భారత ఆటోమొబైల్ విపణిలో సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా మరో విప్లవాత్మక మోడల్‌ను పరిచయం చేయడానికి రెడీ అవుతోంది! వినూత్న ఫీచర్లతో కూడిన సరికొత్త 'బేయాన్' ఎస్‌యూవీని 2026 అక్టోబర్ 26న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీని తాజాగా ఇండియాలో రివీల్ చేసింది.

ఈ వాహనాన్ని కేవలం ఒక సాధారణ కాంపాక్ట్ ఎస్‌యూవీలా కాకుండా, సాంకేతికతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 'ఇంటెలిజెంట్ యుటిలిటీ వెహికల్' (ఐయూవీ)గా కంపెనీ ప్రమోట్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..s
హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ- బుకింగ్స్ ప్రారంభం..
పండుగ సీజన్‌లో వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ విక్రయాలను త్వరలోనే ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ.11,000 టోకెన్ మొత్తం చెల్లించి 'బేయాన్' ఎస్‌యూవీని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని యాజమాన్యం వెల్లడించింది. ఈ పండుగ సీజన్ నుంచే డెలివరీలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసినప్పటికీ, ధరలకు సంబంధించిన వివరాలను మాత్రం లాంచ్ రోజే అధికారికంగా ప్రకటించనుంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.
హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ- నయా వాయిస్ అసిస్టెంట్..
హ్యుందాయ్ బేయాన్‌లో ప్రధాన ఆకర్ష.. ఇందులో తొలిసారిగా 'పర్ప్లెక్సిటీ జెనరేటివ్ ఏఐ', సౌండ్‌హౌండ్ ఏఐ సాంకేతికతలతో పనిచేసే ఇంటెలిజెంట్ వాయిస్ అసిస్టెంట్‌ను అందించారు. ఇది కేవలం పాతకాలపు కమాండ్లకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రయాణికులతో సాధారణ మానవుడిలా సంభాషిస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు వాతావరణ సమాచారం, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, స్పోర్ట్స్ లైవ్ స్కోర్లు లేదా ప్రయాణ ప్రణాళికల గురించి అడిగితే తక్షణమే ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.
ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పటికీ ఎస్‌యూవీలో ఫీచర్లను కంట్రోల్ చేసేందుకు 500కి పైగా 'ఎంబెడెడ్ వాయిస్ కమాండ్లను' పొందుపరిచారు. ఇవి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, హింగ్లీష్, తమిళం, బెంగాలీ భాషలలో పనిచేయడం వల్ల మన దక్షిణ భారతదేశ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ- డ్యాష్‌బోర్డ్, డ్యూయల్ స్క్రీన్లు..
{{/usCountry}}ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పటికీ ఎస్‌యూవీలో ఫీచర్లను కంట్రోల్ చేసేందుకు 500కి పైగా 'ఎంబెడెడ్ వాయిస్ కమాండ్లను' పొందుపరిచారు. ఇవి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, హింగ్లీష్, తమిళం, బెంగాలీ భాషలలో పనిచేయడం వల్ల మన దక్షిణ భారతదేశ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ- డ్యాష్‌బోర్డ్, డ్యూయల్ స్క్రీన్లు..
{{/usCountry}}బేయాన్ క్యాబిన్ లోపల అత్యాధునిక డిజిటల్ అనుభూతిని అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌పై రెండు 12.3-ఇంచుల కర్వ్‌డ్ డిస్‌ప్లేలను అమర్చారు. ఎన్విడియా పవర్‌తో పనిచేసే ‘కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్‌పిట్’ ద్వారా ఆన్‌లైన్ నావిగేషన్, స్ల్పిట్ స్క్రీన్ సదుపాయాలు లభిస్తాయి.
కంపెనీకి చెందిన ప్రసిద్ధ ‘హ్యుందాయ్ బ్లూలింక్’ టెక్నాలజీ ద్వారా 70కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లను అందించారు. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌ల ద్వారా వాహనాన్ని రిమోట్‌గా కంట్రోల్ చేయడం, లొకేషన్ ట్రాకింగ్, భద్రతా అలర్ట్స్ని పొందవచ్చు. కారులోని 19 వెహికల్ కంట్రోలర్లకు 'ఓవర్ ద ఎయిర్' సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వెసులుబాటు ఇచ్చారు. దీనివల్ల ప్రతి చిన్న సాఫ్ట్‌వేర్ మార్పు కోసం షోరూమ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ- పవర్‌ఫుల్ ఇంజిన్..
సాంకేతిక పరంగా ఎంతో ముందున్న ఈ ఎస్‌యూవీలో అత్యంత నమ్మకమైన 1.5-లీటర్, 4-సిలిండర్ ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 113 బీహెచ్పీ పవర్, 144 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, హ్యుందాయ్ 'ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్' (ఐవీటీ) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభించనుంది.
భారతీయ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజ్జా, కియా సోనెట్ వంటి మోడళ్లకు హ్యుందాయ్ బేయాన్ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.