దలాల్ స్ట్రీట్‌లో బుధవారం భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పరిణామాలు భారతీయ ఈక్విటీ మార్కెట్లను పతనంలోకి నెట్టాయి. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కీలక సూచీలు అర శాతానికి పైగా క్షీణించి ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికి సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 2 శాతానికిపైగా నష్టపోయాయి.

ట్రేడింగ్ ఆరంభం నుంచి నిఫ్టీ, సెన్సెక్స్ పతనమవుతూ వచ్చాయి. మధ్యాహ్నం 2.15 గంటలకు నిఫ్టీ 50 సూచీ 500 పాయింట్లు క్షీణించి 23,897 వద్ద ట్రేడవుతోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 77,816 వద్ద గ్యాప్-డౌన్‌తో మొదలై, మధ్యాహ్నం 2.15 సమయానికి 1663 పాయింట్లు నష్టపోయి 76,516 వద్ద ట్రేడవుతోంది.
మార్కెట్ పతనానికి 5 ప్రధాన కారణాలు
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, దలాల్ స్ట్రీట్‌ను కుదిపేస్తున్న టాప్ 5 కారణాలు ఇవే:
1. అమెరికా - ఇరాన్ యుద్ధ వాతావరణం మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళనలను రేకెత్తించింది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లతో పాటు భారత మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి.
2. ఎగబాకుతున్న ముడిచమురు ధరలు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశానికి చమురు ధరల పెరుగుదల పెద్ద ప్రతికూలాంశం. దీనివల్ల దేశ దిగుమతి బిల్లు పెరిగి, ద్రవ్యోల్బణం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
"అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం, బ్రెంట్ క్రూడ్ ధర 76 డాలర్లకు చేరడంతో మార్కెట్ మళ్లీ అనిశ్చితిలోకి వెళ్లింది. విదేశీ నిధుల రాక, సానుకూల స్థూల ఆర్థికాంశాలతో మార్కెట్ పుంజుకుంటున్న తరుణంలో ఈ తాజా సంక్షోభం బ్రేకులు వేసింది," అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్‌కుమార్ విశ్లేషించారు.
3. బలహీనమైన క్యూ1 ఫలితాల అంచనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (Q1FY27) మొదటి త్రైమాసిక కార్పొరేట్ ఆదాయాలు బలహీనంగా ఉండవచ్చనే అంచనాలు మార్కెట్‌ను నష్టాల్లోకి నెట్టాయి.
{{/usCountry}}3. బలహీనమైన క్యూ1 ఫలితాల అంచనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (Q1FY27) మొదటి త్రైమాసిక కార్పొరేట్ ఆదాయాలు బలహీనంగా ఉండవచ్చనే అంచనాలు మార్కెట్‌ను నష్టాల్లోకి నెట్టాయి.
{{/usCountry}}"మధ్యప్రాచ్య సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది, దీని నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. అందుకే రాబోయే క్యూ1 ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని భావించి ఇన్వెస్టర్లు పైస్థాయిల్లో విక్రయాలకు మొగ్గు చూపుతున్నారు," అని సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అవినాష్ గోరక్షకర్ అభిప్రాయపడ్డారు.
4. ఎఫ్‌ఐఐల నిరంతర విక్రయాలు అంతర్జాతీయంగా రిస్క్ పెరగడం, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి (INR) బలహీనపడటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) భారత ఈక్విటీ మార్కెట్లలో నిరంతరం షేర్లను విక్రయిస్తున్నారు. ఇది కూడా సూచీలు పైస్థాయిల్లో నిలదొక్కుకోలేకపోవడానికి కారణమైంది.
5. పెరిగిన ఇండియా విక్స్ (India VIX) మార్కెట్లో అనిశ్చితి ఒక్కసారిగా పెరగడంతో భయాందోళనలను సూచించే 'ఇండియా విక్స్' (India VIX) బుధవారం 5 శాతానికి పైగా ఎగబాకింది. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ప్రాఫిట్ బుకింగ్ (లాభాల స్వీకరణ)కు దిగారు.
భారీగా నష్టపోయిన స్టాక్స్
ఇండిగో 4.53 శాతం, మారుతీ 3.59 శాతం నష్టపోయాయి. హిందుస్తాన్ యూనీలివర్ 2.90 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.80 శాతం నష్టపోయాయి. అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీఈఎల్, ఎం అండ్ ఎం, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, రిలయన్స్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ తదితర స్టాక్స్ అన్నీ 2 శాతానికి పైగా నష్టపోయాయి.