లక్నోలోని ఏకానా స్టేడియంలో జరగాల్సిన ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20 మ్యాచ్.. పొగమంచు కారణంగా రద్దయింది. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మరోవైపు ప్రాక్టీస్ సమయంలో గాయం కారణంగా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు.
నాలుగో టీ20కి పొగ మంచు దెబ్బ

లక్నో స్టేడియంలో మ్యాచ్ చూద్దామని వచ్చిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దవడం చాలా మందిని అసహనానికి గురి చేసింది.
షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ వేసి, 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ చేయాలి. కానీ మైదానాన్ని మంచు దుప్పటి కప్పేయడంతో అది సాధ్యం కాలేదు. మ్యాచ్ అఫీషియల్స్ మ్యాచ్ జరిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు.
పరిస్థితిని సమీక్షించడానికి సాయంత్రం 6:50 నుంచి మొదలుపెట్టి.. 7:30, 8:00, 8:30, 9:00.. ఇలా చాలాసార్లు గ్రౌండ్‌ను చెక్ చేశారు. చివరికి 9:25 గంటలకు ఫైనల్ ఇన్‌స్పెక్షన్ జరిపాక మ్యాచ్‌ను రద్దు చేశారు.
రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఐసీసీ రూల్స్ ప్రకారం.. వర్షం లేదా మంచు వల్ల మ్యాచ్ కుదించాల్సి వస్తే, కనీసం 5-5 ఓవర్ల మ్యాచ్ అయినా జరగాలి. దీనికోసం రాత్రి 9:46 గంటల లోపు మ్యాచ్ స్టార్ట్ అవ్వాలి. కానీ 9:25కి కూడా విజిబిలిటీ క్లియర్‌గా లేకపోవడంతో, ప్లేయర్స్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.
గిల్ ఔట్.. సంజూకి ఛాన్స్?
ఈ మ్యాచ్ రద్దు వార్తతో పాటు టీమిండియా ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా టీ20 సిరీస్ నుంచి వైదొలిగాడు. ప్రాక్టీస్ సెషన్లో గిల్ కాలికి గాయమైంది. దీంతో మిగిలిన మ్యాచ్‌లకు అతను దూరంగా ఉండనున్నాడని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది.
{{/usCountry}}ఈ మ్యాచ్ రద్దు వార్తతో పాటు టీమిండియా ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా టీ20 సిరీస్ నుంచి వైదొలిగాడు. ప్రాక్టీస్ సెషన్లో గిల్ కాలికి గాయమైంది. దీంతో మిగిలిన మ్యాచ్‌లకు అతను దూరంగా ఉండనున్నాడని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది.
{{/usCountry}}గిల్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో అవకాశం దక్కవచ్చు. అయితే ఈ మ్యాచ్ రద్దు కావడంతో డిసెంబర్ 19న జరిగే చివరి మ్యాచ్ వరకు సంజూ వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఐదు టీ20ల సిరీస్ లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్ గెలవాలంటే చివరి మ్యాచ్ లోనూ టీమిండియా కచ్చితంగా గెలవాల్సిందే.