...
...
Next Story

గుడ్ న్యూస్: హార్ముజ్ జలసంధి దాటిన భారత గ్యాస్ నౌకలు.. సిలిండర్ల కొరత లేదన్న కేంద్రం

పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్‌కు భారీ ఊరట లభించింది. సుమారు 92,700 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో వస్తున్న రెండు భారతీయ నౌకలు అత్యంత ప్రమాదకరమైన హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి.

Published on: Mar 14, 2026, 17:59:59 IST
Advertisement

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ సరఫరాపై నెలకొన్న ఆందోళనలకు తెరపడింది. భారత్‌కు చెందిన రెండు భారీ ఎల్పీజీ (LPG) నౌకలు 'శివాలిక్', 'నందాదేవి' శనివారం ఉదయం హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

వచ్చే వారమే పోర్టులకు చేరిక

గుడ్ న్యూస్: హార్ముజ్ జలసంధి దాటిన భారత గ్యాస్ నౌకలు.. సిలిండర్ల కొరత లేదన్న కేంద్రం (File Photo/REUTERS)
గుడ్ న్యూస్: హార్ముజ్ జలసంధి దాటిన భారత గ్యాస్ నౌకలు.. సిలిండర్ల కొరత లేదన్న కేంద్రం (File Photo/REUTERS)

కేంద్ర నౌకాయాన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రెండు నౌకలు సుమారు 92,700 మెట్రిక్ టన్నుల వంటగ్యాస్‌ను మోసుకొస్తున్నాయి.

  • శివాలిక్: మార్చి 16న ముంద్రా పోర్టుకు చేరుకోనుంది.
  • నందాదేవి: మార్చి 17న కాండ్లా పోర్టుకు చేరుకోనుంది.

ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మరో 22 భారతీయ నౌకలు ఉన్నాయని, అందులోని 611 మంది భారతీయ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ఆయన భరోసా ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని స్పష్టం చేశారు.

కంగారు పడి బుకింగ్‌లు చేయకండి

దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు అనవసరంగా కంగారు పడి (Panic Booking) గ్యాస్ సిలిండర్లను లేదా పెట్రోల్‌ను నిల్వ చేయవద్దని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు.

"కమర్షియల్ గ్యాస్ వినియోగదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కోటాను కేటాయించాం. ఇప్పటికే 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పంపిణీ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆన్‌లైన్ బుకింగ్‌లు 84 శాతంగా ఉన్నాయి, దీనిని 100 శాతానికి చేర్చడమే మా లక్ష్యం" అని ఆమె వివరించారు.

సేఫ్టీ ఫస్ట్.. నిల్వ వద్దు

1. హార్ముజ్ జలసంధి దాటిన నౌకల పేర్లు ఏమిటి?

భారత జెండాతో ఉన్న 'శివాలిక్', 'నందాదేవి' అనే రెండు ఎల్పీజీ నౌకలు సురక్షితంగా జలసంధిని దాటాయి.

2. ఈ నౌకలు ఎప్పుడు భారత్‌కు చేరుకుంటాయి?

ఇవి మార్చి 16, 17 తేదీల్లో ముంద్రా, కాండ్లా పోర్టులకు చేరుకోనున్నాయి. వీటి ద్వారా సుమారు 92,700 మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి వస్తుంది.

3. గ్యాస్ సిలిండర్ల కొరత ఉందా?

లేదు. కేంద్ర ప్రభుత్వం ఇంధన నిల్వలు, గ్యాస్ సరఫరా స్థిరంగా ఉందని స్పష్టం చేసింది. ప్రజలు అనవసరంగా ముందస్తు బుకింగ్‌లు చేయాల్సిన అవసరం లేదు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe