Bank Job : నెలకు రూ. లక్ష జీతంతో బ్యాంకు జాబ్- అప్లికేషన్​కి ఇంకొన్ని రోజులే ఛాన్స్..

Bank jobs in Hyderabad : బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అప్డేట్! ఇండియన్ బ్యాంక్​ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​లో భాగంగా నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. పోస్టులు, ఖాళీలు, వేతనాలు, అప్లికేషన్ ప్రక్రియను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Apr 22, 2026, 09:08:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bank job alerts : నిరుద్యోగులు, బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కీలక అప్డేట్! ఇండియన్ బ్యాంక్​ చేపట్టిన రిక్రూట్​మెంట్​కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ముగియనుంది. ఈ దఫా రిక్రూట్​మెంట్​లో 350 ఎస్​ఓ (స్పెషలిస్ట్​ ఆఫీసర్) పోస్టులను భర్తీ చేయనుంది ఈ ప్రభుత్వ రంగ సంస్థ. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఇండియన్ బ్యాంక్ రిక్రూట్​మెంట్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియన్ బ్యాంక్​ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్..
ఇండియన్ బ్యాంక్​ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్..

ఇండియన్ బ్యాంక్​ రిక్రూట్​మెంట్​ 2026- ముఖ్యమైన తేదీలు..

  • నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 8, 2026
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 8, 2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2026

రాత పరీక్ష/ఇంటర్వ్యూ తేదీని బ్యాంకు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే అప్డేట్​ వచ్చే అవకాశం ఉంది.

ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2026- రిజిస్ట్రేషన్ ఇలా..

స్టెప్​ 1- ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (indianbank.in)కి వెళ్లండి.

స్టెప్​ 2- 'Careers' లేదా 'Recruitment' సెక్షన్‌లోకి వెళ్లండి.

స్టెప్​ 3- 'Indian Bank SO Recruitment 2026' లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 4- మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్​ నెంబర్​తో రిజిస్టర్ చేసుకోండి.

స్టెప్​ 5- దరఖాస్తు ఫారమ్‌లో వివరాలను నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

స్టెప్​ 6- ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.

ఇండియన్ బ్యాంక్​ రిక్రూట్​మెంట్​ 2026- పోస్టులు..

ఈ 350 పోస్టుల్లో..

చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ).

సీనియర్ మేనేజర్: రిస్క్, ఫారెక్స్, ఫైనాన్స్.

డేటా అనలిస్ట్ అండ్ ఐటీ స్పెషలిస్ట్.

మేనేజర్: క్రెడిట్, ఫైనాన్స్, ఐటీ.

అసిస్టెంట్ మేనేజర్: సెక్యూరిటీ, సివిల్, ఆర్కిటెక్ట్

హెచ్​ఆర్, మార్కెటింగ్ మేనేజర్.

ఇండియన్ బ్యాంక్​ రిక్రూట్​మెంట్​ 2026- విద్యార్హత..

ఎంబీఏ / పీజీడీఎం (ఫైనాన్స్​/ మార్కెటింగ్ / హెచ్​ఆర్).

బీఈ / బీటెక్ / ఎంసీఏ / ఎంఎస్​సీ (ఐటీ/సీఎస్).

సీఏ / సీఎఫ్​ఏ / ఐసీడబ్ల్యూఏ.

వీటితో పాటు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి!

ఇండియన్ బ్యాంక్​ రిక్రూట్​మెంట్​ 2026- రిక్రూట్​మెంట్ ప్రాసెస్​ ఇలా..

అప్లికేషన్​ మెరిట్​ బట్టి ఇంటర్వ్యూకి పిలుస్తామని ప్రభుత్వ ఆధారిత సంస్థ వెల్లడించింది. కాగా, ఒక వేళ అప్లికేషన్లు ఎక్కువగా ఉంటా రాతపరీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉందని తెలియజేసింది.

ఇండియన్ బ్యాంక్​ రిక్రూట్​మెంట్​ 2026- నెలవారీ వేతనం..

ఈ ఇండియన్ బ్యాంక్​ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026లో ఎంపికైన వారికి నెలవారీ జీతాలు ఈ విధంగా ఉంటాయి.

స్కేల్​ 1- రూ. 48,480 – రూ. 85,920

స్కేల్​ 2- రూ. 64,820 – రూ. 93,960

స్కేల 3- రూ. 85,920 – రూ. 1,05,280

ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2026- రిజిస్ట్రేషన్ ఫీజు..

ఈ దఫా ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2026 కోసం..

ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ: రూ. 175

జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్: రూ. 850

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్​ని చూడాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More