Indian Team: నిన్న సెంచరీ.. ఈ రోజు టీమ్ లో నుంచి ఔట్.. యశస్వి జైస్వాల్ పై వేటు..ఇంగ్లాండ్ తో వన్డేలకు కోహ్లి.. జట్టు ఇదే

Indian Team: బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్ననే అఫ్గానిస్థాన్ పై సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ ను ఈ రోజు టీమ్ నుంచి తప్పించింది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు సెలక్ట్ చేసిన టీమ్ లో అతనికి చోటు దక్కలేదు. కోహ్లి తిరిగి టీమ్ లోకి వచ్చాడు.

Published on: Jun 21, 2026, 14:16:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Indian Team: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ బిగ్ షాక్ ఇచ్చింది. సాధారణంగా ముందు మ్యాచ్ లో సెంచరీ చేసిన ప్లేయర్ కు టీమ్ లో చోటు ఉంటుంది. కానీ నిన్ననే శతకం బాదిన యశస్వి జైస్వాల్ ను మాత్రం ఈ రోజే జట్టులో నుంచి తప్పించడం హాట్ టాపిక్ గా మారింది.

సెంచరీ చేసినా జైస్వాల్ పై వేటు (ANI Pic Service)
సెంచరీ చేసినా జైస్వాల్ పై వేటు (ANI Pic Service)

ఇంగ్లాండ్ సిరీస్ కు టీమిండియా

వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ ఆదివారం (జూన్ 21) భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు తెలుగు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

యశస్విపై వేటు

నిన్న (జూన్ 20) అఫ్గానిస్థాన్ తో వన్డే మ్యాచ్ లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెచ్చిపోయాడు. అజేయ సెంచరీ బాదాడు. ఛేజింగ్ లో చెలరేగి ఆడి, టీమిండియాను గెలిపించాడు. అలాంటి ప్లేయర్ ను టీమ్ లో నుంచి తప్పిస్తారని ఎవరైనా అనుకుంటారా? కానీ టీమిండియా సెలక్టర్లు అదే పని చేశారు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు ఈ యువ ఓపెనర్ ను సెలెక్ట్ చేయలేదు.

విరాట్ కోహ్లి రిటర్న్

ఐపీఎల్ 2026లో అదరగొట్టి, ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లి తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ ఫైనల్లో కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డ కోహ్లి.. అఫ్గానిస్థాన్ తో సిరీస్ కు దూరమయ్యాడు. ఇప్పుడు ఫిట్ నెస్ సాధించి తిరిగి వన్డే టీమ్ లోకి అడుగుపెట్టాడు.

అందుకే యశస్విపై వేటు

అఫ్గానిస్థాన్ తో వన్డేలో సెంచరీ చేసినా కూడా యశస్విపై వేటు వేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే టీమ్ లోకి విరాట్ రీ ఎంట్రీ ఇవ్వడంతో సెలక్టర్లకు మరో ఆప్షన్ లేకుండా పోయిందని చెప్పొచ్చు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఆడతారు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ లాంటి బ్యాటర్లున్నారు. ఈ నేపథ్యంలో జైస్వాల్ పై వేటు వేయక తప్పలేదు.

వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్

భారత్, ఇంగ్లాండ్ మధ్య జూలై 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జూలై 16న సోఫియా గార్డెన్స్‌లో రెండో వన్డే, జూలై 19న చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆఖరి వన్డే మ్యాచ్‌ను నిర్వహిస్తారు.

భారత పూర్తి జట్టు ఇదే:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More