జపాన్‌తో మ్యాచ్.. పసికూన అని పిలవడానికి కూడా అర్హత లేని జట్టు.. టీమిండియా విశ్వరూపం చూపిస్తుందని, భారత బ్యాటర్ల దెబ్బకు జపాన్ బౌలర్లు అల్లాడిపోతారని భావించారంతా! కానీ మంగళవారం జపాన్‌లోని సనో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా తృటిలో ఓటమి నుంచి బయటపడింది! వర్షం కారణంగా 5ఓవర్లకు పరిమితమైన ఈ టీ20 మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మనం ఇచ్చిన 33 పరుగుల టార్గెట్‌ని ఛేజ్ చేసేసినట్టే కనిపించిన జపాన్ టీమ్.. చివరిలో తడబడటం వల్ల తృటిలో గెలుపునకు దూరమైంది. జపాన్ 30 పరుగుల వద్ద నిలిచిపోవడంతో టీమిండియా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
భారత బ్యాటర్లు విలవిల..

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది! 5 ఓవర్లలో మన జట్టు చేయగలిగింది 32 పరుగులే. అది కూడా 4 వికెట్లు కోల్పోయి!
ఈ స్కోరు చూసి భారత క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో మీమ్స్ అప్పుడే మొదలయ్యాయి.
ఇండియాలో అఫ్గానిస్థాన్‌తో ఇటీవలే జరిగిన టీ20 మ్యాచ్‌లో సెంచరీతో విరుచుకుపడ్డ అభిషేక్ శర్మ.. మొదటి బంతికే డకౌట్ అవ్వడం గమనార్హం. ఇక సంజూ శాంసన్ 7 బంతుల్లో 9 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ (3) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16*) ఆచితూచి ఆడటం కారణంగా టీమిండియా కనీసం 32 పరుగులైనా చేయగలిగింది. తిలక్ వర్మ 3 బంతులాడి 1 రన్ చేశాడు.
జపాన్ బౌలర్లలో చార్లీ హరహింజే 2 వికెట్లు, ఇబ్రహీం టకహాషి 1 వికెట్, బెంజమిన్ ఇటో డావిస్ 1 వికెట్ తీశారు.
భయపెట్టిన జపాన్ బ్యాటర్లు..
33 పరుగుల లక్ష్యంతో దిగిన జపాన్ జట్టు.. వరల్డ్ క్లాస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది. ఒకానొక సందర్భంలో జపాన్ జట్టు గెలిచేసినట్టే అనిపించి టీమిండియా అభిమానులు చేతులెత్తేశారు కూడా! ఓటమి అంచున ఉన్న టీమిండియాను బయటపడేసింది అక్షర్ పటేల్ వేసిన చివరి ఓవర్ అనే చెప్పాలి!
ఆ చివరి ఓవర్లో జపాన్ 8 పరుగులు చేయాల్సి ఉంది. కానీ అక్షర్ నిలకడగా, ఒత్తిడికి లోనవ్వకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు. ఫలితంగా చారిత్రక మ్యాచ్‌లో జపాన్ జట్టు చారిత్రక విజయం ముగింట నిలిచిపోయింది.
{{/usCountry}}ఆ చివరి ఓవర్లో జపాన్ 8 పరుగులు చేయాల్సి ఉంది. కానీ అక్షర్ నిలకడగా, ఒత్తిడికి లోనవ్వకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు. ఫలితంగా చారిత్రక మ్యాచ్‌లో జపాన్ జట్టు చారిత్రక విజయం ముగింట నిలిచిపోయింది.
{{/usCountry}}మొత్తం మీద 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశాడు.
జపాన్ ఓపెనర్ కెండెల్ (12) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాలని భావించాడు. కానీ ఫలితం దక్కలేదు. బెంజమిన్ 9 పరుగులు సాధించాడు. ఇబ్రహిం టకహాషి 4 రన్స్ చేశాడు.
జపాన్‌పై తాజా గెలుపుతో టీ20ల్లో 200 విన్స్ క్లబ్లో టీమిండియా చేరింది.
మరోవైపు జపాన్ లాంటి జట్టుపై కష్టపడి గెలిచిన టీమిండియాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. చాలా మంది షాక్ అవుతుండగా, అనేకమంది మీమ్స్ వేస్తున్నారు.
ఏదేమైనా.. జపాన్ చేతిలో ఓడిపోయి ఉంటే, టీమిండియా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించికోవడానికే భయంకరంగా ఉంది!