...
...
Next Story

ఆ 3 రోజులు చిక్కుకుపోయిన ప్రయాణీకులకు ఇండిగో గుడ్‌న్యూస్! 10,000 వోచర్లు ఆఫర్

డిసెంబర్ 3 నుంచి 5 తేదీల మధ్య విమానాశ్రయాలలో చిక్కుకుపోయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకులకు ఆ సంస్థ ₹10,000 విలువైన ట్రావెల్ వోచర్లను నష్టపరిహారంగా ప్రకటించింది. ఈ వోచర్లు 12 నెలల కాలానికి చెల్లుబాటు అవుతాయి. టిక్కెట్ రిఫండ్‌తో పాటు ఈ పరిహారం అదనంగా లభిస్తుందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.

Published on: Dec 11, 2025, 14:16:45 IST
Advertisement

డిసెంబర్ 3 నుంచి 5 తేదీల మధ్య వివిధ విమానాశ్రయాలలో చిక్కుకుపోయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకులకు ఆ సంస్థ తీపి కబురు అందించింది. ఆ ప్రయాణీకులకు 10,000 విలువైన పరిహారం అందిస్తామని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆ 3 రోజులు చిక్కుకుపోయిన ప్రయాణీకులకు ఇండిగో గుడ్‌న్యూస్!  ₹10,000 వోచర్లు ఆఫర్ (Santosh Kumar/ Hindustan Times)
ఆ 3 రోజులు చిక్కుకుపోయిన ప్రయాణీకులకు ఇండిగో గుడ్‌న్యూస్! ₹10,000 వోచర్లు ఆఫర్ (Santosh Kumar/ Hindustan Times)

ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటన ప్రకారం, ఈ పరిహారం ట్రావెల్ వోచర్ల రూపంలో ఉంటుంది. ఈ వోచర్‌లు జారీ చేసిన తేదీ నుంచి 12 నెలల కాలానికి చెల్లుబాటు అవుతాయి.

ప్రయాణీకులకు చెల్లించే విమాన టిక్కెట్ రిఫండ్‌తో పాటు ఈ 10,000 నష్టపరిహారం అదనంగా లభిస్తుంది.

"డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ప్రయాణించిన మా కస్టమర్‌లలో కొంతమంది కొన్ని విమానాశ్రయాలలో చాలా గంటలు చిక్కుకుపోవడం, రద్దీ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడటాన్ని ఇండిగో చింతిస్తూ అంగీకరిస్తోంది. తీవ్రంగా ప్రభావితమైన అటువంటి కస్టమర్‌లకు 10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందిస్తాం. ఈ ట్రావెల్ వోచర్‌లను రాబోయే 12 నెలల పాటు ఇండిగో ప్రయాణాలకు ఉపయోగించుకోవచ్చు" అని ఇండిగో తెలిపింది.

అదనపు పరిహారం, రిఫండ్‌లు

ఈ వోచర్‌ల రూపంలో ఇచ్చే పరిహారం... ప్రయాణీకులకు చెల్లించే విమాన టిక్కెట్ రిఫండ్‌తో పాటు అదనంగా లభిస్తుంది.

సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఇండిగో ఎయిర్‌లైన్స్.. ఇప్పటికే చాలా వరకు రిఫండ్‌లను క్లియర్ చేశామని, మిగిలినవి కూడా త్వరలో పూర్తవుతాయని తెలిపింది.

ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల ప్రకారం ఉన్న పరిహారానికి కూడా ఇండిగో కట్టుబడి ఉంది. ఆ మార్గదర్శకాల ప్రకారం, విమానం బయలుదేరడానికి 24 గంటలలోపు రద్దయిన విమానాల కస్టమర్‌లకు విమానం 'బ్లాక్ టైమ్' ఆధారంగా 5,000 నుండి 10,000 వరకు పరిహారం అందిస్తామని ఇండిగో పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe