టీమిండియా దీపావళి సెలబ్రేషన్స్.. ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు ముందు స్పెషల్ డిన్నర్

టీమిండియా ప్లేయర్స్ ఆస్ట్రేలియాలో దీపావళ స్పెషల్ డిన్నర్ చేశారు. అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు ముందు మన ప్లేయర్స్ అక్కడి రెస్టారెంట్ కి వచ్చిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: Oct 22, 2025, 18:45:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్ ఈసారి దీపావళి పండుగను అక్కడే జరుపుకుంది. అడిలైడ్‌లోని 'బ్రిటీష్ రాజ్' అనే రెస్టారెంట్‌లో టీమ్ డిన్నర్ చేసుకున్నారు. ఈ రెస్టారెంట్‌కు, టీమిండియాకు మధ్య ఒక హిస్టరీ ఉంది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనాన్ని చదవండి.

టీమిండియా దీపావళి సెలబ్రేషన్స్.. ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు ముందు స్పెషల్ డిన్నర్ (Screengrab)
టీమిండియా దీపావళి సెలబ్రేషన్స్.. ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు ముందు స్పెషల్ డిన్నర్ (Screengrab)

టీమిండియా దీపావళి సెలబ్రేషన్స్

ఈ ఏడాది దీపావళి సంబరాలలో తమ ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ, ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్.. ఆస్ట్రేలియాలో ఈ పండుగను జరుపుకునే అవకాశాన్ని పొందింది. వైట్-బాల్ సిరీస్‌లో రెండో వన్డే కోసం అడిలైడ్‌కు చేరుకున్న తర్వాత, ఈ సౌత్ ఆస్ట్రేలియా నగరంలోని ఒక ప్రముఖ ఇండియన్ రెస్టారెంట్‌లో పలువురు ప్రముఖ ఆటగాళ్లు కలిసి టీమ్ డిన్నర్ చేసుకున్నారు.

విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వంటి ప్రముఖ భారత క్రికెట్ స్టార్లు అడిలైడ్ శివారులోని టోర్రెన్స్‌విల్లేలో ఉన్న 'బ్రిటీష్ రాజ్' అనే రెస్టారెంట్‌కు బచ్చారు. ఈ ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లినప్పుడల్లా మన ప్లేయర్స్ కి ఇష్టమైన రెస్టారెంట్‌లలో ఇదీ ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

విదేశీ గడ్డపై తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ఈ సూపర్ స్టార్స్‌కు ఇది ఇంటి రుచిని అందించింది. శ్రేయస్ అయ్యర్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు కూడా అడిలైడ్‌లో జరిగిన ఈ టీమ్ డిన్నర్‌లో పాల్గొన్నారు. రెస్టారెంట్ యజమాని రోహిత్ శర్మతో సహా ఇతర ఆటగాళ్లతో కలిసి ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశారు.

ఈ రెస్టారెంట్‌తో టీమిండియా హిస్టరీ ఇలా..

పెర్త్‌లో జరిగిన సిరీస్‌లోని మొదటి వన్డేలో ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి తర్వాత, క్రికెట్ ఫీల్డ్ కి దూరంగా ఉంది టీమిండియా. అయితే ఈ టీమ్ డిన్నర్ ద్వారా ప్లేయర్స్ అందరూ మరోసారి కలిసి, రీబూట్ అయ్యే అవకాశం దక్కింది. చివరిసారిగా టీమ్ డిన్నర్ కోసం ఈ నెల మొదట్లోనే ప్లేయర్స్ వెళ్లారు. అప్పుడు వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఢిల్లీలోని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నివాసానికి వెళ్లారు.

భారత జట్టు 2022 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు ముందు అడిలైడ్‌లోని బ్రిటిష్ రాజ్ రెస్టారెంట్‌లో భోజనం చేసింది. అయితే ఆ తర్వాత బ్రిటీష్ టీమ్ ఇండియన్ టీమ్ ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేయడంతో ఈ రెస్టారెంట్ తో అనుబంధంపై ఓ మచ్చ పడింది.

ఈసారి అడిలైడ్ ఓవల్‌లో మెరుగైన ఫలితం కోసం భారత జట్టు ఆశిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో అడిలైడ్ లో టీమిండియాకు అంత మంచి రికార్డేమీ లేదు. దీంతో రెండో వన్డేలో ఏం చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే తొలి వన్డేలో డకౌట్ అయిన విరాట్ కోహ్లికి మాత్రం ఈ అడిలైడ్ లో అదిరిపోయే రికార్డు ఉంది. ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. మరి ఈ మ్యాచ్ లో అతడు ఎలా రాణిస్తాడో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More