Indian Team: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ బిగ్ షాక్ ఇచ్చింది. సాధారణంగా ముందు మ్యాచ్ లో సెంచరీ చేసిన ప్లేయర్ కు టీమ్ లో చోటు ఉంటుంది. కానీ నిన్ననే శతకం బాదిన యశస్వి జైస్వాల్ ను మాత్రం ఈ రోజే జట్టులో నుంచి తప్పించడం హాట్ టాపిక్ గా మారింది.
ఇంగ్లాండ్ సిరీస్ కు టీమిండియా

వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ ఆదివారం (జూన్ 21) భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు తెలుగు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
యశస్విపై వేటు
నిన్న (జూన్ 20) అఫ్గానిస్థాన్ తో వన్డే మ్యాచ్ లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెచ్చిపోయాడు. అజేయ సెంచరీ బాదాడు. ఛేజింగ్ లో చెలరేగి ఆడి, టీమిండియాను గెలిపించాడు. అలాంటి ప్లేయర్ ను టీమ్ లో నుంచి తప్పిస్తారని ఎవరైనా అనుకుంటారా? కానీ టీమిండియా సెలక్టర్లు అదే పని చేశారు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు ఈ యువ ఓపెనర్ ను సెలెక్ట్ చేయలేదు.
విరాట్ కోహ్లి రిటర్న్
ఐపీఎల్ 2026లో అదరగొట్టి, ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లి తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ ఫైనల్లో కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డ కోహ్లి.. అఫ్గానిస్థాన్ తో సిరీస్ కు దూరమయ్యాడు. ఇప్పుడు ఫిట్ నెస్ సాధించి తిరిగి వన్డే టీమ్ లోకి అడుగుపెట్టాడు.
అందుకే యశస్విపై వేటు
అఫ్గానిస్థాన్ తో వన్డేలో సెంచరీ చేసినా కూడా యశస్విపై వేటు వేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే టీమ్ లోకి విరాట్ రీ ఎంట్రీ ఇవ్వడంతో సెలక్టర్లకు మరో ఆప్షన్ లేకుండా పోయిందని చెప్పొచ్చు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఆడతారు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ లాంటి బ్యాటర్లున్నారు. ఈ నేపథ్యంలో జైస్వాల్ పై వేటు వేయక తప్పలేదు.
వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్
{{/usCountry}}అఫ్గానిస్థాన్ తో వన్డేలో సెంచరీ చేసినా కూడా యశస్విపై వేటు వేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే టీమ్ లోకి విరాట్ రీ ఎంట్రీ ఇవ్వడంతో సెలక్టర్లకు మరో ఆప్షన్ లేకుండా పోయిందని చెప్పొచ్చు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఆడతారు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ లాంటి బ్యాటర్లున్నారు. ఈ నేపథ్యంలో జైస్వాల్ పై వేటు వేయక తప్పలేదు.
వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్
{{/usCountry}}భారత్, ఇంగ్లాండ్ మధ్య జూలై 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జూలై 16న సోఫియా గార్డెన్స్‌లో రెండో వన్డే, జూలై 19న చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆఖరి వన్డే మ్యాచ్‌ను నిర్వహిస్తారు.
భారత పూర్తి జట్టు ఇదే:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.