Ind Vs Pak: పాకిస్థాన్‌పై గ్రాండ్ విక్టరీ.. ఇండియన్ ప్లేయర్స్ మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గ్రాండ్ విక్టరీతో ఇండియన్ టీమ్ దేశంలో సంబరాలు తెచ్చింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో భారత ఆటగాళ్ల మధ్య గొడవతో టెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచకప్ లో భారత్ చెలరేగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసింది. ఆదివారం (ఫిబ్రవరి 15) రాత్రి ముగిసిన ఈ మ్యాచ్ తో ఇండియాలో సంబరాలు మిన్నంటాయి. కానీ మ్యాచ్ కంప్లీట్ కాగానే అక్కడే గ్రౌండ్ లో భారత ఆటగాళ్ల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. మన ప్లేయర్ల మధ్య చిన్న గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.

హార్దిక్ వర్సెస్ కుల్‌దీప్
హార్దిక్ పాండ్య తన బౌలింగ్ లో ఉస్మాన్ తారిఖ్ ను బౌల్డ్ చేసి పాకిస్థాన్ ఇన్నింగ్స్ కు ఎండ్ కార్డు వేశాడు. ఆ తర్వాత ఇండియన్ ప్లేయర్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ తో హార్దిక్ పాండ్య చిన్నగా గొడవ పడ్టట్లు తెలిసింది. వీళ్ల దగ్గరకు వెళ్లిన తిలక్ వర్మ ఆందోళనతో కనిపించాడు. రింకు సింగ్ వెంటనే జోక్యం చేసుకుని ఆటగాళ్లను కూల్ చేసేందుకు ట్రై చేశాడు.
సూర్యకుమార్ కూడా
ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా కుల్‌దీప్ పై గుర్రుగా ఉన్నట్లు కనిపించింది. కుల్‌దీప్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత అతని వైపు సూర్య కోపం చూడటం వీడియోలో ఉంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
రీజన్ ఇదే
అయితే కుల్‌దీప్ యాదవ్ పై హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ కోప్పడటానికి ఓ కారణం ఉంది. పాకిస్థాన్ ఛేజింగ్ లో హార్దిక్ పాండ్య 18వ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్లో షహీన్ షా అఫ్రిది ఇచ్చిన ఓ సింపుల్ క్యాచ్ ను బౌండరీ లైన్ దగ్గర కుల్‌దీప్ వదిలేశాడు. క్యాచ్ పట్టేందుకు సెటిల్ అయిన కుల్‌దీప్ చేతుల్లో నుంచి బాల్ జారి వెళ్లి బౌండరీ లైన్ పడింది. దీంతో సిక్సర్ వచ్చింది. అప్పుడే హార్దిక్ హిందీలో కుల్‌దీప్‌ను ఏవో మాటలన్నాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత కుల్‌దీప్‌తో సీరియస్ గా హార్దిక్ పాండ్య మాట్లాడాడు. ఆవేశంతో ఏవో చేతి సైగలు కూడా చేశాడు. సూర్యకుమార్ కూడా కోపంతో చూశాడు.
సూపర్ 8
టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ భారత్ గెలిచింది. అమెరికా, నమీబియా, పాకిస్థాన్ లను ఓడించింది. హ్యాట్రిక్ విజయాలతో ఇండియా టీ20 ప్రపంచకప్ లో సూపర్ 8కు అర్హత సాధించింది. పాకిస్థాన్ ను భారత్ 61 పరుగుల తేడాతో ఓడించింది. ఇషాన్ కిషన్ 77 రన్స్ తో సత్తాచాటాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


