...
...
Next Story

కోహ్లీ కాదు, రోహిత్​ కాదు- ఈ 2025లో భారతీయులు ఎక్కువగా గూగుల్​ సెర్చ్​ చేసిన క్రికెటర్​ ఇతనే..

మన దేశంలో క్రికెట్​ అంటే ముందుగా గుర్తొచ్చేది విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ! కానీ గూగుల్ విడుదల చేసిన​ Year in Search 2025 లిస్ట్​లో వారిద్దరిలో ఒక్కరు కూడా మొదటి స్థానంలో నిలవలేదు! ఒక యువ సంచలనం గురించి తెలుసుకునేందుకు భారతీయులు విపరీతంగా సెర్చ్​ చేశారు!

Published on: Dec 6, 2025, 06:04:33 IST
Advertisement

మచ్​ అవైటెడ్​ ‘Year in Search 2025’ (ఈ ఏడాది ఎక్కువగా వెతికిన అంశాలు 2025) నివేదికను గూగుల్ సంస్థ ఇటీవలే విడుదల చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో అత్యధికంగా ‘ట్రెండింగ్‌’లో నిలిచిన క్రికెట్ ప్రముఖుల టాప్ 10 జాబితాలో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ స్థానం దక్కించుకోలేకపోయారు! భారతీయులు అత్యధికంగా గూగుల్​ సెర్చ్​ చేసిన క్రికెటర్స్​ జాబితాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టాప్​లో నిలిచాడు!

గూగుల్ డేటా ప్రకారం.. సూర్యవంశీ తర్వాత స్థానంలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన ఐపీఎల్ స్టార్ ప్రియాన్ష్ ఆర్య ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో మరో యువ సంచలనం అభిషేక్ శర్మ, షేక్ రషీద్ నిలిచారు.

భారతదేశానికి మొట్టమొదటి మహిళల ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యురాలు జెమీమా రోడ్రిగ్స్ ఈ జాబితాలో ఐదొవ స్థానంలో ఉండగా, ఆమె తర్వాత ఆయుష్ మాత్రే, స్మృతి మంధాన ఉన్నారు. కరుణ్ నాయర్, ఉర్విల్ పటేల్, విఘ్నేష్ పుత్తూర్ టాప్ 10ను పూర్తి చేశారు.

మహిళల క్రికెట్‌కు ఈ ఏడాది ఒక అద్భుతమైన సంవత్సరంగా మారింది. ట్రెండింగ్ మహిళా క్రికెటర్ల జాబితాలో జెమీమా రోడ్రిగ్స్ ‘టాప్ ఉమెన్ పర్సనాలిటీ’గా నిలిచింది. ఈ జాబితాలో మంధాన, షఫాలీ వర్మ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

ట్రెడింగ్​ లిస్ట్​లో టాప్​లో నిలిచిన క్రికెటర్లు..

రోహిత్, విరాట్‌లను సూర్యవంశీ ఎలా అధిగమించాడు?

అప్పటి నుంచి సూర్యవంశీ వెనుదిరిగి చూడలేదు. ఇండియా అండర్-19 జట్టు తరఫున ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ గడ్డలపై సెంచరీలు చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఆ వెంటనే, దోహాలో జరిగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో ఇండియా 'ఏ' జట్టు తరఫున కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో కూడా అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఇక రోహిత్, కోహ్లీ విషయానికొస్తే, ఈ మాజీ భారత కెప్టెన్లు టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయ్యి, కేవలం 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడడంపై దృష్టి పెట్టారు. ఐపీఎల్‌తో పాటు రోహిత్-కోహ్లీ ద్వయం 2025లో ఇప్పటివరకు 13 వన్డేలు మాత్రమే ఆడారు. ఈ ఏడాదిని ముగించడానికి డిసెంబర్ 6న దక్షిణాఫ్రికాతో ఒక 50 ఓవర్ల మ్యాచ్ ఆడనున్నారు.

రోహిత్, విరాట్‌లు భారతదేశంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్లలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, వారు పరిమిత సంఖ్యలో మ్యాచ్‌లు ఆడటం వల్లే 2025లో వారి సెర్చ్ వాల్యూమ్‌లు తగ్గి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

2025లో భారత్‌లో గూగుల్ ట్రెండింగ్‌ సెర్చ్​లో క్రికెట్ ఆధిపత్యం..

ఈ ఏడాదిలో భారతదేశంలో గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చ్​లో క్రికెట్ ఆధిపత్యం చెలాయించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జాబితాలో అగ్రస్థానంలో నిలవగా, ఇతర క్రీడా ఈవెంట్లు అయిన ఆసియా కప్ (మూడో స్థానం), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (నాలుగో స్థానం), ప్రో కబడ్డీ లీగ్ (ఐదో స్థానం), మహిళల ప్రపంచకప్ (ఏడో స్థానం) కూడా టాప్ 10లో తమ స్థానాన్ని దక్కించుకున్నాయి.

భారతదేశంలో గూగుల్ అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాలు:

ఇండియన్ ప్రీమియర్ లీగ్

గూగుల్ జెమిని

ఆసియా కప్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ

ప్రో కబడ్డీ లీగ్

మహా కుంభమేళా

మహిళల ప్రపంచకప్

గ్రోక్

సైయారా

ధర్మేంద్ర

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks