IND vs Pak : భారత్-పాక్ మ్యాచ్ సాధ్యమేనా? వరుణుడి ముప్పు తప్పదా? వాతావరణ నివేదిక ఇదీ..
క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ పోరుకు వర్షం గండం పొంచి ఉంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు ఆదివారం వర్షం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొలంబో వాతావరణ నివేదికను ఇక్కడ చూడండి..
క్రికెట్ మైదానంలో బ్యాట్, బాల్ మధ్య పోరు మొదలవ్వాల్సిన రోజున.. క్రీడకు పరమ శత్రువైన వర్షం తన ప్రతాపాన్ని చూపే అవకాశం కనిపిస్తోంది! కొలంబో నగరం అంతటా ఇప్పుడు అందరి కళ్లు ఆకాశం పైనే ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్న నేటి సాయంత్రం జరగనున్న భారత్-పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అడ్డుపడే అవకాశం ఉందన్న వార్తలు క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

భారత్ వర్సెస్ పాకిస్థాన్- వాతావరణ అంచనాలు ఎలా ఉన్నాయి?
శనివారం మధ్యాహ్నం ఐర్లాండ్, ఒమన్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసే సమయానికి కొలంబో ఆకాశం మేఘావృతమైంది. అప్పటి నుంచి నేటి మ్యాచ్‌పై ఆందోళన మొదలైంది. ‘అక్యూవెదర్’ అంచనాల ప్రకారం.. ఆదివారం నాడు.. రోజులో ఎక్కువ భాగం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
పగలు: ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. స్టేడియం డ్రైనేజీ వ్యవస్థ ఎంత బాగున్నా, పిచ్‌ను ఎక్కువ సమయం కవర్లతో కప్పి ఉంచాల్సి రావచ్చు.
మ్యాచ్ సమయం: ఉదయం నుంచి వర్షం పడే అవకాశం 60% కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు ( భారత్- పాక్ మ్యాచ్ ప్రారంభ సమయం) వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. అప్పటి నుంచి వర్షం పడే శాతం గణనీయంగా తగ్గుతుందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.
భారత్ వర్సెస్ పాకిస్థాన్- ఆశా కిరణం అదే..
క్రికెట్ ప్రేమికులకు ఒక శుభవార్త ఏంటంటే.. ప్రస్తుత వెదర్ రాడార్ల సమాచారం ప్రకారం.. హిందూ మహాసముద్రం నుంచి వస్తున్న వర్షపు మేఘాలు శ్రీలంక ద్వీప దక్షిణ తీరం గుండా వెళుతున్నాయి. పశ్చిమ తీరాన ఉన్న రాజధాని కొలంబో నగరాన్ని తాకకుండా ఇవి పక్కకు వెళ్లే అవకాశం ఉండటంతో మ్యాచ్‌కు ఆటంకం కలగకపోవచ్చని కూడా కొందరు భావిస్తున్నారు.
శ్రీలంకలో ఇప్పటివరకు జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లు ఆకాశం క్లియర్‌గా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో జరిగాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా, సల్మాన్ అలీ ఆఘా సేన తలపడనున్న ఈ మ్యాచ్ విషయంలోనూ అదే పునరావృతమవ్వాలని అందరు ప్రార్థిస్తున్నారు.
భారత్ వర్సెస్ పాకిస్థాన్- గ్రౌండ్ స్టాఫ్ సిద్ధం
భారత్ వర్సెస్ పాకిస్థాన్ సందర్భంగా ఒకవేళ వర్షం పడినా, ఆర్ ప్రేమదాస స్టేడియం గ్రౌండ్ సిబ్బందికి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో మంచి అనుభవం ఉంది. ఇక్కడి డ్రైనేజీ వ్యవస్థ కూడా అద్భుతంగా ఉంటుంది. వర్షం తగ్గిన కొద్ది సేపటికే మైదానాన్ని సిద్ధం చేయగల సామర్థ్యం వారికి ఉండటం మ్యాచ్ జరిగే అవకాశాలను పెంచుతోంది.
భారత్-పాక్ మధ్య పూర్తి స్థాయి మ్యాచ్ చూడాలని కోరుకుంటున్న అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదా తక్కువ ఓవర్లకు కుదించిన మ్యాచ్ జరుగుతోందో లేదా అసలు మ్యాచే జరగకుండా ఆగిపోతుందో.. తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే!
అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ లభించింది. అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పాక్‌తో తలపడేందుకు రెడీగా ఉన్న టీమిండియా జట్టులో చేరుతున్నట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించాడు. ఇది మన జట్టుకు సానుకూల విషయం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


