Ind W vs Pak W: టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియన్ విమెన్ టీమ్ కు అదిరిపోయే స్టార్ట్ దక్కింది. టోర్నీలో తమ ఫస్ట్ మ్యాచ్ లోనే భారత అమ్మాయిలు చెలరేగారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ పోరును వన్ సైడ్ చేసేశారు. ఆదివారం (జూన్ 14) రాత్రి జరిగిన మ్యాచ్ లో 64 రన్స్ తో గెలిచారు.
టీమిండియా అదుర్స్

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే హైప్ వేరే లెవల్. ఈ మెగా పోరులో మరోసారి ఇండియాదే డామినెన్స్. టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-1 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాక్ పై భారత్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 రన్స్ చేసింది. ఛేజింగ్ లో పాక్ ను 106 రన్స్ కే కుప్పకూల్చింది భారత్.
ఎందుకంత ఇంపార్టెంట్?
టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై సాధించిన ఈ విక్టరీ ఇండియాకు చాలా ముఖ్యమైంది. కేవలం పాక్ ను చిత్తు చేశామనే కాదు.. ఇతర అంశాల్లోనూ ఇండియాకు ఈ మ్యాచ్ మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ విషయాలు ఏంటో చూద్దాం.
స్మృతి మంధాన ఫామ్
విమెన్ టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఈ ఓపెనర్ ఫామ్ లో ఉంటే ఎంతటి విధ్వంసం చేస్తుందో మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఇంగ్లాండ్ తో సిరీస్ లో మంధాన ఫెయిల్ అయింది. దీంతో టీ20 ప్రపంచకప్ లో మంధాన ఎలా ఆడుతుందోననే డౌట్లు వచ్చాయి. అయితే పాక్ తో మ్యాచ్ లో 44 బాల్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 రన్స్ కొట్టిన మంధాన మళ్లీ ఫామ్ అందుకుంది.
ఫినిషర్ రోల్
టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్ ను ఎంత గొప్పగా స్టార్ట్ చేస్తారో, అంతే గొప్పగా ఫినిష్ చేయడం చాలా ఇంపార్టెంట్. పాకిస్థాన్ తో మ్యాచ్ లో రిచా ఘోష్ ఫినిషర్ రోల్ ను పర్ఫెక్ట్ గా ప్లే చేసింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కేవలం 17 బాల్స్ లోనే 34 రన్స్ కొట్టింది. ఇందులో 5 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి.
స్పిన్ బలం
{{/usCountry}}టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్ ను ఎంత గొప్పగా స్టార్ట్ చేస్తారో, అంతే గొప్పగా ఫినిష్ చేయడం చాలా ఇంపార్టెంట్. పాకిస్థాన్ తో మ్యాచ్ లో రిచా ఘోష్ ఫినిషర్ రోల్ ను పర్ఫెక్ట్ గా ప్లే చేసింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కేవలం 17 బాల్స్ లోనే 34 రన్స్ కొట్టింది. ఇందులో 5 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి.
స్పిన్ బలం
{{/usCountry}}బౌలింగ్ లోనూ టీమిండియా అదరగొట్టింది. ముఖ్యంగా మరోసారి మన స్పిన్ బలం డామినేట్ చేసింది. ఇంగ్లాండ్ లోని కండీషన్లలో పేసర్ల ఆధిపత్యం ఉంటుంది. కానీ ఇండియా స్పిన్నర్లు అక్కడా సత్తాచాటడం విశేషం. దీప్తి శర్మ 5 వికెట్లతో అదరగొట్టగా.. మన తెలుగమ్మాయి శ్రీ చరణి 3 వికెట్లతో సత్తాచాటింది.
గ్రాండ్ స్టార్ట్
పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే టీమ్ పై ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఈ మ్యాచ్ పై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుంటారు. మ్యాచ్ రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా కోట్లాది ప్రజల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లో భారత జట్టు అదరగొట్టింది.
ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయి ఉంటే భారత టీమ్ కు మానసిక స్థైర్యమూ దెబ్బతినే ప్రమాదం ఉండేది. పైగా ఇది టోర్నీలో భారత్ కు ఫస్ట్ మ్యాచ్. ఇలాంటి సినారియో ప్రకారం చూస్తే టీమిండియా ఈ విక్టరీతో తన కాన్ఫిడెన్స్ ను ఇంకా బిల్డ్ చేసుకుందని చెప్పొచ్చు.