Asia Cup 2026: ఆసియాకప్ ఫైనల్లో హైడ్రామా-పాకిస్థానీ మోసిన్ నఖ్వీకి దిమ్మతిరిగే షాకిచ్చిన భారత అమ్మాయిలు-రియల్ ఛాంపియన్స్
Asia Cup 2026: ఇండియన్ విమెన్ టీమ్ అదరగొట్టింది. అటు మైదానంలో ఆటతో, బయట తమ దేశభక్తితో అమ్మాయిలు సత్తాచాటారు. మహిళల ఆసియా కప్ 2026లో భారత్ విజేతగా నిలిచింది. కానీ ఆ తర్వాత పాకిస్థానీ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి మన అమ్మాయిలు నిరాకరించారు.
Asia Cup 2026: టీమిండియా అదుర్స్ అనిపించింది. భారత అమ్మాయిల జట్టు మరోసారి సత్తాచాటింది. రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ఆసియా కప్ లో ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసింది. అయితే ఫైనల్ ముగిసిన తర్వాత మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది.

ఇండియా విక్టరీ
ఆసియా కప్ 2026 ఫైనల్ పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు ఏకంగా 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు.
స్మృతి మంధాన 59 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 183/5 పరుగుల భారీ స్కోరు సాధించింది.
బౌలర్లు అదుర్స్
184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు కట్టడి చేశారు. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టును దీప్తి శర్మ అవుట్ చేయడంతో లంక కోలుకోలేకపోయింది. దీప్తి శర్మ (3/19), శ్రీ చరణి (4/20) ధాటికి శ్రీలంక 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది.
వేదికపై నఖ్వీ
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సెర్మనీ దాదాపు 50 నిమిషాల పాటు ఆలస్యమైంది. ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ స్టేజ్ పైకి వచ్చాడు. పాకిస్థాన్ కు చెందిన అతని నుంచి ట్రోఫీ తీసుకోవడానికి భారత అమ్మాయిల జట్టు నిరాకరించింది.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలతో చర్చల అనంతరం జట్టు ఈ నిర్ణయం తీసుకుంది.
స్టేజీపై వెయిటింగ్
ఇండియన్ టీమ్ కోసం ట్రోఫీతో మోసిన్ నఖ్వీ పిచ్చోడిలా వెయిట్ చేశాడనే కామెంట్లు వస్తున్నాయి. చివరకు అతను శ్రీలంక జట్టుకు రన్నరప్ మెడల్స్ ఇచ్చి వెళ్లిపోయాడు. అటు పక్కన గ్రౌండ్ లోనే భారత్ తమ జట్టులోని ఆటగాళ్లకు ప్రత్యేకంగా ఫీల్డింగ్ మెడల్స్ ప్రదానం చేసుకుంది.
ఆసియా ఛాంపియన్స్
ఈ ఘటనపై మీడియా సమావేశంలో స్పందించిన భారత హెడ్ కోచ్ అమూల్ మజుందార్.. "ఇది బీసీసీఐ తీసుకున్న అధికారిక నిర్ణయం. మేమంతా దానికి కట్టుబడి ఉన్నాం. మాకు టోర్నమెంట్ పూర్తయింది, మేమే ఆసియా ఛాంపియన్స్. బోర్డులో భారత్ ఆసియా కప్ 2026 విజేత అని స్పష్టంగా ఉంది. ఇప్పుడు మా దృష్టి ఆసియా క్రీడలపై ఉంది" అని స్పష్టం చేశారు.
అప్పుడు మెన్స్ టీమ్
ఏప్రిల్ 2025 పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తదనంతర మిలిటరీ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్, భారత్ మధ్య టెన్షన్ నెలకొంది. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత పురుషుల జట్టు కూడా నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి నో చెప్పింది. పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మహిళల జట్టు కూడా అదే ఫాలో అయింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


