ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ పేలవ ప్రదర్శన చేసి ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అయితే, ఔటైన తర్వాత కోహ్లీ చేసిన పని ఇప్పుడు అతని ఫ్యాన్స్‌కి మరింత ఆందోళన కలిగిస్తోంది! అంతేకాదు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనే టాపిక్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
అసలేం జరిగింది?

పెర్త్ వేదికగా, కొన్ని రోజుల క్రితం జరిగిన మొదటి వన్డేలో డకౌట్ అయన కోహ్లీపై చాలా ఒత్తిడి ఉంది. రెండో వన్డేలో అతను చెలరేగుతాడని అందరు అనుకున్నారు. కానీ అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో నాలుగు బంతులాడిన కోహ్లీ డకౌట్ అయ్యాడు! ఫ్యాన్స్‌తో పాటు టీమిండియా అభిమానులందరు షాక్ అయ్యారు.
జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు కోహ్లీ. అంతేకాదు, విరాట్ ఇలా వరుసగా రెండుసార్లు డకౌట్ అవ్వడం, అతని కెరీర్లోనే మొదటిసారి!
ఆ తర్వాత కోహ్లీ పెవీలియన్వైపు నడిచాడు. అడిలైడ్‌లో కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్ అవ్వొచ్చు అన్న ఊహాగానాల మధ్య అక్కడి ప్రేక్షకులు “కోహ్లీ, కోహ్లీ” అంటూ అరిచారు. దానికి కోహ్లీ తన గ్లోవ్స్‌ని పైకి చూపిస్తూ, పెవీలియన్వైపు వెళ్లాడు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే టెస్టులు, టీ20లకు గుడ్‌బై చెప్పిన రన్ మెషిన్.. ఆస్ట్రేలియాతో పేలవ ప్రదర్శన అనంతరం వన్డేల నుంచి కూడా తప్పుకుంటాడా? అన్న సందేహాలు మొదలయ్యయి.
ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది.
“గొప్ప కెరీర్లు ఏదో ఒక రోజు ముగింపునకు రాక తప్పదు! విరాట్ కోహ్లీ ఒక GOAT. కానీ అతని పతనం స్పష్టంగా కనిపిస్తోంది. అతనిలో ఏదో వ్యత్యాసం కనిపిస్తోంది,” అని ఒక యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
{{/usCountry}}“గొప్ప కెరీర్లు ఏదో ఒక రోజు ముగింపునకు రాక తప్పదు! విరాట్ కోహ్లీ ఒక GOAT. కానీ అతని పతనం స్పష్టంగా కనిపిస్తోంది. అతనిలో ఏదో వ్యత్యాసం కనిపిస్తోంది,” అని ఒక యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
{{/usCountry}}“ఓహ్ గాడ్! ఈ కోహ్లీ ఒకప్పటి కోహ్లీలా లేడు! ఇంత అస్పష్టంగా తన కెరీర్లో ఎప్పుడూ లేడు. ఆస్ట్రేలియాలో అడుగుపెటటిన ప్రతిసారీ, ఒక గొప్ప ఎనర్జీ, ఫైర్‌తో కనిపించేవాడు. అదేదీ ఇప్పుడు కనిపించడం లేదు. అడిలైడ్ క్రౌడ్‌ని చూసి అలా చేశాడు(గ్లౌజ్ ఎత్తడం). ఇది దేనికైనా హింట్ ఆ?” అని మరొకరు రాసుకొచ్చారు.
ఎదురీదుతున్న టీమిండియా..
మరోవైపు, 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి వన్డేలో ఓటమి పాలైన టీమిండియా.. రెండో వన్డేలో ఎదురీదుతోంది. ప్రస్తుతం 38 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 180 పరుగుల వద్ద ఉంది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 9 పరుగులకే ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ.. తన సత్తాని చాటుతూ 73 రన్స్ చేశాడు. శ్రేయాస్ అయ్యార్ 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కోహ్లీ, అక్సర్ పటేల్, కేఎల్ రాహుల్‌లు ఆకట్టుకోలేకపోయారు.