డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియాకు డూ ఆర్ డై మ్యాచ్. టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఇండియా ఈ రోజు జింబాబ్వేతో ఆడనుంది. టీ20 ప్రపంచకప్ సూపర్ 8 పోరులో గురువారం చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఓడితే టీమిండియా ఇంటి ముఖం పట్టాల్సిందే!
ఇండియా వర్సెస్ జింబాబ్బే

టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. టైటిల్ ఆశలు మిగలాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇవాళ జింబాబ్వేను ఢీ కొడుతుంది. ఈ సూపర్ 8 మ్యాచ్ లో కేవలం విక్టరీ మాత్రమే కాదు ఇండియా భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్, జియోహాట్ స్టార్ లో మ్యాచ్ లైవ్ చూడొచ్చు.
భారత్ పరిస్థితి ఇలా
భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్ లో ఇండియా అడుగుపెట్టింది. గ్రూప్ స్టేజీలో వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో గెలిచింది. గ్రూప్-ఎలో టాప్ ప్లేస్ తో సూపర్ 8లోకి అడుగుపెట్టింది. కానీ సూపర్ 8లో తొలి మ్యాచ్ లోనే దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయింది. దీంతో -3.800 రన్ రేట్ తో వెస్టిండీస్ (5.350), దక్షిణాఫ్రికా (3.800) తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది.
టీ20 ప్రపంచకప్ లో ఇండియా సెమీస్ ఆశలు నిలవాలంటే జింబాబ్వేపై కేవలం విక్టరీ సరిపోదు. భారీ తేడాతో గెలవాలి. అందుకోసం టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ లో చెలరేగాల్సి ఉంటుంది.
టీమ్ లో మార్పులు
జింబాబ్వేతో మ్యాచ్ కోసం ఇండియా తన ఫైనల్ ఎలెవన్ లో కొన్ని మార్పులు చేసే అవకాశముంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ తిరిగి రావడం ఖాయమే. ఇక స్పిన్ కు అనుకూలించే చెపాక్ పిచ్ పై మూడో స్పిన్నర్ గా కుల్ దీప్ ను ఆడించే ఛాన్స్ ఉంది.
{{/usCountry}}జింబాబ్వేతో మ్యాచ్ కోసం ఇండియా తన ఫైనల్ ఎలెవన్ లో కొన్ని మార్పులు చేసే అవకాశముంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ తిరిగి రావడం ఖాయమే. ఇక స్పిన్ కు అనుకూలించే చెపాక్ పిచ్ పై మూడో స్పిన్నర్ గా కుల్ దీప్ ను ఆడించే ఛాన్స్ ఉంది.
{{/usCountry}}మరోవైపు తండ్రి అనారోగ్యం కారణంతో ఇంటికి వెళ్లిన రింకు సింగ్ ఈ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశముంది. ఒకవేళ అతను తిరిగి టీమ్ లోకి వస్తే తిలక్ వర్మను తప్పించి సంజు శాంసన్ ను టాప్ లో ఆడించే సంకేతాలు కనిపిస్తున్నాయి.
జింబాబ్వేతో జాగ్రత్త
టీమిండియాతో పోలిస్తే జింబాబ్వే పసికూననే. కానీ ఆ టీమ్ తో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజీలో మాజీ ఛాంపియన్లు ఆస్ట్రేలియా, శ్రీలంకకు జింబాబ్వే షాక్ ఇచ్చింది. అందుకే ఓవర్ కాన్ఫిడెంట్ కు పోకుండా 100 శాతం ఆటతీరుతో భారీ విజయం సాధించాల్సిన అవసరం భారత్ కు ఉంది.