ప్రతిష్టాత్మక ఇండియన్ ఆర్మీ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (ఐఏఐపీ) 2025 కోసం అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది భారత సైన్యం. ఇది అత్యంత తీవ్రత, సాంకేతికతతో కూడిన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. అత్యాధునిక డిజిటల్ డొమైన్‌లలో పనిచేసే ఇంజినీరింగ్, పరిశోధన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ ఇంటర్న్షిప్ని రూపొందించారు.

"బియాండ్ సిలోస్, బియాండ్ లిమిట్స్" అనే పేరుతో రూపొందించిన ఈ ప్రోగ్రామ్ కింద ఎంపికైన ఇంటర్న్‌లకు రోజుకు రూ. 1,000 స్టైఫండ్‌తో పాటు రక్షణ సాంకేతికతకు సంబంధించిన ప్రత్యక్ష ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది.
ఇండియన్ ఆర్మీలో ఇంటర్న్‌షిప్- ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల తుది గడువు: డిసెంబర్ 21, 2025.
ఈ ఇంటర్న్‌షిప్ మొత్తం- 75 రోజులు ఉంటుంది.
ప్రారంభం: జనవరి 12, 2026
ముగింపు: మార్చి 27, 2026
పోస్టింగ్ స్థలాలు: దిల్లీ లేదా బెంగళూరు.
ఎంపికైన అభ్యర్థులు సెక్యూర్, మిషన్-క్రిటికల్ అప్లికేషన్‌లపై సైనిక బృందాలతో కలిసి పనిచేస్తారు. యువ సాంకేతిక నిపుణులను నేరుగా డిఫెన్స్ఈకో సిస్టెమ్లోకి తీసుకురావడానికి ఈ ఇంటర్న్షిప్ని రూపొందించారు.
ఇండియన్ ఆర్మీలో ఇంటర్న్‌షిప్- వివరాలు..
ఐఏఐపీ 2025 ప్రధానంగా రక్షణ అవసరాల కోసం అత్యాధునిక సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్‌ను రూపొందించడంపై దృష్టి సారిస్తుంది. ఇంటర్న్‌లు కింది వాటిలో పాలుపంచుకుంటారు:
హై-ఎండ్ సాఫ్ట్‌వేర్, ఏఐ మోడల్స్‌ను అభివృద్ధి చేయడం.
ప్రత్యక్ష రక్షణ, సెక్యూర్డ్ మిలటరీ-గ్రేడ్ అప్లికేషన్‌లపై పనిచేయడం.
క్లాసిఫైడ్, సురక్షిత వాతావరణంలో హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియెన్స్‌ని పొందడం.
భారత సైన్యం ఉపయోగించే నెక్ట్స్ జెన్ టెక్నాలజీస్‌కి దోహదపడటం.
ఇండియన్ ఆర్మీలో ఇంటర్న్‌షిప్- ముఖ్యమైన సాంకేతికతలు..
{{/usCountry}}భారత సైన్యం ఉపయోగించే నెక్ట్స్ జెన్ టెక్నాలజీస్‌కి దోహదపడటం.
ఇండియన్ ఆర్మీలో ఇంటర్న్‌షిప్- ముఖ్యమైన సాంకేతికతలు..
{{/usCountry}}ఇంటర్న్‌లు విస్తృత శ్రేణి టెక్నాలజీ స్టాక్‌పై పనిచేస్తారు. వాటిలో కొన్ని:
ఫ్రంట్‌ఎండ్- HTML5, CSS3, JavaScript, TypeScript, Dart, Svelte, ELM
బ్యాక్‌ఎండ్- Python, Java, C#, Node.js, PHP, Ruby, Rust, Scala, PL/SQL
ఫ్రేమ్‌వర్క్స్- React, Angular, Next.js, Django, Express.js, Flutter, Laravel
ఏఐ అండ్ ఎంఎల్- Data Analytics, Autonomous Systems, LLMs, VLMs, Agentic AI, SLMs
క్లౌడ్ & నెట్‌వర్క్స్- Secure Cloud Computing, Edge Computing, IoT
DevSecOps- CI/CD pipelines, Docker, Kubernetes
జీఐఎస్- ArcGIS, QGIS, Spatial Analysis, Geoprocessing
ఏపీఐలు- REST APIs, HTTP methods, JSON, XML formats
ఇండియన్ ఆర్మీలో ఇంటర్న్‌షిప్- అర్హత ప్రమాణాలు..
BE/BTech (కంప్యూటర్ సైన్స్, ఐటీ, డేటా సైన్స్, ఈసీఈ): ఫైనల్-ఇయర్ విద్యార్థులు లేదా గ్రాడ్యుయేట్లు.
ఎంటెక్ (ఏఐ ఆండ్ ఎంఎల్, డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్): చదువుతున్న లేదా పూర్తి చేసిన అభ్యర్థులు.
పీహెచ్డీ స్కాలర్‌లు: ఏఐ అండ్ ఎంఎల్, DevSecOps, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ లేదా బిగ్ డేటాలో పనిచేస్తున్నవారు.
దరఖాస్తుదారులు iaip2025.dgis@gmail.com కు ఇమెయిల్ ద్వారా ఇతర వివరాలు తెలుసుకునేందుకు సంప్రదించవచ్చు.
ముఖ్య గమనిక: ఎంపిక ప్రక్రియ అకాడమిక్ నేపథ్యం, సాంకేతిక నైపుణ్యాలు, ప్రాజెక్ట్ రెలవెన్స్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి, ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.