భారత నౌకాదళంలో చేరి దేశ రక్షణలో తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తున్న యువతకు ముఖ్యమైన అలర్ట్! ఇండియన్ నేవీలో అగ్నివీర్ పథకం కింద అగ్నివీర్ ఎస్ఎస్ఆర్, ఎంఆర్, మెడికల్ సెయిలర్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు చేపట్టిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026 వివరాలు..

రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చ్ 14, 2026
రిజిస్ట్రేషన్‌కి చివరి తేదీ: ఏప్రిల్ 6, 2026
కరెక్షన్ విండో : ఏప్రిల్ 10, 11 తేదీల్లో అవకాశం ఉంటుంది.
పరీక్ష తేదీ : మే 2026 (తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.)
ఫలితాల విడుదల: జూన్ 2026
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- పోస్టుల వారీగా ఎలిజిబులిటీ..
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్లో భాగంగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ (మెడికల్): ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (పీసీబీ) సబ్జెక్టుల్లో చదువుకుని ఉండాలి.
అగ్నివీర్ ఎంఆర్ : 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ : ఇంటర్మీడియట్ (12వ తరగతి)లో గణితం, భౌతికశాస్త్రం ఎంచుకుని ఉండాలి. లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
గమనిక: వయోపరిమితి ఒక్కో పోస్టుకు భిన్నంగా ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది.
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- సెలక్షన్ ప్రాసెస్..
నౌకాదళంలో ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకమైన, కఠినమైన దశల్లో జరుగుతుంది.
లెవల్-1 (ఐఎన్ఈటీ): కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
{{/usCountry}}లెవల్-1 (ఐఎన్ఈటీ): కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
{{/usCountry}}షార్ట్‌లిస్టింగ్: రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారిని మాత్రమే నెక్ట్స్ లెవల్‌కి ఎంపిక చేస్తారు.
లెవల్-2 (పీఎఫ్‌టీ): శారీరక సామర్థ్య పరీక్షలు. ఇందులో రన్నింగ్, స్క్వాట్స్, పుష్-అప్స్, సిట్-అప్స్ వంటివి ఉంటాయి.
లెవల్ 3- రాత పరీక్ష అండ్ వైద్య పరీక్ష: ఫిజికల్ టెస్ట్ అనంతరం మరో రాత పరీక్ష, సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
వీటిని దాటుకుని ఎంపికైన వారికి తుది మెరిట్ జాబితాలో నిలిచిన వారికి ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ఇస్తారు.
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
స్టెప్ 1- ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
స్టెప్ 2- అప్లై ఆన్‌లైన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి
స్టెప్ 4- అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి.
స్టెప్ 5- అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి.
స్టెప్ 6- అప్లికేషన్ ఫీజును చెల్లించండి
స్టెప్ 7- సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
పరీక్ష ఫీజు: రూ. 550 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
పురుషులు, మహిళా అభ్యర్థులు ఇద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026- జీతాలు..
మొదటి ఏడాది : జీతం- రూ. 30వేలు, టేక్ హోమ్- రూ. 21వేలు
రెండో ఏడాది : జీతం- రూ. 33వేలు, టేక్ హోమ్- రూ. 33,100
మూడో ఏడాది : జీతం- రూ. 36,500, టేక్ హోమ్- రూ. 25,550
నాలుగో ఏడాది : జీతం- రూ. 40,000, టేక్ హోమ్- రూ. 28,000
చివరి నిమిషంలో హడావుడి పడకుండా ఉండేందుకు, ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.