T20 World Cup: ఇంగ్లాండ్ తో ఇండియా సెమీస్.. అభిషేక్ పై వేటు? ఆ ప్లేయర్ ను ఆడించాలంటున్న రవిశాస్త్రి
T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో ఇండియా కీలక పోరుకు సిద్ధమవుతోంది. రేపు జరిగే సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్ లో ఒకవేళ అభిషేక్ శర్మపై వేటు వేస్తే ఆ ప్లేయర్ ను ఆడించాలంటూ రవిశాస్త్రి మరో ఆటగాడి పేరు సూచించాడు.
టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా సెమీస్ కు రెడీ అవుతోంది. గురువారం (మార్చి 5) సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఢీ కొడుతుంది. ఇప్పుడు అందరి ఫోకస్ ఈ మ్యాచ్ పైనే ఉంది. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మను తప్పించాల్సి వస్తే రింకు సింగ్ ను ఫైనల్ ఎలెవన్ లో ఆడించాలని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించాడు.

అభిషేక్ శర్మ ఫామ్
టీ20 ప్రపంచకప్ లో అభిషేక్ శర్మ ఫామ్ అంతంతమాత్రంగానే ఉంది. ఈ విధ్వంసక ఓపెనర్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఈ టోర్నీలో అతను ఆడిన ఫస్ట్ మూడు మ్యాచ్ ల్లో డకౌట్ అయ్యాడు. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ బాదాడు. కానీ వెస్టిండీస్ తో కీలకమైన పోరులో మాత్రం మళ్లీ ఫెయిల్ అయ్యాడు. ఈ టీ20 ప్రపంచకప్ లో అభిషేక్ శర్మ 6 ఇన్నింగ్స్ ల్లో కలిపి 80 పరుగులు మాత్రమే చేశాడు.
వేటు వేస్తే
అభిషేక్ ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే ఇంగ్లాండ్ తో సెమీస్ లో అతణ్ని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇండియా టీమ్ అంత సాహసం చేయలేకపోవచ్చు. కానీ ఒకవేళ అభిషేక్ శర్మపై వేటు వేస్తే మాత్రం టీమ్ లో రింకు సింగ్ ను ఆడించాలని రవిశాస్త్రి సూచించాడు.
రవిశాస్త్రి కామెంట్లు
‘‘అభిషేక్ శర్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. టీమ్ మేనేజ్ మెంట్ రెడీగా ఉండాలి. ఒకవేళ అభిషేక్ మెంటల్ గా స్ట్రాంగ్ గా లేకపోతే, మైండ్ సెట్ దెబ్బతిని ఉంటే మాత్రమే అతణ్ని తప్పించాలి. నెట్స్‌లో అతను ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో చూసి అంచనా వేయాలి" అని ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు.
తప్పించాల్సి వస్తే
‘‘ఒకవేళ అభిషేక్ శర్మను జట్టు నుంచి తప్పించాల్సి వస్తే మాత్రం ఇషాన్ కిషన్ ను మళ్లీ ఓపెనర్ గా పంపించాలి. రింకు సింగ్ ను టీమ్ లోకి తీసుకోవాలి. లోయర్ ఆర్డర్ లో రింకును ఆడించాలి’’ అని రవిశాస్త్రి తెలిపాడు.
అతనే ఫేవరెట్
‘‘టీమ్ లో కొనసాగేందుకు ఇప్పటికీ అభిషేక్ శర్మ ఫేవరెట్ అని నమ్ముతా. అతణ్ని ఆడించాలనే కోరుకుంటా. ఎందుకంటే గతంలో ఇంగ్లాండ్ తో భారత్ ఆడినప్పుడు అభిషేక్ చెలరేగాడు. ఇంగ్లాండ్ పై అతనికి మంచి రికార్డు ఉంది. వాంఖడేలోనూ అతను గొప్పగా ఆడాడు. అక్కడ భారీ ఇన్నింగ్స్ లు నమోదు చేశాడు. అతని బ్యాటింగ్ లో పవర్ ఉంది’’ అని రవిశాస్త్రి వివరించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


