...
...
Next Story

టీమిండియాకు షాక్.. ఫస్ట్ వన్డేలో ఆసీస్ చేతిలో చిత్తు.. ఇదేం ఆట అంటూ ఫ్యాన్స్ ఫైర్

టీమిండియాకు షాక్. ఆస్ట్రేలియా టూర్ తో భారత్ ఫస్ట్ స్ట్రోక్ తగిలింది. ఆదివారం ఫస్ట్ వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ లో ఫెయిలైన శుభ్ మన్ గిల్ సేన ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో భారత ఆటపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Published on: Oct 19, 2025, 16:41:15 IST
Advertisement

ఆస్ట్రేలియాతో ఫస్ట్ వన్డేలో టీమిండియాకు షాక్ తప్పలేదు. కంగారూ గడ్డపై మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఓటమితో మొదలెట్టింది భారత్. ఆదివారం పెర్త్ లో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులే చేసింది. ఛేజింగ్ లో ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది.

హెడ్ ఔటైనా

ఆస్ట్రేలియాను గెలిపించిన మిచెల్ మార్ష్ (AFP)
ఆస్ట్రేలియాను గెలిపించిన మిచెల్ మార్ష్ (AFP)

ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే టీమిండియా కు హెడెక్ గా మారుతాడు ఓపెనర్ హెడ్. కానీ ఈ మ్యాచ్ లో అతణ్ని 8 పరుగులకే అర్ష్ దీప్ ఔట్ చేశాడు. కానీ మరో ఎండ్ లో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్) పాతుకుపోయాడు. మాథ్యూ షార్ట్ (8)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు.

ఫిలిప్ తో కలిసి

హెడ్, షార్ట్ తక్కువ పరుగులే చేసి ఔటైనా మిచెల్ మార్ష్ మాత్రం వికెట్ ఇవ్వలేదు. జోష్ ఫిలిప్ (37)తో కలిసి టీమ్ ను విజయం దిశగా నడిపించాడు. ఈ పార్ట్ నర్ షిప్ భారత్ కు మ్యాచ్ ను దూరం చేసింది. ఫిలిప్ ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేసినా అప్పటికే లేట్ అయింది. మ్యాట్ రెన్ షా (21 నాటౌట్)తో కలిసి మ్యాచ్ ముగించాడు మార్ష్.

బ్యాటింగ్ ఫెయిల్యూర్

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) పోరాడారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 26 ఓవర్లకు కుదించారు. హేజిల్ వుడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ కునెమన్ రెండేసి వికెట్ల చొప్పున సాధించారు.

ఆస్ట్రేలియాతో ఓటమి కంటే కూడా చిత్తుగా పరాజయం పాలవడం టీమిండియా ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. అందుకే ఇదేం ఆట అంటూ టీమ్ పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫెయిల్ కావడంతో ట్రోల్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks