Team India Record: అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటంతో టీమిండియా భారీ స్కోరు సాధించడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ప్రపంచ రికార్డును సమం చేసింది.
చెలరేగిన ఇండియా

ఇవాళ (జూలై 25) జింబాబ్వేతో రెండో టీ20లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 81), తిలక్ వర్మ (29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 నాటౌట్) చెలరేగారు. దీంతో ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది.
ప్రపంచ రికార్డు
జింబాబ్వేపై బ్యాటింగ్ లో అదరగొట్టిన భారత్ ప్రపంచ రికార్డు సమం చేసింది. ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
జింబాబ్వే బౌలర్లను ఆడుకుంటూ భారత బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. టీమిండియా మైదానంలో పరుగుల వరద పారించడంతో 200 పరుగుల మార్కును సులువుగా దాటేసింది. ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో భారత జట్టు 200 ప్లస్ స్కోరును నమోదు చేయడం ఇది 9వ సారి కావడం విశేషం.
ఇండియా హిస్టరీ
ఒక ఏడాదిలో టీ20ల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోరు చేసిన రికార్డు ఇండియా పేరు మీదే ఉంది. 2024లో భారత్ 9 సార్లు ఈ ఘనత సాధించింది. ఈ ఇయర్ లో ఇప్పటికే 9 సార్లు 200 ప్లస్ స్కోరు చేసి ప్రపంచ రికార్డు సమం చేసింది. ఈ ఏడాది టీమిండియా తన రికార్డును తానే బ్రేక్ చేసుకునే అవకాశం ఉంది. మూడో ప్లేస్ లోనూ భారత్ (7 సార్లు) ఉంది. జపాన్, ఆస్ట్రియా కూడా 7 సార్లు ఈ ఫీట్ సాధించాయి.
ఓవరాల్ టి20ల్లో అగ్రస్థానం
{{/usCountry}}ఒక ఏడాదిలో టీ20ల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోరు చేసిన రికార్డు ఇండియా పేరు మీదే ఉంది. 2024లో భారత్ 9 సార్లు ఈ ఘనత సాధించింది. ఈ ఇయర్ లో ఇప్పటికే 9 సార్లు 200 ప్లస్ స్కోరు చేసి ప్రపంచ రికార్డు సమం చేసింది. ఈ ఏడాది టీమిండియా తన రికార్డును తానే బ్రేక్ చేసుకునే అవకాశం ఉంది. మూడో ప్లేస్ లోనూ భారత్ (7 సార్లు) ఉంది. జపాన్, ఆస్ట్రియా కూడా 7 సార్లు ఈ ఫీట్ సాధించాయి.
ఓవరాల్ టి20ల్లో అగ్రస్థానం
{{/usCountry}}కేవలం అంతర్జాతీయ టి20ల్లోనే కాకుండా, ఓవరాల్ టి20 క్రికెట్ (ఐపీఎల్, ఇతర లీగ్ మ్యాచ్‌లతో కలిపి) చరిత్రను పరిశీలిస్తే, అత్యధిక సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు సాధించిన జట్టు ఇండియానే.
భారత్ ఇప్పటివరకూ ఓవరాల్ గా ఇంటర్నేషనల్ టీ20ల్లో 52 సార్లు 200కు పైగా స్కోరు చేసింది. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా (29)కు ఇండియాకు మధ్య చాలా గ్యాప్ ఉంది.