...
...
Next Story

India Post GDS recruitment : 10 పాసైతే ప్రభుత్వ ఉద్యోగం- తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..

ఇండియా పోస్ట్ 2026 షెడ్యూల్-II కింద 23,757 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేసే ఈ ఉద్యోగాలకు సంబంధించిన కీలక తేదీలు, అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 31, 2026, 11:18:34 IST
Advertisement

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) అదిరిపోయే వార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 23,757 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటనను విడుదల చేసింది. జులై 2026 షెడ్యూల్-II కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ కేటగిరీలలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్​మెంట్ అప్డేట్స్..
ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్​మెంట్ అప్డేట్స్..

ఈ నేపథ్యంలో ఈ ఇండియా పోస్ట్ జీడీఎస్​ రిక్రూట్​మెంట్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రాత పరీక్ష లేదు.. కేవలం పదో తరగతి మార్కులతోనే!

ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్​మెంట్​ 2026 నోటిఫికేషన్ ఉన్న ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష గానీ, ఇంటర్వ్యూ గానీ ఉండవు. పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎటువంటి పోటీ పరీక్షల ఒత్తిడి లేకుండా సొంత ప్రాంతంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఇది అద్భుతమైన అవకాశం.

ఏ సర్కిల్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

ప్రకటించిన మొత్తం 23,757 ఖాళీలలో అత్యధికంగా ఈశాన్య (నార్త్ ఈస్టర్న్) సర్కిల్‌లో 2,614 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర సర్కిల్‌లో 2,431 ఖాళీలు, తమిళనాడు సర్కిల్‌లో 2,118 ఖాళీలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ సర్కిల్‌లో 1,762 పోస్టులు, ఉత్తర ప్రదేశ్‌ సర్కిల్‌లో 1,691 పోస్టులను కేటాయించారు. మహారాష్ట్ర సర్కిల్‌లో మరాఠీ, కొంకణి భాషల ప్రాతిపదికన, పశ్చిమ బెంగాల్ సర్కిల్‌లో బెంగాలీ, నేపాలీ భాషల ప్రాతిపదికన ఖాళీలను విభజించారు.

ఇక మొత్తం పోస్టుల్లో జనరల్ కేటగిరీకి సంబంధించి 10,640, ఎస్సీ కేటగిరిలో 3,082, ఎస్టీ కేటగిరీలో 2,773 ఉన్నాయి.

ఈ దరఖాస్తు తేదీలను నోట్ చేసుకోండి.

పోస్టల్ శాఖ అధికారిక షెడ్యూల్ ప్రకారం ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్​మెంట్​ 2026 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కింది విధంగా సాగుతుంది:

  • వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ప్రారంభం: ఆగస్టు 31, 2026
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 2, 2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2026
  • ఓటీఆర్ ముగింపు తేదీ: సెప్టెంబర్ 19, 2026
  • దరఖాస్తుల సవరణ: సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 24, 2026 వరకు

అర్హతలు, ఇతర వివరాలు..

గుర్తింపు పొందిన విద్యాబోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సర్కిల్‌కు చెందిన స్థానిక భాష మాట్లాడటం, రాయడం తెలిసి ఉండాలి.

ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్​మెంట్​ 2026 వేళ అనవసరమైన ఆందోళనకు గురికాకుండా ఆగస్టు 31 నుంచి ప్రారంభమయ్యే ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేసి, సమయానికి ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe