నమీబియాను చిత్తుగా ఓడించిన టీమిండియా.. టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండో విజయం.. పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి టాప్‌లోకి..
టీ20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. క్రికెట్ పసికూన నమీబియాను 93 పరుగులతో చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో గ్రూప్ ఎలో పాకిస్థాన్ ను వెనక్కి నెట్టి టాప్ లోకి దూసుకెళ్లింది.
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. గురువారం (ఫిబ్రవరి 12) జరిగిన మ్యాచ్‌లో పసికూన నమీబియాను 93 పరుగుల భారీ తేడాతో ఓడించి, టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో చెలరేగితే.. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి మెరిశాడు.

వరుసగా రెండో విజయంతో టాప్‌లోకి..
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా తన స్థాయికి తగినట్లుగానే ఆడుతోంది. తొలి మ్యాచ్ లో యూఎస్ఏపై కాస్త కష్టంగానే గెలిచినా.. నమీబియాతో మ్యాచ్ లో ఆధిపత్యం చెలాయించింది. వరుసగా రెండు మ్యాచ్ లలో గెలిచి గ్రూప్ ఎలో టాప్ లోకి దూసుకెళ్లింది. ఇండియా, పాకిస్థాన్ చెరో నాలుగు పాయింట్లు సాధించినా.. పాక్ కంటే ఎంతో మెరుగైన నెట్ రన్ రేట్ (3.050)తో టీమిండియా తొలి స్థానంలో ఉంది.
ఇషాన్, హార్దిక్ మెరుపులు
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ ఎ మ్యాచ్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ తర్వాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ధాటిగా ఆడి 28 బంతుల్లో 52 పరుగులు చేశాడు. శివమ్ దూబే (16 బంతుల్లో 23)తో కలిసి ఐదో వికెట్‌కు 81 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే చివరి ఓవర్లలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కేవలం 4 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు పడటం గమనార్హం. నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
వరుణ్ చక్రవర్తి స్పిన్ మ్యాజిక్
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా.. భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మ్యాజిక్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. 2 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. నమీబియా బ్యాటర్లలో లౌరెన్ స్టీన్‌క్యాంప్ (29) పర్వాలేదనిపించాడు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్: 209/9 (ఇషాన్ కిషన్ 61, హార్దిక్ పాండ్యా 52; ఎరాస్మస్ 4/20)
నమీబియా: 116 ఆలౌట్ (లౌరెన్ స్టీన్‌క్యాంప్ 29; వరుణ్ చక్రవర్తి 3/7)
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


