దేశంలో సరిగా వర్షాలు పడకపోవడం విద్యుత్ రంగాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. తీవ్రమైన ఉక్కపోతతో ఇళ్లలో ఏసీల వాడకం నిరంతరం సాగుతుండటం, పంటలను కాపాడుకునేందుకు రైతులు వ్యవసాయ పంపుసెట్లను పెద్ద ఎత్తున వాడటంతో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. సెప్టెంబరు మొదటి వారంలోనే డిమాండ్ 256 గిగావాట్లకు చేరడంతో రోజుకు 20 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ కొరత ఏర్పడుతోంది.
డిమాండ్ పెరగడానికి అసలు కారణాలేంటి?

వరి పంటకు అత్యంత కీలకమైన సమయంలో వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలను తోడేందుకు రైతులు పంపుసెట్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీనికి తోడు వాతావరణంలో తేమ పెరిగి ఉక్కపోతగా ఉండటంతో పట్టణాలు, నగరాల్లో ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. మే నెలలో దేశీయ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 270.8 గిగావాట్లను తాకింది. జులై, ఆగస్టు నెలల్లో కాస్త తగ్గినా, సెప్టెంబరు మొదటి వారంలో మళ్లీ 255 గిగావాట్లు దాటింది. ఈ ఏడాది అత్యధిక డిమాండ్ 272 గిగావాట్లకు చేరుకోవచ్చని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేస్తోంది.
విద్యుత్ కొరత ఎందుకు పెరుగుతోంది?
వర్షాలు లేకపోవడంతో జలవిద్యుత్ (హైడ్రో పవర్) ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. క్రిసిల్ నివేదిక ప్రకారం జులైలో జలవిద్యుత్ ఉత్పత్తి గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గింది. గనుల ప్రాంతాల్లో వర్షాల వల్ల బొగ్గు తవ్వకాలు, రవాణా కాస్త మందగించడం సమస్యను మరింత తీవ్రం చేసింది. గతేడాది ఇదే సమయంలో విద్యుత్ కొరత ఒక మిలియన్ యూనిట్ కంటే తక్కువగా ఉండగా, ఈసారి ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో కొరత 20 మిలియన్ యూనిట్లు దాటింది.
థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వల పరిస్థితి ఏంటి?
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో గనుల్లో నీరు చేరి తవ్వకాలు తగ్గడం సహజమే అయినా, ఈసారి విద్యుత్ డిమాండ్ ఆకస్మికంగా పెరగడంతో నిల్వలు మరింత పడిపోయాయి. సెప్టెంబరు 6 నాటికి దేశంలోని 190 థర్మల్ ప్లాంట్లలో 26.7 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. ఇది కేవలం 8.5 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది. ఇందులో 58 ప్లాంట్లలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. అక్కడ ఉండాల్సిన బొగ్గు నిల్వల్లో 25 శాతం కంటే తక్కువ మాత్రమే అందుబాటులో ఉంది.
బొగ్గు సరఫరా పెంపునకు చర్యలు
{{/usCountry}}థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో గనుల్లో నీరు చేరి తవ్వకాలు తగ్గడం సహజమే అయినా, ఈసారి విద్యుత్ డిమాండ్ ఆకస్మికంగా పెరగడంతో నిల్వలు మరింత పడిపోయాయి. సెప్టెంబరు 6 నాటికి దేశంలోని 190 థర్మల్ ప్లాంట్లలో 26.7 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. ఇది కేవలం 8.5 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది. ఇందులో 58 ప్లాంట్లలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. అక్కడ ఉండాల్సిన బొగ్గు నిల్వల్లో 25 శాతం కంటే తక్కువ మాత్రమే అందుబాటులో ఉంది.
బొగ్గు సరఫరా పెంపునకు చర్యలు
{{/usCountry}}పరిస్థితిని చక్కదిద్దేందుకు బొగ్గు గని యాజమాన్యాలు రవాణాను వేగవంతం చేశాయి. సెప్టెంబరు 3న విద్యుత్ రంగానికి 370 రైల్వే వేగన్ల (రేక్స్) ద్వారా బొగ్గు పంపగా, సెప్టెంబరు 6 నాటికి ఆ సంఖ్యను 444కు పెంచారు. గనుల ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో కోల్ ఇండియా ఉత్పత్తిని ముమ్మరం చేసింది. సెప్టెంబరు మొదటి మూడు రోజుల్లో రోజువారీ సగటు ఉత్పత్తి 1.36 మిలియన్ టన్నులు ఉండగా, సెప్టెంబరు 6 నాటికి అది 35 శాతం పెరిగి 1.83 మిలియన్ టన్నులకు చేరింది.
ఇది తీవ్ర విద్యుత్ సంక్షోభమేనా?
ప్రస్తుత పరిస్థితిని సంక్షోభంగా చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పగటిపూట పెరిగే విద్యుత్ అవసరాలను సౌర విద్యుత్ ద్వారా సమర్థవంతంగా తీర్చగలుగుతున్నారు. అయితే సాయంత్రం వేళ సౌర విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినప్పుడు థర్మల్ ప్లాంట్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఏప్రిల్-మే నెలల్లో డిమాండ్ తీవ్రంగా ఉన్నప్పుడు కూడా 20 గిగావాట్ల గ్యాస్ ఆధారిత ప్లాంట్ల సాయంతో ప్రభుత్వం పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించింది. కాబట్టి గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం లేనప్పటికీ, డిమాండ్ ఎక్కువగా ఉండే వేళల్లో కొన్ని ప్రాంతాల్లో లోడ్ షెడ్డింగ్ (కోతలు) తప్పకపోవచ్చు.