తిలక్ వర్మ (1) ఫ్లాప్ షో కొనసాగించాడు. ఈ మ్యాచ్ తో టీ20 ప్రపంచకప్ లో అభిషేక్ శర్మ రన్స్ ఖాతా తెరిచాడు. కానీ 12 బంతుల్లో 15 పరుగులే చేసి ఔటయ్యాడు.
కెప్టెన్ సూర్యకుమార్ (22 బంతుల్లో 18 పరుగులు) కూడా నిలబడలేకపోయాడు. వాషింగ్టన్ సుందర్ (11), హార్దిక్ పాండ్య (18), రింకు సింగ్ (0) పెవిలియన్ కు క్యూ కట్టారు.
దూబె నిలబడ్డా
ఓ ఎండ్ లో వరుసగా వికెట్లు పడ్డా.. మరో ఎండ్ లో ఆల్ రౌండర్ శివమ్ దూబె (42) పోరాడాడు. కానీ మరో వైపు నుంచి అతనికి సపోర్ట్ దక్కలేదు. దీంతో సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతూ పోయింది. 24 బంతుల్లో 87 పరుగులు చేయాల్సి రావడంతో మ్యాచ్ పై ఆశలు కూలాయి. మ్యాచ్ చేతుల్లో నుంచి జారిపోయింది. ఇండియాకు ఓటమి తప్పలేదు. కేశమ్ మహరాజ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు.
బుమ్రా అదుర్స్
అంతకుముందు టాస్ గెలిచి దక్షిణాఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. టీమిండియా ప్రధాన పేసర్ బుమ్రా ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో చెలరేగాడు. 4 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అయినా మిల్లర్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63), డెవాల్డ్ బ్రేవిస్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45), ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 44 నాటౌట్) చెలరేగడంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది.
ఫ్యాన్స్ ట్రోల్స్
గ్రూప్ స్టేజీలో వరుసగా నాలుగు మ్యాచ్ ల్లోనూ ఇండియా గెలిచింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సారి స్వదేశంలో ఇండియా మళ్లీ ఛాంపియన్ గా నిలుస్తుందనే ఆశలు కలిగాయి. కానీ ఆదివారం సీన్ రివర్స్ అయింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో టీమిండియా ఆట చూశాక.. ఇలా బ్యాటింగ్ చేస్తారా? ఇలా ఆడితే కప్ గెలుస్తారా? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


