India Post GDS Result 2026 : ఇండియా పోస్ట్ జీడీఎస్ ఫలితాలు విడుదల- ఇలా చెక్ చేసుకోండి..
భారత తపాలా శాఖ గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నియామకాలకు సంబంధించి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను (తొలి విడత) విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం పదొవ తరగతి మార్కుల ఆధారంగా ఈ ఎంపికలు జరిగాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇండియా పోస్ట్ (భారత తపాలా శాఖ) 2026 సంవత్సరానికి గానూ ప్రకటించిన 28,636 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల ఫలితాలు శనివారం (మార్చి 7) విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in లో సర్కిల్ వారీగా చూసుకోవచ్చు.

ఇండియా పోస్ట్ జీడీఎస్ 2026 ఫలితాలు చెక్ చెసుకునేందుకు కావాల్సిన డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇండియా పోస్ట్ జీడీఎస్ 2026- నియామక ప్రక్రియ ముఖ్యాంశాలు..
ఇండియా పోస్ట్ జీడీఎస్ 2026 మొత్తం ఖాళీలు: 28,636 పోస్టులు
ఎంపిక విధానం: పదొవ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా (ఎటువంటి పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదు)
ఫలితాల ఫార్మాట్: సర్కిల్ వారీగా పీడీఎఫ్ మెరిట్ జాబితా
అధికారిక వెబ్‌సైట్: indiapostgdsonline.gov.in
ఇండియా పోస్ట్ జీడీఎస్ 2026 ఫలితాలు- మెరిట్ లిస్ట్ తయారీ ఇలా..
ఇండియా పోస్ట్ జీడీఎస్ 2026 నియామక ప్రక్రియలో రాత పరీక్ష లేదు. అభ్యర్థులు పదొవ తరగతిలో సాధించిన మార్కులను కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ ద్వారా పర్సెంటేజీలుగా మారుస్తారు.
గ్రేడ్లు లేదా పాయింట్లను పర్సెంటేజీల్లోకి మార్చేటప్పుడు ఖచ్చితత్వం కోసం నాలుగు డెసిమల్ పాయింట్ల వరకు లెక్కిస్తారు. సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్‌లో ఎవరికైతే అత్యధిక స్కోరు ఉంటుందో, వారికే మెరిట్ జాబితాలో చోటు దక్కుతుంది.
ఇండియా పోస్ట్ జీడీఎస్ 2026 ఫలితాలు- మెరిట్ లిస్ట్ తర్వాత ఏం జరుగుతుంది?
ఇండియా పోస్ట్ జీడీఎస్ 2026 రిక్రూట్మెంట్లో భాగంగా తొలి మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు తదుపరి దశలో ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ (అసలు పత్రాల పరిశీలన) ఉంటుంది.
- షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు పత్రాల పరిశీలన కోసం పిలుపు వస్తుంది.
- అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాతే తుది ఎంపికను ఖరారు చేస్తారు.
ఇండియా పోస్ట్ జీడీఎస్ 2026 ఫలితాలు- నకిలీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్త..
గ్రామీణ డాక్ సేవక్ ఫలితాల పేరుతో ఇంటర్నెట్‌లో అనేక నకిలీ వెబ్‌సైట్లు తిరుగుతున్నాయి. అభ్యర్థులు తమ వ్యక్తిగత సమాచారం లేదా నగదును కోల్పోకుండా ఉండాలంటే, కేవలం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని అధికారులు సూచించారు.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
ప్రశ్న- డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఏయే పత్రాలు వెంట తీసుకెళ్లాలి?
సమాధానం- అభ్యర్థులు తమ వెంట ఈ కింంది ఒరిజినల్ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాలి:
పదొవ తరగతి మార్కుల జాబితా
కులం సర్టిఫికేట్ (వర్తిస్తే)
ఆధార్ కార్డ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు
నివాస ధృవీకరణ పత్రం (రెసిడెన్స్ సర్టిఫికేట్).
దివ్యాంగులైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్.
మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ (కొన్ని సందర్భాల్లో వెరిఫికేషన్ తర్వాత అడుగుతారు.)
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ని చూడాల్సి ఉంటుంది.
ప్రశ్న- మొదటి మెరిట్ జాబితాలో పేరు లేకపోతే ఇంకేమైనా అవకాశం ఉంటుందా?
సమాధానం- అవును, ఖచ్చితంగా ఉంటుంది. మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరుకాకపోయినా లేదా తప్పుడు సమాచారం వల్ల తిరస్కరణకు గురైనా, ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ఇండియా పోస్ట్ రెండు, మూడొవ మెరిట్ లిస్ట్‌లను విడుదల చేస్తుంది. కాబట్టి కటాఫ్ మార్కులకు దగ్గరగా ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చూస్తూ ఉండాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












